సాధారణంగా ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన వారు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తారనే విషయం తెలిసిందే. ఇక ప్రమాణ స్వీకారం చేసే ఎమ్మెల్యేలు వారి మాతృ భాషలో లేదా ఇంగ్లీష్ లో కానీ చేస్తుంటారు.
అయితే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలో గెలిచిన ఇద్దరు సంస్కృత భాషలో ప్రమాణ స్వీకారం చేయడం వైరల్ గా మారింది. ఎందుకంటే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ముస్లింలు. వీరిద్దరు ఇలా చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. వీరి పై నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఇద్దరు ముస్లిం ఎమ్మెల్యేలు సంస్కృతంలో ప్రమాణ స్వీకారం ఎందుకు చేశారో ఇప్పుడు చూద్దాం..
బీబీసి తెలుగు న్యూస్ కథనం ప్రకారం, ఇటీవల రాజస్థాన్ లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో విజయం సాధించిన వారిలో ఇద్దరు ముస్లిం ఎమ్మెల్యేలు సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఈ ఇద్దరి ఎమ్మెల్యేల గురించి చర్చ జరుగుతోంది. ఒకరు యూనుస్ ఖాన్, బీజేపీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. మరొకరు కాంగ్రెస్ పార్టీకి చెందిన జుబేర్ ఖాన్. రాజస్థాన్ లో 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 199 స్థానాలకు ఎలెక్షన్స్ జరిగాయి.
డిసెంబర్ 20న 191 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 21న 8 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. జుబేర్ ఖాన్ రామ్గఢ్ నియోజకవర్గం నుంచి గెలువగా, యూనస్ ఖాన్ దివానా నుంచి గెలిచారు. సంస్కృతంలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం పై వీరిద్దరు స్పందించారు. యూనస్ ఖాన్ మాట్లాడుతూ “మేం మంచి పనిచేశామని ముస్లింలు సైతం ప్రశంసించారు” అని చెప్పారు. దేశంలో సంస్కృత భాష చాలా గొప్ప పురాతనమైన భాష అని, ఆ భాషలో ప్రమాణం చేయడం వల్ల ఎంతో గర్వపడుతున్నాను” అంటూ యూనస్ ఖాన్ వెల్లడించారు.
ఇక జుబేర్ ఖాన్ ఈ విషయం పై స్పందిస్తూ “సంస్కృతం మన దేశ పురాతన భాష. మేము భారత్ లోనే జీవిస్తున్న ఇండియన్ ముస్లింలం. అందువల్ల ఇక్కడి రాజ్యాంగాన్ని, సంస్కృతిని విశ్వసిస్తాం. సోదరభావం పై విశ్వాసం ఉంది. ప్రతి మతాన్ని గౌరవిస్తాం. సీనియర్ సెకండరీ దాకా నేను సంస్కృతం చదివాను. సంస్కృతంలో రెండోసారి ప్రమాణ స్వీకారం చేశాను. ముస్లిం అయిన నేను, ప్రమాణం సంస్కృతంలో చేయడం అందరికీ నచ్చింది” అంటూ జుబేర్ ఖాన్ వెల్లడించారు.
Also Read: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయో తెలుసా..? ఒక రోజులో ఏం తింటారు అంటే..?