జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ని ఎందుకు కలిశారు..? కేసీఆర్ జగన్ కి ఇచ్చిన సలహాలు ఏంటంటే..?

జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ని ఎందుకు కలిశారు..? కేసీఆర్ జగన్ కి ఇచ్చిన సలహాలు ఏంటంటే..?

by Mounika Singaluri

Ads

తుంటి ఆపరేషన్ జరిగి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నంది నగర్ లో ఉన్న ఆయన నివాసం నందు కలిసి పరామర్శించారు.

Video Advertisement

కేసీఆర్ హాస్పిటల్ వద్ద ఉండగానే చాలామంది రాజకీయ శని ప్రముఖులు ఆయనను కలిసి పరామర్శించారు. అయితే జగన్మోహన్ రెడ్డి తాజాగా వెళ్లి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

reason behind jagan meeting kcr

అయితే ఈ సమావేశంలో ఇద్దరు నేతలు ఏకాంతంగా 45 నిమిషాల పాటు చర్చలు జరిపారని తెలిసింది. ఏపీ రాజకీయాలు, అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాం, లోక్ సభ ఎన్నికలపై చర్చించినట్టు సమాచారం.ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల గురించి జగన్‌కు కేసీఆర్ పలు సూచనలు చేశారని సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తప్పులు చేయొద్దని చెప్పారని తెలిసింది. అలాగే పలు నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చాలని కేసీఆర్ హితోపదేశం చేశారని తెలిసింది.

లోక్ సభ ఎన్నికల్లో పరస్పర సహకారంపై కూడా సమావేశంలో చర్చకు వచ్చిందట. తెలంగాణలో వైసీపీ బీఆర్ఎస్ పార్టీకి, ఆంధ్రాలో బీఆర్ఎస్ వైసీపీకి సపోర్ట్ చేసేలా ప్రతిపాదన వచ్చిందని అంటునారు. వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక పై కూడా కేసీఆర్- జగన్ మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది. ఇలా వివిధ అంశాలపై 45 నిమిషాల పాటు చర్చించారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ మాజీ ముఖ్యమంత్రి మధ్య సమావేశం హాట్ టాపిక్ గా మారింది


End of Article

You may also like