F2 సినిమా రోల్ నుండి వెంకీ మామ ఇంకా బయటకి రాలేదు అనుకుంట. తమన్నా బర్త్ డే సందర్బంగా ఎంత క్రేజీగా విష్ చేసారో చూడండి.
News
ACCELERATOR రైట్ కే ఎందుకు ఉంటుంది? ఎక్కువ మంది RIGHT HANDED అని కాదు?
వాహనాల్లో దాదాపు ఎక్కువమంది వాడేవి టూ వీలర్స్. చిన్న సందు లో నుండి పెద్ద హైవే మీద వరకు ఎక్కడైనా సౌకర్యవంతంగా నడపవచ్చు. ఒకవేళ ఎక్కడికైనా వెళితే పార్కింగ్ ప్లేస్ లేకపోయినా కూడా ఎక్కడైనా అంటే మీరు వెళ్ళిన చోటకి దగ్గరలో సులభంగా పార్క్ చేయవచ్చు.

కానీ వర్షం వచ్చినప్పుడు లేదా ఎక్కువ వస్తువులు తీసుకువెళ్లాల్సి వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి అనుకోండి. అది వేరే విషయం. ఏదేమైనా ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో ట్రాఫిక్ నుండి సులభంగా బయటికి రావాలి అంటే చాలామంది టు వీలర్ నే ఎంచుకుంటారు.

మీరు ఎప్పుడైనా గమనించారా టు వీలర్ కి యాక్సిలరేటర్ కుడి వైపు ఉంటుంది. ఈ విషయం కచ్చితంగా అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఎందుకు అని ఆలోచించరా. యాక్సిలరేటర్ కుడి వైపు ఎందుకు ఉంటుంది? ఎడమవైపు ఉండొచ్చు కదా? అని అనుమానం మీకు ఎప్పుడైనా వచ్చిందా? అలా ఉండటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే.

యాక్సిలరేటర్ కుడివైపు ఉండడానికి మొదటి కారణం ఏంటి అంటే దాదాపు చాలా మంది కుడిచేతి వాటం కలవారే ఉంటారు. ఎడమ చేతి వాటం కలిగి ఉన్నవారు కూడా యాక్సిరేటర్ ఆపరేట్ చేయడం లో అంత ఒత్తిడి పెట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి కుడి చేత్తో సులభంగానే చేయగలుగుతారు.

ఇంకొక కారణం ఏంటి అంటే ఒకసారి మీరు బండిని గమనిస్తే దాదాపు ముఖ్యమైన భాగాలన్నీ ఎడమవైపు ఉంటాయి. అంటే కిక్ స్టాండ్, కిక్ స్టార్ట్, సెంటర్ స్టాండ్ అన్నమాట. ఇవన్నీ ఎడమవైపు ఉంటాయి. కాబట్టి బండి స్టార్ట్ చేసేటప్పుడు అంటే బండి స్టాండ్ తీసేటప్పుడు ఒత్తిడి అంతా ఎడమ వైపు పడుతుంది.

అటువంటి సమయంలో మనకి తెలియకుండానే ఎడమవైపు ఉన్న డమ్మీ హ్యాండ్ స్టాండ్ పై మన చేతి ఒత్తిడిని అప్లై చేస్తాం. అప్పుడు పొరపాటున యాక్సిలరేటర్ గనక ఎడమ వైపు ఉంటే బండి అదుపు తప్పి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే రెండు వైపులా ఒత్తిడి సమానంగా ఉంది బండి బ్యాలెన్స్ అవ్వడానికి యాక్సిలరేటర్ కుడివైపు ఉండేలా టు వీలర్ వాహనాలను తయారు చేస్తారు.
కరోనా బారిన పడి చనిపోయిన ఒక అమెరికన్ తన భార్యకు రాసిన లెటర్ సోషల్ మీడియాలో వైరలవుతుంది..తన భార్యను, పిల్లల్నుద్దేశిస్తూ అతడు రాసిన వాక్యలు కంటతడి పెట్టిస్తున్నాయి..జోనాధన్ కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంతోషంగా సాగిపోతున్న కుటుంబంలోకి కరోనా రూపంలో అంతా తలకిందులైంది. న్యాయస్థానంలో పనిచేసే జోనాథన్ కరోనా వల్ల భయపడుతూనే తగిన జాగ్రత్తలు పాటిస్తూనే విధులకు హాజరవుతున్నాడు. అయినప్పటికి కరోనా బారిన పడకతప్పలేదు.

కరోనా పాజిటివ్ రావడంతో డాన్బరీలోని హాస్పిటల్ కి తరలించారు.. అతన్ని పరీక్షించిన వైద్యులు మొదట జోనాథన్ ను రెండు రోజులు ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేయాలని చెప్పారు. కానీ, ఆ తర్వాత జోనాథన్ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్లో ఉంచారు. మార్చి 26న హాస్పిటల్లో జాయిన్ అయిన జోనాథన్ ఏప్రిల్ 22 న హార్ట్ ఎటాక్ తో మరణించాడు. హాస్పిటల్లో ఉన్న 28రోజుల్లో 20 రోజులపాటు వెంటిలేటర్ పైనే ఉన్నాడు. 
డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తుండగానే జోనాథన్ మరణించాడు. అతడు చనిపోయిన తర్వాత డాక్టర్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందిచారు.భర్త మరణ వార్త తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న భార్య కన్నీటి పర్యంతమైంది..హాస్పిటల్లో ఉన్న భర్త వస్తువులను ఆమెకి అందించింది హాస్పిటల్ సిబ్బంది.

ఆ వస్తువుల్లో జోనాథన్ ఫోన్ కూడా ఉంది.. ఆ ఫోన్లో జోనాథన్ రాసిన లెటర్ కేటి కంటపడింది.. భర్త రాసిన ఆ లెటర్ చదివిన కేటి మరియు పిల్లలు మరింత భావేద్వేగానికి గురయ్యారు. జోనాథన్ రాసిన లెటర్ అతని మాటల్లోనే “నేను చాలా అదృష్టవంతుడిని. ఇప్పటివరకు నేను కోరుకున్న జీవితాన్ని నాకు అందించావు. నీకు భర్తను అయినందుకు చాలా గర్వపడుతున్నాను. మన పిల్లలు బ్రాడిన్ మరియు పెన్నీలకు తండ్రిని కావడం కూడా గర్వపడే విషయం.
నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. నేను కలుసుకున్న అత్యంత అందమైన వ్యకివి నువ్వు. నువ్వు చాలా స్పెషల్. నువ్వు పిల్లలు సంతోషంగా బతుకుతారని అనుకుంటున్నాను. నువ్వు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటావు. ఆ నవ్వే నన్ను నీతో ప్రేమలో పడేలా చేసింది. నువ్వు పిల్లలకు మంచి తల్లిగా ఉండటం గొప్ప విషయం” అంటూ..

పిల్లల గురించి కూడా జోనాథన్ ఆ లెటర్లో ప్రస్తావించాడు.. “బ్రాడిన్ నాతో అత్యంత అనుబంధం కలిగినవాడు. నేను అతనికి తండ్రిని అయినందుకు గర్వపడుతున్నాను. అతను చేసిన మరియు చేస్తున్న అద్భుతమైన పనులన్నింటికీ గర్వపడుతున్నాను. పెనెలోప్ ఒక యువరాణి. తను కోరుకున్నది తనకు దక్కుతుంది. నిన్ను, పిల్లలను ప్రేమించే వ్యక్తి ఎవరైనా నీకు నచ్చితే అతనితో సంతోషంగా ఉండండి. నేను మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను’”అని జోనాథన్ తన ఫోనులో భార్యా, పిల్లల గురించి కంటతడిపెట్టించేలా రాశాడు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న ఈ వార్త నెటిజన్లందరి చేత కంటతడి పెట్టిస్తున్నది.
మూడేళ్ళుగా కొడుకు కోసం వెతుకున్న తల్లితండ్రులు…చివరికి వాళ్ళని కలిపింది “ట్రాఫిక్ చలాన్”.! ఎలాగంటే.?
వాహనం నడిపేటప్పుడు రూల్స్ పాటించకపోతే పోలీసులు జరిమానా విధిస్తారు అనే విషయం అందరికి తెలిసిందే. అయితే, అలా ఒక వ్యక్తి రూల్ పాటించనందుకు పోలీసులు వేసిన జరిమానా యొక్క చలానా అతనిని తన కుటుంబంతో కలిపింది. వివరాల్లోకి వెళితే. హైదరాబాద్ లోని మదీనగూడకి చెందిన సత్యనారాయణ ఒక విశ్రాంత ఉద్యోగి. సత్యనారాయణకి సతీష్ ఒక్కరే కొడుకు.

సతీష్ కి 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి ఎనిమిది సంవత్సరాల పాప కూడా ఉంది. సతీష్ కి వ్యవసాయం అంటే ఇష్టం ఉండడంతో తన ఉద్యోగం మానేసి వ్యవసాయరంగంలో కి వెళ్తాను అని తల్లిదండ్రులకు చెప్పారు. సతీష్ తల్లిదండ్రులు దీనికి ఒప్పుకోకపోవడంతో, 2017 లో సతీష్ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. సతీష్ తల్లిదండ్రులు తమ కొడుకు ఆచూకీ కోసం కేపీహెచ్బీ (KPHB) పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు.

సతీష్ జహీరాబాద్ మండలంలోని గోవింద్ పూర్ శివార్లలో వ్యవసాయ క్షేత్రంలో ఒక పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. లాక్ డౌన్ లో సతీష్ ఒకసారి మాస్క్ లేకుండా తిరిగినందుకు పోలీసులు జరిమానా విధించారు. సతీష్ తన ఇంటి నుండి తీసుకెళ్లిన ఈ ద్విచక్ర వాహనం యొక్క చిరునామాకి చలానా వెళ్ళింది.

ఈ చలానా ద్వారా తమ కొడుకు జహీరాబాద్ లో ఉన్నాడు అని తెలుసుకున్న సతీష్ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి పరిస్థితిని వివరించారు. విషయం తెలిస్తే కలవరేమో అని సతీష్ ని రహస్యంగా స్టేషన్ కి వచ్చేలా చేశారు. దాదాపు మూడు సంవత్సరాల నుండి దూరంగా ఉన్న సతీష్ ని చూసిన తల్లిదండ్రులు, అలాగే ఇన్ని సంవత్సరాల తర్వాత తన కూతురిని చూసిన సతీష్ భావోద్వేగానికి లోనయ్యారు.
watch video :
మొగుడే యముడు…వీజే చిత్ర ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ..! అసలేమైంది.?
ఇటీవల తమిళ సీరియల్ నటి, వీజే చిత్ర అనుమానాస్పద స్థితిలో మరణించారు. చిత్ర చెన్నైలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో ఆత్మహత్య చేసుకున్నారు అని అన్నారు. కానీ ఇది ఆత్మహత్య కాదు ఏమో అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. చిత్ర తల్లి కూడా తన కూతురిని తన భర్త హేమంత్ రవి హింసించేవాడు అని, చిత్ర ఒంటిపై గాయాలున్నాయని, హత్యని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, చిత్ర మరణానికి గల అసలు కారణం వెలుగులోకి రావాలి అని ఫిర్యాదు చేశారు.

ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమయం కథనం ప్రకారం సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి, చిత్ర సహ నటీనటులని, స్నేహితులని, హేమంత్ ని పలుమార్లు ఇంటరాగేట్ చేసి, అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత చిత్ర చనిపోవడానికి కారణం తన భర్త హేమంత్ అని నిర్ధారించారు.

ఈ విషయంపై నజరత్ పేట్టై పరిధిలోని ఏసీపీ సుదర్శన్ మాట్లాడుతూ “ఒక టెలివిజన్ షోలో చిత్రం నటించిన ఒక సీన్ పై హేమంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు అని, ఈ విషయంపై చిత్రకి, హేమంత్ కి మధ్య గొడవ జరిగిందని, హోటల్ లో జరిగిన గొడవలో హేమంత్ చిత్రని బలంగా తోశారు, దాంతో చిత్ర మనస్తాపానికి గురయ్యారు” అని పేర్కొన్నారు.

పోస్టుమార్టం రిపోర్ట్ లో చిత్ర ఆత్మహత్య చేసుకున్నారు అని తేలినప్పటికీ కూడా, చిత్ర ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించింది హేమంత్ అవ్వడంతో పోలీసులు హేమంత్ ని అరెస్ట్ చేశారు. చిత్రకి, హేమంత్ కి ఆగస్టులో ఎంగేజ్మెంట్ జరిగింది. వీరిద్దరూ అక్టోబర్ లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. కానీ వచ్చే జనవరిలో సంప్రదాయం ప్రకారం మళ్ళీ వివాహం చేసుకోవాలని అనుకున్నారు.
Job Profile: Trainee Associate Engineer
Degree Needed: B.E/B.Tech
Experience Required: Freshers
Work Location: Gurugram
About this role: Responsible for network mapping which includes recording and performing connectivity for copper and fibre network including network for other ISP in the line plant facility management system
You’ll have the following responsibilities
- To share ownership of the production and Personal Development Plans.
- To make sure that the line plants are available at the required positions so that the actual physical connectivity can be done without creating hassle for field engineer, thereby providing broadband connectivity to customers.
- Coordination with Planner & Technical teams for resolution.
- To confirm connectivity, routing details, checking and placing line plants which facilitates the functionality of current network and provide accurate information in case of expansion or transition of network.
- Planning of Sites & generating field work for engineers to action upon.
- Bandwidth provisioning & resolving Data integrity issues of the network.
- Planning & recording of fibre routes directly to hub sites for the Core networks, FTTP / FTTC/FTTX
You’ll have the following skills & experience
- Role would need technical competence in Telecom Network & Network Methodologies.
- Good written & verbal communication skills.
- Good understanding of telecom terminologies.
- Should not have applied for same position in past 3 months.
- Holds an engineering or technical qualification or Good exposure in domain of Transmission & telecom industry.
- 24/7/365 availability, including willingness to work on weekends, holidays and night shifts.
Apply Link:Click Here
ఐపీల్ లోని సన్ రైజర్స్ టీం ద్వారా తెలుగు ప్రజలకి అత్యంత చేరువ అయిన ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్..మన హైద్రాబాద్ జట్టునే కాదు మన తెలుగు సినిమాలని అందులోని క్యారెక్టర్లని ఎంతగా నచ్చేసాయో అందరికి తెలిసిన విషయమే..దాదాపు అందరి హీరోల పాటలకి టిక్ టాక్ వీడియోలు చేస్తూ మన తెలుగు రాష్ట్ర ప్రజలని క్రికెట్ తోనే కాదు తన ఎడిటింగ్ చేసిన వీడియోల ద్వారా కూడా అలరించాడు ..తాజాగా డేవిడ్ భాయ్ ‘చిరు’ నటించిన సైరా నరసింహ రెడ్డి సినిమాలోని ఒక వీడియో ని ఎడిట్ చేసి తన ఇంస్టాగ్రామ్ కాతా నుంచి పోస్ట్ చేసాడు.అంతే కాదు రజనీకాంత్ నటించిన ‘రోబో-2 ‘ సినిమాలోని రజని గెటప్ ని కూడా మార్ఫింగ్ చేసిన వీడియో ఎడిట్ చేసాయి పోస్ట్ చేశారు..అంతే కాదు గతంలో ‘ఆలా వైకుంఠ పురంలో..బాహుబలి వంటి టిక్ టాక్ వీడియో లకి చేసిన పెరఫామెన్స్ లకి అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే..
https://www.instagram.com/p/CIpusZVlYG1/?igshid=1fzz4kx1cucv1
https://www.instagram.com/p/CInE2z7lMyy/?igshid=v3xcwrg8lrvf
ఎవడో పిసికేసుకొని చూస్తున్నాడు కదా ఇలాంటి పెళ్లిళ్లన్నీ… చూసేవాడిని అంటున్నా అని శ్రీ రెడ్డి ఫైర్
కాస్టింగ్ కౌచ్ తో టాలీవుడ్ ని కుదిపేసిన సంచలనాల శ్రీరెడ్డి.తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో ఆమె ఎంత ఆక్టివ్ గా ఉంటారో అందరికి తెలిసిందే. ఆమె పోస్ట్ చేసారు అంటే…జనాలు రోజులు తరబడి మాట్లాడుకోవాల్సిందే. తాజాగా నిహారిక పెళ్లిపై కూడా తన స్టైల్ లో కామెంట్స్ చేసారు శ్రీరెడ్డి.

“రేయ్…ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి లాగా… మీ ఇంట్లో పెళ్లి లాగా మీరెందుకు రా తెగ హడావుడి చేస్తూ పిసికేసుకుంటున్నారు,నాగబాబు కూతురు పెళ్లి కదా ? యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఆయన వచ్చాడో…ఈయన వచ్చాడో ..డాన్స్ చేసాడో ..అంటూ హడావుడి చేయడం ఎందుకు…వీటిని తెగ షేర్ చేస్తారు..ఏదైనా ఉపయోగపడే పని చేయండిరా. ఆ రైతులు రోడ్ల మీద కొచ్చి ఏడుస్తుంటే సపోర్ట్ చేయడం తెలియదు కానీ ఈ చెత్త మాత్రం షేర్స్ కొట్టుకుంటూ అబ్బా!ఆ ఆ…హో హో …తూ…చేంజ్ అవ్వండి రా…

మీడియా కూడా దీన్ని అంత హైలైట్ చేయాల్సిన అవసరం ఏం లేదు, హైలైట్ చేయాల్సిన విషయాలు హైలైట్ చేయాలి. రైతు ల గురించి కానీ, తమిళనాడు లో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది,పాపం ఒక అమ్మాయి ప్రాబ్లమ్స్ మీద చేయండి రా పనికిరాని ఎదవల్లారా! చివరగా నేనన్నది మీడియాను కాదు.. ఎవడో పిసికేసుకొని చూస్తున్నాడు కదా ఇలాంటి పెళ్లిళ్లన్నీ చూసేవాడిని అంటున్నా అని శ్రీ రెడ్డి ఫైర్ అయ్యింది.
watch video:
source: facebook/srireddy
ఆగస్టులో నిహారికకి, చైతన్య జొన్నలగడ్డతో ఎంగేజ్మెంట్ అయింది. చైతన్య తండ్రి ప్రభాకర్ రావు గుంటూరు రేంజ్ ఐజీ. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన చైతన్య జూబ్లీహిల్స్ లో ఉన్న భారతీయ విద్యా భవన్ లో చదువు పూర్తి చేశారు. బిట్స్ పిలానీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. హైదరాబాద్ కి చెందిన ఒక మల్టీ నేషనల్ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్ గా ఉద్యోగం చేస్తున్నారు చైతన్య. డిసెంబర్ 9 వ తేదీన ఉదయ్ పూర్ ప్యాలెస్ లో నిహారిక, చైతన్య వివాహం జరిగింది. నిహారిక ను పెళ్లి కూతుర్ని చేసిన దగ్గరినుండి చాలా ఫోటోలు వైరల్ అయ్యాయి.
Love Failure Quotes Telugu 2021 | Telugu Best Love Quotes and Love failure Quotes 2021

Telugu love quotes 2021
Love Failure Quotes in Telugu With Images Wallpapers. Love Failure Quotes in Telugu for FB Whatsapp status DP.Download best love quotes in Telugu with images for free. share all the romantic heart touching, emotional, love failure quotes in Telugu. If you send heart touching love quotes in Telugu, Telugu love quotes for her and Prema kavitalu to your lover he/she might feel very happy and fell in love deeply with you. You can even send true love quotes in Telugu on valentine’s day Telugu quotes WhatsApp status.
Love Quotes In Telugu With Images
Telugu quotes, Telugu quotes on love, Telugu quotes about love, Telugu quotes about life, Telugu quotes on life, Telugu quotes on friendship, Telugu quotes with images, love Telugu quotes with images, Telugu quotes on life with images, Telugu love quotes images free download.
Love Quotes in TeluguLove Quotes in Telugu
Love Failure Quotes in Telugu
Love Failure Quotes in Telugu
Love Quotes in Telugu
Best Love Quotes in Telugu
Love Failure Quotes in Telugu 2021
Whatsapp Status Love Failure Quotes in Telugu
Whatsapp Status Love Failure Quotes in Telugu
Love Failure Quotes in Telugu
Whatsapp Status Love Failure Quotes in Telugu
Telugu Love Quotes and Love failure Quotes
Prema Kavithalu 2021 
Telugu Love SMS Messages

love quotes For Whatsapp
Telugu Love Quotes and Love failure Quotes
Telugu Love Quotes and Love failure Quotes

గత 5 సంవత్సరాలనుండి ప్రేమించుకుని…పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు.! చివరికి.?
ప్రేమకి కులం, మతం లాంటివి మాత్రమే కాదు జెండర్ కూడా అడ్డు కాదు. కొంత మంది ఈ విషయాన్ని సమర్థిస్తూ మాట్లాడినా, మరికొంత మంది మాత్రం దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతారు. ఇటీవల ఇద్దరు యువతులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే, జార్ఖండ్ లోని, కోడెర్మా జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు గత అయిదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఒకరి వయసు 24 సంవత్సరాలు, ఇంకొకరి వయసు 20 సంవత్సరాలు.

వీరిద్దరూ నవంబర్ 8వ తేదీన పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు వాళ్ళిద్దరి ప్రేమని అంగీకరించలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత వారి ఇళ్లకి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్వారా బ్లాక్ లో వీరిద్దరూ ఉంటున్నారని తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చాలా పెద్ద గొడవ చేశారు.

representative image
ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించగా, ఆ యువతులు ఇద్దరూ మేజర్లు కాబట్టి వారు ఎటువంటి జోక్యం చేసుకోలేము అని చెప్పారు. ఈ సంఘటన చుట్టుపక్కల ఉన్న మీడియా వాళ్ళ దృష్టిలో పడటంతో, మీడియా వాళ్లు వారిద్దరూ ఉంటున్న ఇంటి దగ్గరికి వెళ్లడం మొదలు పెట్టారు. దాంతో ఆ ఇద్దరు యువతులు ఆ ప్రదేశం వదిలేసి వేరే చోటికి వెళ్లిపోయారు.

ఈ విషయంపై ఆ ఇద్దరు యువతులు మాట్లాడుతూ “దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని మా కుటుంబ సభ్యులు మమ్మల్ని బెదిరిస్తున్నారు. కానీ మేము ఆ బెదిరింపులను పట్టించుకోము. మేము గత అయిదు సంవత్సరాలుగా ప్రేమించుకొని, గుడిలో పెళ్లి చేసుకున్నాం. త్వరలోనే మా పెళ్ళిని చట్టబద్ధం చేసే ప్రయత్నం చేస్తాం” అని అన్నారు.
