అయోధ్య రామ మందిరంలో శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ట శుభ సమయం కోసం యావత్ దేశం ఎంతగానో ఎదురు చూస్తోంది. ఈ కార్యక్రమానికి అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులతో పాటు దేశంలోని ప్రముఖులు, సాధువులు, లక్షలాది భక్తులు తరలి రానున్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రసాదాలకు సైతం ప్రత్యేకత ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్రీరామ ప్రాణప్రతిష్ట సందర్భంగా పెట్టె ప్రసాదం పై అందరి దృష్టి పడింది. రామ్ లల్లా ప్రాణప్రతిష్ట వేడుక కోసం 7 టన్నుల ‘రామ్ హల్వా’ అనే ప్రత్యేక ప్రసాదాన్ని సిద్ధం చేయనున్నారని తెలుస్తోంది. ఆ ప్రసాదాన్ని తయారు చేసే అదృష్టం పొందిన ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు చూద్దాం..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూవులు ఎన్నో ఏళ్ళ నుండి ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ట జనవరి 22న జరుగనుంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుండి పెద్ద ఎత్తున భక్తులు, వీవీఐపీలు, అయోధ్యకు చేరుకోనున్నారు. ఇకపై అయోధ్య రామాలయం హిందూవులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం కానుంది. ఇక ప్రాణప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా 7 వేల కేజీల హల్వాను ప్రసాదంగా తయారు చేయనున్నారు. ఈ ప్రసాద తయారిని విష్ణు మనోహర్ దక్కించుకున్నారు. ఆయనెవరో కాదు దేశంలోనే ప్రముఖ చెఫ్. ఇప్పటికే విష్ణు మనోహర్ వంటలలో 12 వరల్డ్ రికార్డ్స్ ను సాధించారు.
విష్ణు మనోహర్ 1968లో ఫిబ్రవరి 18 నాగ్ పూర్ లోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. కుకింగ్ షో యాంకర్ మరియు చెఫ్. విష్ణు మనోహర్కి నాగ్పూర్, పూణే, ఔరంగాబాద్, ఇండోర్, థానే మరియు కళ్యాణ్ నగరాల్లో రసోయ్ పేరుతో చైన్ రెస్టారెంట్ ఉంది. 53 గంటల పాటు వంట చేసి ప్రపంచ రికార్డు సాధించిన ఏకైక చెఫ్. 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు ‘పొడవైన పరాటా’ చేసి రికార్డ్ క్రియేట్ చేశారు. 3 గంటల్లో 7000 కిలోల మహా మిసల్ను తయారు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన ఏకైక చెఫ్ మనోహర్.
2018 డిసెంబర్ 20న భారతదేశంలో 3200 కిలోల వంకాయలతో వంట చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. 3000 కిలోల కిచిడీని తయారు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆ తరువాత ఒక కుండలో 5000 కిలోల కిచిడి చేసిన తన రికార్డును తానే బ్రేక్ చేశారు. ఎన్నో వంటల పుస్తకాలను కూడా రాశారు. తాజాగా 285 నిమిషాలలో అన్నంతో పాటు 75 రకాల డిషెస్ ను తయారు చేసి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇక ఇప్పుడు రామ మందిర ప్రసాదంను తయారు చేసే బాధ్యతను విష్ణు మనోహర్ తీసుకున్నారు. 7000 కిలోల హల్వాను తయారు చేయడం కోసం 1400 కేజీల భారీ కడాయిని నాగ్ పూర్ నుండి అయోధ్యకు తెప్పించారు. ఈ ప్రసాదాన్ని 1.5 లక్షల భక్తులకు పంచిపెట్టనున్నారు.
Also Read: బంగారు పాదరక్షలు మోస్తూ అయోధ్యకు పాదయాత్ర చేస్తున్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా.?

















కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ గతంలో భారత్ జోడో యాత్ర చేసిన విషయం తెలిసిందే. దానికి కొనసాగింపుగా జనవరి 14 నుండి ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రారంభించబోతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో మణిపూర్ నుండి మొదలయ్యే ఈ యాత్ర 15 రాష్ట్రాల గుండా 6,500 కిలోమీటర్లు సాగి ముంబైలో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ యాత్రకు సంబంధించిన పోస్టర్స్, వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.
భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ బస్సు మరియు కాలినడకన, 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా సాగుతుంది. ఈ క్రమంలో వంద లోక్సభ స్థానాలను చూడుతూ ఈ యాత్ర ముంబైలో ముగుస్తుంది. ఇండియా కూటమి నాయకులను కూడా ఈ యాత్రకు ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ యాత్రకు సంఘీభావంగా యాత్రకు సంబంధించిన పోస్టర్ ను స్వయంగా తానే తన వాహనానికి అతికించారు. ఆ పోస్టర్ లో రాహుల్ గాంధీ ఫోటోతో పాటు, భారత్ జోడో న్యాయ్ యాత్ర అని ఉంది. ఈ పోటోలను ‘ఎక్స్’ లో పోస్ట్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు.
“ఈ నెల 14న భారతదేశంలో మరో మహా యాత్రకు శ్రీ రాహుల్ గాంధీ శ్రీకారం చుడుతున్నారు. గాయపడ్డ మణిపూర్ నుండి ముంబై వరకు భారత్ జోడో న్యాయ్ యాత్రకు సిద్ధమవుతున్నారు. నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తగా నాయకుడి యాత్రకు నా సంఘీభావాన్ని సింబాలిక్ గా తెలిపేందుకు యాత్ర పోస్టర్ ను నేనే స్వయంగా నా వాహనానికి అతికించి ప్రతి కార్యకర్తకు కర్తవ్య బోధ చేస్తున్నాను.”
అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలని ఎన్నో ఏళ్లుగా పోరాటం చేశారు. ఝార్ఖండ్ లోని ధన్బాద్ జిల్లా, కరమ్తాండ్ కు చెందిన సరస్వతి దేవి కు శ్రీరాముడంటే అమితమైన భక్తి. 1992లో బాబ్రీ మసీదు కూల్చిన అనంతరం సరస్వతి అయోధ్యను సందర్శించారు. ఆ సమయంలో అక్కడ తిరిగి రామ మందిరం నిర్మించే వరకూ మౌనవ్రతం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఇక అప్పటి నుండి తనకు ఏం కావాలన్నా సైగలతో మాత్రమే అడగటం ప్రారంభించారు. అయితే రోజులో సరస్వతి గంట సేపు మాత్రమే తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉండేవారు.
2020లో ప్రధాని మోదీ అయోధ్యలో రామమందిర నిర్మించడం కోసం భూమి పూజ చేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన తరువాత సరస్వతి దేవి 24 గంటల పాటు మౌనవ్రతం పాటిస్తూ వస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. జనవరి 22న అయోధ్య రామమందిరంలో రాముని ప్రాణ ప్రతిష్ట తరువాత ఆమె మౌనం వీడనుంది. ఇక రామ మందిర ప్రారంభోత్సవంకు ఆమెకు ఆహ్వానం అందింది.
సరస్వతి దేవి సోమవారం నాడే అయోధ్యకు ప్రయాణం అయ్యారు. రాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత ఆమె మౌనవ్రతాన్ని వీడుతుందని ఆమె కొడుకు హరే రామ్ అగర్వాల్ వెల్లడించారు. స్థానిక ప్రజలు ఆమెను ‘మౌనీమాత’ అని పిలుస్తారు. 1986లో సరస్వతి దేవి భర్త మరణించిన తర్వాత ఆమె తన జీవితాన్నిరామ స్మరణకే అంకితం చేసిందని, యాత్రలు ఎక్కువగా చేస్తారని హరేరామ్ చెప్పుకొచ్చారు.

