ఎట్టకేలకు యావత్ హిందువుల కల నెరవేరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాముల విగ్రహ ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా దేశం నలుమూలల నుంచి భారీ ఎత్తున ప్రజలు అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే సులభంగా అయోధ్యకు వెళ్లే మార్గాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

జనవరి 22న నరేంద్ర మోడీ చేతుల మీదుగా విగ్రహ ప్రాణ ప్రతిష్ట అనంతరం జనవరి 23 నుంచి బాలరాముడిని దర్శించుకునేందుకు సామాన్య ప్రజలకి అధికారులు అనుమతించారు. అయితే అధిక సంఖ్యలో భక్తులు వచ్చినా ఇబ్బందులు తలెత్తకుండా ఉత్తరప్రదేశ్ అధికార యంత్రాంగం తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఫ్లైట్‌లో వెళ్లాలనుకునే వాళ్ళు మీ దగ్గరలోని విమానాశ్రయం నుంచి యూపీలోని లక్నో, వారణాసి విమానాశ్రయానికి చేరుకోవాలి. ఆ తర్వాత అక్కడ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవచ్చు.
అనంతరం అక్కడ నుంచి సులభంగా టాక్సీ బుక్ చేసుకుని ఆలయానికి చేరుకోవచ్చు. లేదంటే లక్నో విమానాశ్రయం నుంచి వెళ్లాలనుకుంటే ప్రైవేట్ టాక్సీలు ఇతర మార్గాల ద్వారా అయోధ్యకు చేరుకోవచ్చు. అలాగే వారణాసి విమానాశ్రయానికి చేరుకున్నట్లయితే అక్కడ నుంచి రైలు బస్సు టాక్సీ ల ద్వారా రామ మందిరానికి రీచ్ అవ్వచ్చు. ఒకవేళ మీరు రైలు మార్గాన ప్రయాణించాలనుకుంటే మీ దగ్గరలోని రైల్వే స్టేషన్ నుంచి అయోధ్యలో ఉన్న పైజాబాద్ జంక్షన్ అయోధ్య జంక్షన్ అనే రెండు రైల్వేస్టేషన్లో చేరుకోవాలి.

దేశంలోని నలుమూలల నుంచి ఈ స్టేషనులకు రైలు రాకపోకలు సాగించే వీలుంది. ఐ ఆర్ సి టి సి ద్వారా టికెట్ బుక్ చేసుకుని ఈ రెండు స్టేషనులకు ముందుగా చేరుకోవాలి. ఆ తరువాత అక్కడ నుంచి టాక్సీ లేదా ఇతర వాహనాల ద్వారా అయోధ్య మందిరానికి చేరుకోవచ్చు. ఇక బస్సు ద్వారా వచ్చేవాళ్ళు ఏదైనా బస్ బుకింగ్ యాప్ ద్వారా ఈజీగా బస్ బుక్ చేసుకొని అయోధ్యకు చేరుకోవచ్చు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లక్నో నుంచి అయోధ్యకు సాధారణ బస్సులను నడుపుతుంది. ప్రయాణ సమయం నాలుగు నుంచి ఐదు గంటలు పడుతుంది.


మహారాష్ట్రకు బీద్ జిల్లా రాజేగాన్ గ్రామానికి చెందిన మహిళా కానిస్టేబుల్ లలితా సాల్వే 1988 లో జన్మించింది. ఆమె 2010 లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఉద్యోగానికి సెలెక్ట్ అయింది. అయితే లలితా సాల్వేకి 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆమె శరీరంలో పలు మార్పులు రావడాన్నిఆమె గుర్తించింది. దాంతో హాస్పటల్ వెళ్లి మెడికల్ టెస్ట్‌లు అన్ని చేయించుకోగా, అసలు సంగతి బయటికి వచ్చింది.
ఆమె శరీరంలో పురుషులలో ఉండే వై క్రోమోజోమ్‌లు ఉన్నాయని తేలింది. దాంతో లలిత జెండర్ డిస్ఫోరియా ఉన్నట్లుగా డాక్టర్లు గుర్తించారు. వారి సూచనతో లింగ మార్పిడి సర్జరీ చేయించుకుని పురుషుడిగా మారింది. లింగ మార్పిడి వల్ల తన ఉద్యోగానికి ఇబ్బంది రాకుండా 2017లో గవర్నమెంట్ ను, బాంబే హైకోర్టును లలిత ఆశ్రయించింది. లింగమార్పిడి సర్జరీ కోసం నెల రోజులు సెలవు కోరింది. దీంతో బాంబే హైకోర్టు మరియు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. అలా లింగమార్పిడి సర్జరీ చేయించుకుంది.
2018 – 2020 వరకు మూడు సర్జరీలు చేయించుకుని పురుషుడిగా మారింది. ఆ తరువాత లలిత్ కుమార్ సాల్వేగా పేరు మార్చుకుంది. 2020లో లలిత్ కుమార్ సాల్వే ఛత్రపతి శంభాజీనగర్‌కు చెందిన సీమాను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు పెళ్లి అయిన నాలుగేళ్ల అనంతరం, జనవరి 15న మగబిడ్డ జన్మించాడు. తనకు మగబిడ్డ జన్మించడంతో లలిత్ కుమార్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తన జీవితంలో ఎదుర్కొన్న అవమానాలు, ఒడిదుడుకుల గురించి తెలిపాడు.



















