హాస్య బ్రహ్మ లెజెండ్ గా తెలుగు చలన చిత్ర సీమ లో ఎంతగానో పేరును సంపాదించుకున్న నటులు డా|| బ్రహ్మానందం గారు అయన హాస్యాన్ని అభిమానించని వారు ఉండరు..మన తెలుగు చలన చిత్ర సీమ లో చాల మంది నటులు కేవలం నటన లోనే కాదు వారికి ఇంకా ఎన్నో కళలు కూడా తెలుసు బ్రహ్మానందం గారు తెలుగు లో అధ్యాపకులు కూడా అంతే కాదు చక్కని కళా కారులు కూడా ఎన్నో బొమ్మలు చాల చక్కగా గీశారు గతంలో కూడా అవి సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి..తాజాగా గీసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్ట్ ఒకటి పోస్ట్ చేశారు ఇప్పుడు ఇదే సామాజిక మాధ్యమాలలో వైరల్ గా నిలిచాయి..

Bramhanandham pencil art

bramhandham pencil art
ఇంతటి అద్భుతమైన ఆర్ట్ ని గీసిన బ్రహ్మానందం గారిని అభినందించకుండా ఉండలేము కదూ.తన ఆరోగ్య దృష్ట్యా ప్రస్తుతానికి సినిమాలకి దూరమగా ఉంటున్న హాస్య బ్రహ్మ ఇలా మళ్ళీ ప్రేక్షకులకి దగ్గర అవుతున్నారు..అతి త్వరలో ఆయన కోలుకొని తిరిగి మళ్ళీ సినిమాలకి రావాలని కోరుకుందాం.

అందరూ 2020ని తిట్టుకుంటున్నారు. కానీ, మన జీవితంలో గత ఏడాది ఎంతో ఉత్తమమైంది. మనకు చాలా నేర్పింది, ఆరోగ్యం ఎంత ముఖ్యమో అర్థమైంది. రోగనిరోధక శక్తి చాలా అవసరమని తెలిసింది. పోషకాహారం విలువ తెలిసింది. పరిశుభ్రత నేర్చుకున్నాం. పుట్టిన తర్వాత ఎప్పుడూ మనం ఇన్నిసార్లు చేతులు కడుక్కోలేదు పల్లెటూళ్లలో పుట్టిన వాళ్లకు కూడా చాలా విషయాలు తెలిశాయి. వైరస్, శానిటైజర్, క్వాలైంటన్, యాంటీబాడీస్ ప్లాస్మా, స్టెయిన్ ఇలా ఎన్నో విషయాలు తెలిసిపోయాయి.


























సినీ ఇండస్ట్రీకి న వచ్చే ప్రతీ అమ్మాయి లైంగిక వేధింపులు ఎదుర్కోవాల్సిందే , నేను కూడా ఎదుర్కొన్నాను అంటూ సంచలనం సృష్టించింది నటి, హిందీ బిగ్‌బాస్-13 మాజీ కంటెస్టెంట్ రష్మీ దేశాయ్. పెద్ద నిర్మాత సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి తనను అత్యాచారం చేయాలని ప్రయత్నించాడంటూ చెప్పుకొచ్చింది. బుల్లితెరపై ప్రసారమయ్యే పలు టీవీ కార్యక్రమాలు , సీరియల్స్ ద్వారా అందరికి సుపరిచితమైన నటి రష్మీ దేశాయ్. సల్మాన్ హోస్ట్ చేసే బిగ్ బాస్ 13 లో థర్డ్ రన్నరప్ కూడా. ఆ తర్వాత వెండితెరపై కూడా కనిపించింది. ఇటీవల ఒక ఇంగ్లీష్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ అంశంపై స్పందించింది.
పదమూడేళ్ల క్రిందట తాను కెరీర్ ప్రారంభించానని, అప్పుడే టీనేజ్ లోకి అడుగుపెట్టానని, నటనపై ఇంట్రస్ట్ తో ఇటువైపొచ్చనని చెప్పింది. అయితే ఆ సమయంలో ఆఫర్స్ ఇప్పిస్తాను అనే వంకతో సూరజ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇండస్ట్రీలో ఎవరూ పరిచయం లేకపోయేసరికి సూరజ్ నిజంగానే అవకాశాలు ఇప్పిస్తాడని నమ్మాను . కానీ తర్వాత సినిమాల్లో ఆఫర్స్ రావాలంటే లైంగికంగా లొంగాల్సిందే అని చెప్పేవాడని, అలా చాలా సార్లు తనను లొంగగదీసుకునే ప్రయత్నం చేశాడని ఆమె చెప్పుకొచ్చింది.
పెద్ద నిర్మాత యశ్ రాజ్‌తో కలిసి పనిచేసే అవకాశం ఇప్పిస్తానని తన నెంబర్ తీసుకున్న సూరజ్. ఓసారి ఫోన్ చేసి ఆడిషన్‌కి రమ్మన్నాడు, తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే ఆ రూమ్‌లో అతనొక్కడే ఉండడంతో డౌటొచ్చింది . దాంతో వెళ్లిపోతానని చెప్తే కూల్ డ్రింక్ తాగడానికి ఇచ్చి, అది తాగాల్సిందిగా బలవంతం చేశాడు. కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపాడని, దాన్ని తాగించి అత్యాచారం చేయాలనే ప్రయత్నం చేశాడని రశ్మి తెలిపింది.
అక్కడినుండి ఎలాగోలా తప్పించుకుని బయటపడి, ఆ తర్వాత అమ్మతో జరిగినదంతా చెప్పాను . దీంతో అమ్మ సూరజ్ ని పిలిపించి ఇంకోసారి నా బిడ్డ జోలికి వస్తే చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చిందని, ఈ పని నేనే చేసి ఉండాల్సిందని అనిపిస్తుంటుంది అంటూ చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ రన్నరప్ గా నిలిచిన రశ్మి చేసిన కామెంట్స్ తో మళ్లీ కాస్టింగ్ కౌచ్ వ్యవహారం వైరలవుతోంది.





















