తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చరిత్ర రాజమౌళి ప్రత్యేకమైన స్థానం. ఆయన సృష్టించిన రికార్డులను టచ్ చేయడం తిరగరాయడం ఎవరి వల్ల కావడం లేదు. ఒక డైరెక్టర్ గా తెలుగు సినిమాకి అతని ప్రపంచ స్థాయిలో నిలబెట్టింది రాజమౌళి. ప్రతి ఒక్కరూ రాజమౌళితో కంపేర్ చేసుకోవడం, రాజమౌళి సినిమాలతో కంపేర్ చేసుకోవటం, వాటి కలెక్షన్స్ తో కంపేర్ చేసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది.
అయితే ఇప్పుడు గుంటూరు కారం నిర్మాత నాగ వంశీ ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. సంక్రాంతికి గుంటూరు కారం సినిమా విడుదల అవనుండగా, విడుదలయ్యే ప్రతి చోట రాజమౌళి రికార్డును టచ్ చేస్తామంటూ ప్రకటించారు. ప్రతిచోట రాజమౌళి సినిమాకి తగ్గట్టుగానే థియేటర్లలో సినిమాని విడుదల చేయడం, దానికి తగ్గట్టుగానే తమ సినిమా కలెక్షన్స్ సాధించడం జరుగుతుందని అన్నారు.
గుంటూరు సినిమా స్టోరీ నాకు తెలుసు అని, ఇప్పటివరకు జరిగిన షూటింగ్ తనను చూశానని సినిమా కంపల్సరిగా సూపర్ హిట్ అవుతుందని కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఎన్ని సినిమాలు వచ్చిన కూడా ఆడియన్స్ అందరూ గుంటూరు కారం సినిమాకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారని అన్నారు. మహేష్ అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే రిలీజ్ ఉంటుందని భరోసా కల్పించారు.