Ipl aipoina mana Srh page admin assalu form taggaledu. Trend baga follow avutunnaru. “Em ledu friends… saradaga post cheyali anipinchindi” ane video entha viral ayyindo special ga cheppanavasaram ledu anukunta. Dani pai enno memes kuda vachayi. Ippudu srh admin kuda ide trend follow ayyaru. Rashid Khan and Khaleel Ahmed photo lu post chesi “em ledu just post cheyali anipinchindi chesam” antu trend follow ayyaru. Deenipai enno memes kuda vachayi. Avi oka look veskondi.!

News
నయనతార గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా? డయానా నుండి నయనతారగా ఎలా మారిందంటే?
ఎక్కడి నుండో వచ్చిన ఒక వ్యక్తి ఎంతో కష్టపడి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం, తర్వాత ఆ గుర్తింపును నిలబెట్టుకోవడం అంటే చిన్న విషయం కాదు. ముఖ్యంగా సినిమా విడుదల అయ్యే ఒక రోజు తో భవిష్యత్తు మారిపోయే సినిమా ఇండస్ట్రీలో అయితే ఇంకా కష్టం.

పైకి నవ్వుతూ, స్టైల్ గా, అందరితో సరదాగా మాట్లాడుతూ ఉండే స్టార్లు, వాళ్ళు ఇవాళ ఉన్న ఆ స్థానానికి రావడం వెనకాల ఎన్నో త్యాగాలు, కష్టాలు, గొడవలు, హార్ట్ బ్రేక్స్, నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ ఉంటాయి.

అలా అన్ని తట్టుకుని నిలబడితేనే సినీ చరిత్రలో వాళ్ళకంటూ ఒక పేజీ సంపాదించగలుగుతారు. అలా ఎన్నో కష్టాలను భరించి లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన నటి నయనతార. నయనతార జీవితం పైకి కనిపించినంత సాఫీగా సాగలేదు. డయానా నుండి నయనతార వరకు ఎదిగిన లేడీ సూపర్ స్టార్ జర్నీ ఇప్పుడు చూద్దాం.

నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. ఒక మలయాళ కుటుంబంలో జన్మించింది డయానా. డయానా తండ్రి ఎయిర్ ఫోర్స్ అధికారి కావడంతో తన విద్య మొత్తం వేర్వేరు ప్రాంతాల్లో జరిగింది. పార్ట్ టైం గా మోడలింగ్ మొదలు పెట్టింది డయానా.

తర్వాత ఒక మలయాళ ఛానల్లో యాంకర్ గా చేరింది. కొద్దిరోజులకే ఒక మలయాళం వీక్లీ లో నయనతార మోడలింగ్ చేసిన జెవెలరీ అడ్వటైజ్మెంట్ చూసిన మలయాళ దర్శకుడు సత్యన్ అంతికాడ్ డయానా ని సినిమాలో చేయమని అడిగారు. మొదట వద్దు అనుకున్నా కూడా ఒక్క సినిమా చేసి చూద్దాం అనే ఉద్దేశంతో సరేనని చెప్పింది డయానా.

కానీ అప్పటికి డయానా అనే ఒక అడల్ట్ ఫిలిం వచ్చింది. అందుకే సత్యన్ అంతికాడ్ డయానా పేరు మార్చాలి అనుకున్నారు. సత్యన్ తో కలిసి ఆ సినిమాలో నటిస్తున్న నటులు షీలా, జయరామ్ నయనతార పేరుని ఫైనల్ చేశారు. ఈ పేరు సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా వర్క్ అవుతుంది అనుకున్నారట. అలా మనసిక్కరే సినిమాతో నయనతార గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

మొదటి సినిమా పెద్ద హిట్. దాంతో నయనతార కి వరుసగా సినిమా ఆఫర్లు రావడం మొదలు అయ్యాయి. అలా మూడు మలయాళ సినిమాలు చేసిన తర్వాత అయ్యా సినిమాతో తమిళ్ లో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి చంద్రముఖి సినిమాలో నటించింది. ఆ సినిమాతో తెలుగు వాళ్లకి కూడా తెలియడంతో డైరెక్ట్ తెలుగు సినిమా లక్ష్మి తో తెలుగు ఇండస్ట్రీ ని కూడా పలకరించింది.

తర్వాత చాలా సినిమాలు చేసింది. దాదాపు అన్ని హిట్ సినిమాలే. కానీ టర్నింగ్ పాయింట్ అనే సినిమా రాలేదు. గ్లామరస్ పాత్రలు చేసినా సరే నటన పరంగా కూడా ప్రతి పాత్రకు తన వంతు న్యాయం చేసింది.

అయినా ఏది చెప్పుకో దగ్గ చిత్రం అనిపించడంలేదు. మధ్యలో వ్యక్తిగత సమస్యలు కూడా వచ్చాయి. అయినా సరే అవన్నీ పట్టించుకోకుండా, ఒకవేళ పట్టించుకున్నా కూడా ఏవి బయటికి కనిపించకుండా సీరియస్ గా కెరీర్ మీద దృష్టి పెట్టింది.

హీరోయిన్లని ఏ డైరెక్టర్ అయినా గుర్తిస్తారు. కానీ నటులని గుర్తించిన వారే గొప్ప డైరెక్టర్లు అవుతారు. అలా తనలోని నటిని గుర్తించిన డైరెక్టర్ బాపుగారు. బాపు సినిమా అంటే ఇష్టపడని తెలుగు వాళ్ళు ఉండరు, ఒకవేళ ఆయన సినిమాలో నటించే అవకాశం వస్తే వద్దనుకునే నటులు కూడా ఉండరు.

ఇంగ్లీష్ లో వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం అంటారు. అంటే జీవితంలో ఒకటేసారి వచ్చే అవకాశం అని అర్థం. బాపు గారితో కలిసి పని చేయడం కూడా అలాంటి అవకాశమే. అందుకే నయనతార కూడా బాపు గారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావించి ఒప్పుకున్నారు.

బాపు గారి సినిమా అది కూడా శ్రీరామరాజ్యం లాంటి సినిమా అందులో సీతమ్మ పాత్ర. ఈ సినిమా ఎనౌన్స్ చేసిన వెంటనే అసలు నయనతార ఏంటి? తను ఏం చేయగలుగుతుంది? అన్న వాళ్లు ఎంతో మంది. కానీ నయనతార అవేమీ పట్టించుకోకుండా తన పాత్ర మీద దృష్టి పెట్టారు.

ఇంకొక విషయం ఏంటంటే అప్పటికే నయనతార ఒక ప్రముఖ వ్యక్తి తో ప్రేమ లో ఉన్నారు. ఈ సినిమా తర్వాత పెళ్లి చేసుకొని ఇంక సినిమాలు ఆపేద్దామని నయనతార నిర్ణయించుకున్నారు. అందుకే ఈ సినిమా షూటింగ్ ముగిసిన తర్వాత తనకు అంత మంచి పాత్ర ఇచ్చినందుకు బాపు గారికి థాంక్స్ చెప్పి ఏడ్చేశారు. అంతేకాకుండా సినిమాకి పనిచేసిన బృందం మొత్తానికి వాచ్ లు బహుమతిగా ఇచ్చారు.

అప్పుడే అనుకోకుండా తను ప్రేమించిన వ్యక్తితో విడిపోవాల్సి వచ్చింది. ఇప్పటివరకు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ధైర్యంగా అధిగమించిన నయనతార ఈ సమస్యను తట్టుకోలేకపోయారు. దాంతో దాదాపు పదకొండు నెలల వరకు మీడియా ముందుకు రాలేదు.

సినిమాల నుండి కూడా బ్రేక్ తీసుకున్నారు. అంతలోపు శ్రీరామరాజ్యం విడుదల అయింది. సినిమాని తెలుగులో తీసినా కూడా తమిళం, మలయాళం భాషల్లో అనువాదం అయ్యింది.

నయనతార ఎంత మంచి నటో ఒక్క తెలుగు భాష లోనే కాకుండా మిగిలిన భాషలలో కూడా తెలిసింది. అంత గొప్ప పాత్ర లో ఆమె ఎలా నటిస్తుంది? అని కామెంట్ చేసిన వారే అంత గొప్ప పాత్రలో ఎంత బాగా నటించింది అని ప్రశంసించారు.

నయనతార సినిమాలని వద్దనుకుంది. కానీ సినిమాలు నయనతారను వద్దు అనుకోలేదు. తెలుగులో టర్నింగ్ పాయింట్ ఈ సినిమాతో వచ్చింది. ఇప్పుడు తమిళ్ సినిమాలో కూడా తను మంచి నటి అని నిరూపించుకోవాలి. అప్పుడు వచ్చిన అవకాశమే రాజా రాణి. కొత్త దర్శకుడు. సినిమాలో స్టార్లు కూడా లేరు.

పాటలు బాగుండడంతో ఏదో మంచి ఫీల్ గుడ్ సినిమా ఏమో అనుకొని జనాలు థియేటర్ లోకి వెళ్లారు. కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఎంతో మంది ఈ సినిమా లో పాత్రలకి కనెక్ట్ అయ్యారు. అప్పుడు వచ్చింది నయనతారకి చెప్పుకోదగ్గ సినిమా. ఇంక తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు.

అప్పటివరకు పెద్ద బ్యానర్లు, లేదా పెద్ద హీరోలు, ఉన్న సినిమాలు చేసి ఎప్పుడూ అంత పెద్దగా రిస్క్ తీసుకోని నయనతార రాజా రాణి సినిమా తర్వాత నుండి కథని మాత్రమే దృష్టిలో పెట్టుకొని పాత్రలు ఎంచుకోవడం మొదలుపెట్టారు. హీరోయిన్ నయనతార అనే ఇమేజ్ నుండి బయటికి వచ్చి నటి నయనతార అని నిరూపించే సినిమాలు ఎన్నో చేశారు.

అప్పటివరకు గ్లామరస్ హీరోయిన్ అనే దృష్టితో సినిమాలు చూసిన ప్రేక్షకులు కూడా అప్పటి నుండి నయనతారని గౌరవించడం మొదలుపెట్టారు. మీరు ఒక్కసారి మొదటి నుండి చదివితే ముందు ది తో తన జర్నీ గురించి చెప్పడం మొదలుపెట్టి ఇప్పుడు రు కి వచ్చాం. దాని అర్థం కాలక్రమేణా మనకి నయనతార మీద పెరిగిన గౌరవాన్ని చూపించడానికి మాత్రమే.

పాత్రకి పాత్రకి సంబంధం లేకుండా, కొత్త దర్శకులా పాత దర్శకులా అన్న తేడా లేకుండా ఏది మంచి పాత్ర అనిపిస్తే ఆ సినిమాను ఒప్పుకుంటున్నారు. అలా అని కమర్షియల్ చిత్రాల ను పూర్తిగా వదిలేయకుండా అప్పుడప్పుడు బిగిల్, దర్బార్ వంటి సినిమాలు కూడా చేస్తున్నారు.

గజిని సినిమా చేసిన నయనతార, సింహ సినిమా చేసిన నయనతార ఒకరే. బిల్లా (తమిళ్), యోగి వంటి గ్లామరస్ పాత్రలో నటించిన నయనతార యారడీ నీ మోహిని (ఆడవారి మాటలకు అర్థాలే వేరులే తమిళ్ రీమేక్) సినిమాలో సాధారణంగా, ఐరా సినిమాలో డి గ్లామర్ పాత్రలో కూడా నటించారు. అప్పుడు ఇప్పుడు నయనతార ఒక్కరే. కానీ మారిందల్లా ప్రేక్షకులు తనను చూసే విధానం.

పదిహేడేళ్ల సినీ కెరీర్. ఎన్నో కాంట్రవర్సీలు, మీడియాలో ఎన్నోసార్లు తన పేరు వచ్చింది, ఎన్నో పుకార్లు కూడా వచ్చాయి అయినా సరే ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్క పుకారు కి కూడా పెద్దగా స్పందించలేదు. ఏ ఒక్క సోషల్ మీడియాలోనూ తనకి ఎకౌంట్ లేదు. అంతకుముందు సినిమా ప్రమోషన్ కోసం మీడియాతో మాట్లాడేవారు. ఇప్పుడు సినిమా ప్రమోషన్ కి కూడా రాను అని సినిమా సైన్ చేసేటప్పుడే చెప్పేస్తున్నారు.

అయినా సరే దర్శకులు ఆమెతో పని చేయడానికి ఇష్టపడుతున్నారు. దానికి కారణం కేవలం పనిమీద తనకి ఉన్న శ్రద్ధ మాత్రమే. మీరు ఒకసారి గమనిస్తే మన తెలుగులో నయనతార చేసిన సినిమాలు తమిళం తో పోలిస్తే తక్కువే. అయినా సరే రెండు తెలుగు రాష్ట్రాల్లో నయనతార కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు ఉన్నారు. కానీ కేవలం మన పని మాత్రమే మాట్లాడాలి అనే నటులు మాత్రం తక్కువ మంది ఉంటారు. వాళ్లే ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ కన్సిస్టెంట్ గా సినిమాలు చేస్తూ మనల్ని అలరిస్తూ ఉంటారు. వాళ్లలో నయనతార ఒకరు.

సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు, మధ్యలో కాంట్రవర్సీలు వచ్చాయి కానీ సినిమా ఆఫర్లు మాత్రం వాటి వల్ల వచ్చినవి కావు.డయానా నుండి నయనతార గా మారడం అంటే కేవలం పేరు మార్చుకోవడం మాత్రమే కాదు. ఆ పేరు వెనకాల ఉన్న 17 ఏళ్ల కష్టం. ఆ కష్టాలను అధిగమించి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందుకు వెళ్ళిన ధైర్యం.

భవిష్యత్తులో కూడా నయనతార ఇలాగే మంచి సినిమాలు చేస్తూ గొప్ప నటి అని నిరూపించుకోవాలి కాదు కాదు గొప్ప నటి అన్న పేరును నిలబెట్టుకోవాలి అని ఆశిద్దాం.
రిలీజ్ అయిన చాలా రోజులకి టీవీలో టెలికాస్ట్ అయిన 26 సినిమాలు…లిస్ట్ ఓ లుక్ వేయండి.!
కొన్ని సినిమాలు మనం ఎంతో కష్టపడి గంటల తరబడి ఆన్లైన్ బుకింగ్ వెబ్సైట్ ముందు కూర్చొని ఎక్కడ సీటు దొరికితే ఆ థియేటర్లో చూస్తాం. కానీ మనం అలా చూసి నెల రోజులు కూడా అవ్వదు అప్పుడే టీవీ లో వేస్తాడు. కొన్ని సినిమాలు విడుదలైన కొన్ని నెలల తేడాలో టీవీ లో వేస్తాడు.
కానీ కొన్ని సినిమాలు మాత్రం విడుదల అయ్యి సంవత్సరాలు దాటినా కూడా టీవీ లో టెలికాస్ట్ చేయరు. లాక్ డౌన్ లో మాత్రం విడుదలై చాలా కాలం అయిన సినిమాలను టీవీలో ప్రసారం చేస్తున్నారు. అలా విడుదలయిన ఎంతోకాలం తర్వాత టీవీలో వచ్చిన, రాబోతున్న, అసలు ఎప్పుడు వస్తాయో తెలియని కొన్ని సినిమాలు ఇవే.
ఈ జాబితాలో తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా ఉంటాయి. కొన్ని సినిమాల సాటిలైట్ రైట్స్ కూడా ప్రస్తుతానికైతే ఏ ఛానల్ తీసుకోలేదు.
#1 జెండాపై కపిరాజు
విడుదలైన సంవత్సరం – 2015
టెలికాస్ట్ అయిన సంవత్సరం – 2020
టెలికాస్ట్ చేసిన ఛానల్ – స్టార్ మా

#2 జబర్దస్త్
విడుదలైన సంవత్సరం – 2013
ఇప్పటివరకు ఇంకా టీవీ లో టెలికాస్ట్ అవ్వలేదు

#3 అ!
విడుదలైన సంవత్సరం – 2018

#4 గృహం
విడుదలైన సంవత్సరం – 2017
ఇప్పటివరకు ఇంకా టీవీ లో టెలికాస్ట్ అవ్వలేదు

#5 ఈ నగరానికి ఏమైంది
విడుదలైన సంవత్సరం – 2018
ఇప్పటివరకు ఇంకా టీవీ లో టెలికాస్ట్ అవ్వలేదు

#6 కేరాఫ్ కంచరపాలెం
విడుదలైన సంవత్సరం – 2018
ఇప్పటివరకు ఇంకా టీవీ లో టెలికాస్ట్ అవ్వలేదు

#7 మను
విడుదలైన సంవత్సరం – 2018
ఇప్పటివరకు ఇంకా టీవీ లో టెలికాస్ట్ అవ్వలేదు

#8 కే జి ఎఫ్
విడుదలైన సంవత్సరం – 2018
టెలికాస్ట్ అయిన సంవత్సరం – 2020
టెలికాస్ట్ చేసిన ఛానల్ – స్టార్ మా

#9 ఐ
విడుదలైన సంవత్సరం – 2015
టెలికాస్ట్ అయిన సంవత్సరం – 2020
టెలికాస్ట్ చేసిన ఛానల్ – స్టార్ మా

#10 సాహో
విడుదలైన సంవత్సరం – 2019
ఇప్పటివరకు ఇంకా టీవీ లో టెలికాస్ట్ అవ్వలేదు

#11 ఎటో వెళ్ళిపోయింది మనసు
విడుదలైన సంవత్సరం – 2012
టెలికాస్ట్ అయిన సంవత్సరం – 2017
టెలికాస్ట్ చేసిన ఛానల్ – స్టార్ మా

#12 గేమ్ ఓవర్
విడుదలైన సంవత్సరం – 2019
టెలికాస్ట్ అయిన సంవత్సరం – 2020
టెలికాస్ట్ చేసిన ఛానల్ – స్టార్ మా 
#13 ఫలక్ నామా దాస్
విడుదలైన సంవత్సరం – 2019
ఇప్పటివరకు ఇంకా టీవీ లో టెలికాస్ట్ అవ్వలేదు

#14 ఎన్టీఆర్ మహానాయకుడు
విడుదలైన సంవత్సరం – 2019
ఇప్పటివరకు ఇంకా టీవీ లో టెలికాస్ట్ అవ్వలేదు

#15 నవాబ్
విడుదలైన సంవత్సరం – 2018
ఇప్పటివరకు ఇంకా టీవీ లో టెలికాస్ట్ అవ్వలేదు

#16 పరమవీరచక్ర
విడుదలైన సంవత్సరం – 2011
ఇప్పటివరకు ఇంకా టీవీ లో టెలికాస్ట్ అవ్వలేదు

#17 త్రీ
విడుదలైన సంవత్సరం – 2012
ఇప్పటివరకు ఇంకా టీవీ లో టెలికాస్ట్ అవ్వలేదు

#18 తిక్క
విడుదలైన సంవత్సరం – 2016
టెలికాస్ట్ అయిన సంవత్సరం – 2020
టెలికాస్ట్ చేసిన ఛానల్ – స్టార్ మా

#19 సూర్యకాంతం
విడుదలైన సంవత్సరం – 2019
ఇప్పటివరకు ఇంకా టీవీ లో టెలికాస్ట్ అవ్వలేదు

#20 ఆఫీసర్
విడుదలైన సంవత్సరం – 2018
ఇప్పటివరకు ఇంకా టీవీ లో టెలికాస్ట్ అవ్వలేదు
![]()
#21 శివ తాండవం
విడుదలైన సంవత్సరం – 2012
టెలికాస్ట్ అయిన సంవత్సరం – 2020
టెలికాస్ట్ చేసిన ఛానల్ – స్టార్ మా

#22 నవమన్మధుడు
విడుదలైన సంవత్సరం – 2015
టెలికాస్ట్ అయిన సంవత్సరం – 2020
టెలికాస్ట్ చేసిన ఛానల్ – స్టార్ మా

#23 ఎన్ జి కె
విడుదలైన సంవత్సరం – 2019
టెలికాస్ట్ అయిన సంవత్సరం – 2020
టెలికాస్ట్ చేసిన ఛానల్ – స్టార్ మా

#24 రన్
విడుదలైన సంవత్సరం – 2016
టెలికాస్ట్ అయిన సంవత్సరం – 2020
టెలికాస్ట్ చేసిన ఛానల్ – స్టార్ మా

#25 పోలీసోడు
విడుదలైన సంవత్సరం – 2016
టెలికాస్ట్ అయిన సంవత్సరం – 2020
టెలికాస్ట్ చేసిన ఛానల్ – స్టార్ మా

#26 ఘాజీ
విడుదలైన సంవత్సరం – 2017
ఇప్పటివరకు ఇంకా టీవీ లో టెలికాస్ట్ అవ్వలేదు

ఆలస్యంగా టీవీ లో టెలికాస్ట్ అయిన కొన్ని చిత్రాలు ఇవే. కొన్ని సినిమాలు అయితే ఇంకా శాటిలైట్ రైట్స్ ఏ ఛానల్ తీసుకుంది అనే సమాచారం కూడా లేదు. చాలా మంది ప్రేక్షకులు కూడా ఈ సినిమాలు టీవీలో ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తూ ఉన్నారు. లాక్ డౌన్ సమయంలో అయినా ఈ సినిమాలు టీవీ లో ప్రసారం అవ్వచ్చేమో చూద్దాం.
ప్రెసిడెంట్ గా తప్పుకున్నాక “ట్రంప్” కి వచ్చే పెన్షన్, ఇతర బెనిఫిట్స్ ఏంటో తెలుసా.?
అమెరికా తమ కొత్త అధ్యక్షుడి పదవిలోకి జో బైడెన్ కి స్వాగతం పలికింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మెజారిటీ ఓట్లతో జో బైడెన్ గెలవగా, డోనాల్డ్ ట్రంప్ ఓడిపోయారు. జనవరి 20 వ తేదీన అమెరికా 46 వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. అప్పటి వరకు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు పదవిలో ఉంటారు.

ఎన్నికలపై దాదాపు నాలుగు రోజుల ఉత్కంఠ నెలకొన్న తర్వాత రిజల్ట్ వెల్లడయింది. కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం జనవరిలో ఉన్నా కూడా రాబోయే కొత్త అధ్యక్షుడికి, ఉపాధ్యక్షులకు రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ కార్యాలయాలను కేటాయిస్తారు.

అలా జో బైడెన్ కి, అలాగే వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన కమల హ్యారిస్ కి తాత్కాలిక కార్యాలయ సదుపాయాలు కల్పించారు. దాంతో వీరికి ప్రమాణ స్వీకారం లోపు ప్రభుత్వం లోని వివిధ పదవులపై అనలైజ్ చేసే వీలు దొరుకుతుంది. అమెరికా ప్రభుత్వం మాజీ అధ్యక్షులకి కూడా కొన్ని ప్రయోజనాలు కల్పిస్తోంది.

దేశానికి సేవలందించిన కారణంగా ప్రభుత్వం వీళ్ళకి పెన్షన్ ఇస్తుంది. సెక్రటరీ ఆఫ్ ట్రెజరీ, ఏడాదికి 2,19,200 డాలర్లు అంటే దాదాపు రూ.1.6 కోట్ల రూపాయల పెన్షన్ మంజూరు చేస్తుంది. ఆన్యువల్ రివ్యూ ఆధారంగా పెన్షన్ లో మార్పులు జరుగుతాయి.

మాజీ అధ్యక్షుడి భార్యకి ఏడాదికి 20 వేల డాలర్ల పెన్షన్ అందజేస్తారు. అధ్యక్షుడి స్థానం నుండి తప్పుకుని, వైట్ హౌస్ వీడిన తర్వాత ఏడు నెలల పాటు వ్యక్తిగత ఆఫీస్ ఏర్పాటు చేసేందుకు ఖర్చు అయ్యే అద్దె, పోస్టల్, టెలిఫోన్, ప్రింటింగ్ కి అయ్యే మొత్తాన్ని ప్రభుత్వం ఇస్తుంది.
రాగిణి కష్టాలు తెలిస్తే కన్నీళ్లొస్తాయి.. పన్నెండేళ్లకే పెళ్లి, ఏడాదికే బాబు.. భర్తతో విడిపోవడానికి కారణం అదే.
బుల్లితెర యాక్టర్స్ చాలామంది వారి సొంత పేర్లతో కన్నా ఆయా సీరియళ్లలో వారి పాత్రల పేరుతోనే ఎక్కువగా గుర్తుంటారు. అలాంటి వారిలో రాగిణి ఒకరు.. పేరు తెలియకపోయినా ముఖం చూడగానే ఇట్టే గుర్తు పట్టేస్తారు.ఒకటా రెండా సుమారు 35ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉండి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటి .సుమారు 550 సీరియళ్లు,190 సినిమాల్లో నటించిన రాగిణి ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఎప్పుడో దూరదర్శన్ కాలం నుండి ఇండస్ట్రీలో ఉన్న రాగిణి ఎక్కువగా కామెడి పాత్రలు పోషించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. కాని ఆ నవ్వుల వెనుక ఎంత విషాదం ఉందో ఇటీవలే చాలామందికి తెలిసింది. అమృతం సీరియళ్లో ప్రధాన పాత్రలు అన్ని మారినప్పటికి అంజి, శాంతగా గుండు హనుమంతరావు, రాగిని పాత్రలు మాత్రం మారలేదు.అంటే ఆ పాత్రల్లో వారు ఒదిగిపోయిన తీరు, ప్రేక్షకులు వారిని ఎంతగా ఆదరించారనేది అర్దమవుతోంది.

పదమూడు మంది సంతానంలో రాగిణి 12 సంతానం . అక్కలందరూ ఎవరి జీవితాల్లో వారు స్థిరపడ్డాక రాగిణి వంతు వచ్చేసరికి తండ్రి పక్షవాతంతో మంచాన పడ్డాడు. దాంతో కనీసం స్కూల్ ముఖం కూడా చూడలేకపోయారట. కుటుంబ పోషణ కూడా రాగిణిపైనే పడడంతో, ఎనిమిదేళ్ల వయసు నుండే డబ్బులకు డ్యాన్స్ చేసేవారట.నెల అంతా కష్టపడితే మూడువేల రూపాయలు వస్తే, వాటిలో ఇంటి అద్దెకి 750పోను, తండ్రి మందుల ఖర్చుకి వెయ్యి రూపాయలు పోగా మిగిలిన డబ్బుతో కుటుంబపోషణ, తన ఖర్చులు చూసుకునేవారట. రాగిణి అక్క క్రిష్ణవేణి, పెద్దక్క కూతురు రజిత ఇద్దరూ కూడా ఇండస్ట్రీలో ఉన్నారు . క్రిష్ణవేణి ప్రోద్బలంతోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు రాగిణి .

చాలామందికి రాగిణికి పెళ్లి కాలేదు అనే తెలుసు, కాని తనకు పెళ్లయింది, ఒక బాబు కూడా ఉన్నాడు అని చెప్పుకొచ్చారు రాగిణి. తన కొడుకు పేరు కిరణ్ అని, జర్మనీలో సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడని అన్నారు.తన వైవాహిక బంధం గురించి తనన మాటల్లోనే “ పన్నెండేళ్లప్పుడు మా పెద్దక్క తీస్కెళ్లి పెళ్లి చేసింది. ఏడాదిపాటు బానే ఉంది, ఆ ఏడాదిలోనే బాబు పుట్టాడు. కాని అతడికి డబ్బు పిచ్చి, రోజు మందుకావాలి, ఇంటికొచ్చే సరికి ఉన్నాలేకపోయినా వండిపెట్టాలి. ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్లంటే అతడికి చిన్నచూపు, ఏదైనా చేసి సంపాదించమని అనేవాడు, అవన్నీ భరించలేక నీ దారి నీది, నా దారి నాది అని దండం పెట్టేసాను” అని చెప్పుకొచ్చారు.

ఇండస్ట్రీలోని కాస్టింగ్ కౌచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాగిణి..ఇండస్ట్రీలో మహిళల పట్ల చిన్నచూపు ఉంది, ఇబ్బందులు పెడతారు అనేది వాస్తవమే , కాని నేను ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోలేదు. రెండు చేతులు జోడించి సార్, నమస్కారం అని మాట్లాడితే వాళ్లు కూడా సంస్కారంతోనే మాట్లాడతారు. అలా కాకుండా వాళ్ల మీద పడిపోతూ, భుజాలుభుజాలు రాస్తూ సార్ అని సాగదీస్తే, ఖాళీగా ఉన్నావా? వస్తావా అనే అడుగుతారు..కాబట్టి ఏదైనా మన బిహేవియర్ పైన ఆధారపడి ఉంటుంది అని వాఖ్యలు చేశారు రాగిణి.
1980లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమై తన నటనతో అందరి చేత ఫుల్ మాక్స్ వేయించుకున్న రాశి ఆతరువాత తన తండ్రి కోరిక మేర తెలుగు,తమిళ్,హిందీ భాషలలో హీరోయిన్ గా రాణించారు.అప్పట్లో రాశి నటనకు ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యేవారు.అలాంటి రాశి సడన్ గా పెళ్లి చేసుకొని చాలాకాలం పాటు అటు సినిమాలకు,ఇటు మీడియాకు దూరంగా ఉంటూ వచ్చారు.అలాంటి రాశి గారి లవ్ స్టోరీ గురించి ఆమె పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం.

తండ్రి కోరిక మేర హీరోయిన్ గా సినిమాల్లోకి అడుగుపెట్టిన రాశి.తన నటన,అందంతో అందరినీ ఆకట్టుకున్నారు. అలా ఎనిమిదేళ్లు టాప్ హీరోయిన్ గా కొనసాగిన రాశి. అవకాశాలు తగ్గిపోవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.ఈ టైంలో రాశి గారికి వందల కోట్ల ఆస్తి ఉన్నవాళ్ళ సంబంధాలు వచ్చాయి.కాని వాటన్నిటినీ తిరస్కరించిన రాశి ఒక సహాయక దర్శకుడిని పెళ్లి చేసుకొని హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు.
ఇంతకీ ఆ సహాయక దర్శకుడు ఎవరంటే శ్రీ ముని.ఈయన రాశి నటించిన పలు చిత్రాలలో సహాయక దర్శకుడిగా పని చేశారు.అక్కడ పరిచయమైన వారు మంచి స్నేహితులుగా మారారు. నాకు సంబంధాలు చూస్తున్న సమయంలో మా తండ్రిగారు చనిపోవడంతో నేను నా బాధను శ్రీ మునితోనే పంచుకున్నానని రాశి గారు అన్నారు.అలాగే స్వయంగా తాను కొద్దిరోజులు గడిచాక నన్ను పెళ్లి చేసుకుంటావా అని శ్రీమునిని అడిగారట.దానికి శ్రీ ముని కూడా సరే అనడంతో ఇద్దరు ఇరువైపు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఇది ఐపీఎల్ ఫైనల్ లాగే లేదు…ఇంటరెస్ట్ పోయింది అంటూ మరోసారి ముంబై కప్ గెలవడంపై ట్రెండ్ అవుతున్న 20 ట్రోల్ల్స్.!
ఐపీఎల్-2020 ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మ్యాజిక్ విక్టరీ సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 156 రన్స్ చేసింది. ఢిల్లీకి మంచి ప్రారంభం దక్కలేదు. ప్రారంభంలోనే కీలక 3 వికెట్లు కోట్పోయింది. అయితే ఆ తర్వాత రిషబ్ పంత్(56), శ్రేయాస్ అయ్యార్(65) ఎక్కువ సేపు క్రీజులో ఉండటంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్(3/30), కౌల్టర్ నైల్(2/29), జయంత్ యాదవ్(1/25) వికెట్లు తీశారు.

157 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ దిగిన ముంబై ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు.డీకాక్(20; 12 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) సూర్యకుమార్(19; 20 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) , రోహిత్ శర్మ(68; 51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించి విజయంలో కీలక పాత్ర పోషించగా, ఇషాన్ కిషన్( 33 నాటౌట్; 19 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్) ,కృనాల్ పాండ్యా(1) విన్నింగ్ షాట్ ఆడి లాంఛనం పూర్తి చేశాడు.ఢిల్లీ బౌలర్లలో నోర్ట్జే 2 వికెట్లు తీయగా, రబాడా, స్టోయినిస్‌లకు చెరో వికెట్ దక్కాయి.
#1
#2
#3
ఐపీఎల్ పదమూడోవ సీజన్ విజేతగా ముంబై ఇండియన్స్ నిలిచింది. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ముంబై ఐదోసారి టైటిల్ గా సాధించింది.వరుసగా రెండు సార్లు ట్రోఫీ అందుకుని డిఫెండింగ్ ఛాంపియన్స్ ట్యాగ్‌ను నిలబెట్టుకుంది. అంతేకాకుండా 5 సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ఏకైక జట్టుగా కూడా రికార్డు సృష్టించింది.ముంబై 2013 లో మొదటి ఐపీఎల్ ట్రోఫీ సొంతం చేసుకుంది ,ఆ తర్వాత 2015 లో రెండో సారి , 2017 లో ౩వ సారి , 2019 లో వ సారి ,ఈ ఇయర్ 5 వ సారి మొత్తం ఐపీఎల్ ట్రోఫీని గెలిచి రికార్ట్ సృష్టించింది.
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20
#21
#22

#23

ఈ సీజన్ లో అత్యధికంగా 670 పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్ లో 30 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఢిల్లీ బౌలర్ కగిసో రబాడా పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.
Fair Play Award: Mumbai Indians
IPL 2020 Orange Cap: KL Rahul (Kings XI Punjab)
670 runs
14 Matches
55.83 Batting Avg
1 Hundred
5 half-centuries
IPL 2020 Purple Cap: Kagiso Rabada (Delhi Capitals )
30 wickets
17 matches
Most Valuable Player of IPL 2020: Jofra Archer – (Rajasthan Royals)
20 wickets,
175 dot balls,
5 catches
10 sixes.
Emerging Player: Devdutt Padikkal (RCB)
473 runs
5 fifties
124.80 strike rate
Dream XI Game Changer of the Season: KL Rahul (Kings XI Punjab)
975 Fantasy Points
Unacademy Let’s Crack It: Most Sixes in the Season: Ishan Kishan (Mumbai Indians) –
30 sixes in 14 matches
Tata Altroz Super Striker of the Season: Kieron Pollard (Mumbai Indians) –
Strike Rate of 191.42
CRED Power Player of the Season: Trent Boult (Mumbai Indians) –
16 wickets in the powerplay
Also Read >> ఈ ఐపీఎల్ లో తమ సత్తా చాటిన 11 మంది యువ భారత ఆటగాళ్లు.! ఎవరి రికార్డ్ ఏంటో చూడండి.!
ఐపీఎల్ ట్రోఫీ మీద సంస్కృతంలో రాసున్నది ఏంటో తెలుసా? అర్థం ఇదే.!
ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా అందరూ మాట్లాడుకునేది రెండింటి గురించే. కరోనా, లాక్ డాన్ గురించి అనుకున్నారా? కాదు. అయినా ఇంక వాటి గురించి మాట్లాడుకునే కూడా పెద్దగా ఏమి లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వాలు వాటి మీదే రాత్రి పగలు కష్టపడి పని చేస్తున్నారు. అలా కష్టపడి పని చేసి ముందు కంటే పరిస్థితి మెరుగు పడేలా చేశారు. ఇంకా కరోనా కేసుల గురించి కూడా టీవీలో, సోషల్ మీడియాలో అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. బహుశా గత కొద్ది నెలలుగా ప్రతి చోటా కరోనా పేరు విని విని జనాలకు అలవాటు అయిపోయి ఉండొచ్చు.

సరే. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో జనాలు ఎక్కువగా మాట్లాడేది బిగ్ బాస్, ఐపీఎల్ గురించి. రెండిట్లో ఒకటి ఆల్రెడీ మొదలైపోయింది. ఇంకొకటి మొదలవబోతోంది. మొదలు అయిపోయిన బిగ్ బాస్ గురించి ఏం జరుగుతోంది అని మాట్లాడుకుంటున్నాం, మొదలు అవ్వ బోయే ఐపిఎల్ గురించి ఎలా ఉండబోతోంది అని మాట్లాడుకుంటున్నాం.

సాధారణంగా అయితే ఐపీఎల్ సీజన్ ఇది కాదు. కానీ కరోనా కారణంగా ఆలస్యంగా ప్రారంభం అవుతోంది. ఎప్పుడు స్టార్ట్ అయితే ఏంటి, అసలు అంటూ ఐపీఎల్ మొదలవుతోంది కదా అని జనాలు కూడా ఈసారి రెట్టింపు ఆసక్తి తో ఐపీఎల్ కోసం ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 19 నుండి ఐపీఎల్ మొదలవనుంది. దానికోసం ప్లేయర్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు.

నవంబర్ 10వ తేదీన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈసారి ట్రోఫీ ఎవరికి రాసిపెట్టి ఉందో అని క్రికెట్ అభిమానుల లో డిస్కషన్ నడుస్తోంది. ట్రోఫీ ఎవరికి రాసిపెట్టి ఉంది అనే విషయం వాళ్ల పర్ఫామెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడే ఏం చెప్పలేం. ఇప్పుడు ట్రోఫీ మీద ఏమి రాసి ఉందో తెలుసుకుందాం.

మనలో చాలా తక్కువ మంది ఈ విషయాన్ని గమనిస్తాం. ఐపీఎల్ ట్రోఫీ మీద సంస్కృతంలో ఒక వాక్యం రాసి ఉంటుంది. ఐపీఎల్ ట్రోఫీ మీద రాసి ఉన్న సంస్కృత వాక్యం “యత్ర ప్రతిభ అవసర ప్రాప్నోతిహి (Yatra Pratibha Avsara Prapnotihi)”. అంటే ప్రతిభ ఉన్న చోట అవకాశం ఉంటుంది లేదా ప్రతిభకి అవకాశం కలిసినప్పుడు (where talent meets opportunity) అని అర్థం అట. ఈ వాక్యాన్ని ఇప్పటివరకు మీరు గమనించకపోతే ఈసారి అబ్జర్వ్ చేయండి.
నిన్నటి ఉమెన్స్ T20 లో సూపర్ నోవాస్ జట్టు కి, ట్రయల్ బ్లేజర్స్ జట్టు కి మధ్య జరిగిన పోటీలో 16 పరుగుల తేడా తో ట్రయల్ బ్లేజర్స్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో స్మ్రితి మందన జట్టు విజయానికి ఎంతగానో తోడ్పడ్డారు. ఈ మ్యాచ్ లో నట్టకం చంతన్ ఫీల్డింగ్ హైలైట్. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
watch video:
Ms.Nattakan Chantham of Thailand during Women’s T-20 Challenge
Women power ???@premaswaroopam @Bhairavinachiya @VasaviNarayanan @SriRamya21 @unever_followme pic.twitter.com/iy8cI0IlU3
— ⱽᵃʳˢʰᵃ (@Varsha69396205) November 10, 2020
“ఒక్కడు” సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెప్పిన ఆ నెంబర్ ఎవరిదో తెలుసా?
మహేష్ బాబు కెరీర్ లో ఎన్ని హిట్ సినిమాలు ఉన్న “ఒక్కడు “చిత్రానికి ఉన్న ప్రత్యేకతే వేరు .ఎందుకంటే ఒక్కడు చిత్రంతోనే మహేష్ బాబు ఒక్కసారిగా మాస్ స్టార్ డామ్ అందుకున్నారు.గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు.అయితే ఈ చిత్రంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం పాస్ పోర్ట్ ఆఫీసర్ గా కనిపిస్తారు.

అయితే ధర్మవరపు సుబ్రహ్మణ్యం తన మొబైల్ నెంబర్ 9848032919 అని మొదటగా నా భార్య కి కూడా చెయ్యకుండా నీకె చేస్తున్నాని అని చెప్తూ ఒక అమ్మాయితో మాట్లాడే సన్నివేశం నేటికీ హైలైట్ గా నిలుస్తుంది..ఇంతకీ ఆ మొబైల్ నెంబర్ ఎవరిదీ ? ఎందుకు ఈ నెంబర్ ఆ సన్నివేశం లో ఉపయోగించారు ? దాని వెనక ఆసక్తికర కథ ఉంది. అదేంటో చూడండి.

ఈ చిత్రంలో మహేష్ బాబు ,భూమిక ను రహస్యంగా అమెరికా కు పంపించాల్సి ఉంటుంది.దానికోసమే పాస్ పోర్ట్ అవసరం ఉంటుంది కనుక పాస్ పోర్ట్ ఆఫీసర్ ధర్మవరపు శ్రీనివాస్ ను మీట్ అవుతారు మహేష్ బాబు.అయితే ఆ సమయంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం తన నెంబర్ 9848032919 అని ఒక అమ్మాయితో చెప్పడం మహేష్ బాబు విని ఆ నెంబర్ కు రాంగ్ కాల్స్ చేసి విసిగిస్తాడు.దీంతో ధర్మవరపు సుబ్రమణ్యం ఫోన్ పగలకొట్టేస్తారు.ఈ నేపథ్యంలో కొరియర్ లో ఇవ్వవలసిన పాస్ పోర్ట్ డైరెక్ట్ గా ఇచ్చేస్తారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం.

ఆ రోజుల్లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెప్పే ఆ ఫోన్ నెంబర్ బాగా పాపులర్ అయ్యింది.దీంతో చాలామంది ప్రేక్షకులు ప్రతి రోజూ ఆ మొబైల్ నెంబర్ కు లక్షల్లో ఫోన్ చేసేవారు.దీంతో ఆ వ్యక్తి తన మొబైల్ నెంబర్ మార్చేసుకున్నారు.ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో కాదు ఈ చిత్ర నిర్మాత ఎం.ఎస్ రాజు గారు.అయితే “ఒక్కడు” షూటింగ్ సమయంలో ఒక ఫాన్సీ నెంబర్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెప్పాల్సి ఉండగా…..ఎవరి నెంబర్ చెబుదామా అని చిత్ర బృందం చర్చించుకుంటూ ఉంటే… ఎం.ఎస్ రాజు గారి నెంబర్ కంటే ఫాన్సీ నెంబర్ ఏముంటుంది అని చిత్ర బృందంలో ఓ వ్యక్తి అనడం వలన ఇలా జరిగిందంటా.

