దేశంలో మొదటి సారిగా ఎక్కడ లేని విధంగా ఒక కొత్త తమిళనాడులోని కోయంబత్తూరు ఆర్టీసీ రీజియన్ పరిధిలో సంబంధిత అధికారులు ఓ కొత్త రూల్ తీసుకోని వచ్చారు . ఆ నిబంధన కూడా డ్రైవర్లకు మాత్రమే.బస్ డ్రైవర్ లు పక్కన కూర్చున్నా మహిళలతో మాట్లాడకూడదు..అసలేందుకు ఈ నిబంధన అని కోయంబత్తూరు ఆర్టీసీ అధికారులను ప్రశ్నించగా ,కొందరు డ్రైవర్లు మహిళలతో మాట్లాడుతూ ఏకాగ్రతతో బస్సు నడపకుండా డ్రైవింగ్ చేస్తున్నారని తమకు భారీగా ప్రయాణికుల నుండి ఫిర్యాదులు అందటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు.
డ్రైవర్లు పరధ్యానంతో బస్సులు నడుపుతూ ప్రాణాలు తీస్తున్నారని ఆర్టీసీ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్లే ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కోయంబత్తూరు ఆర్టీసీ అధికారులు చెప్పారు. ఈ నిబంధన అతిక్రమించే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈ నిబంధనపై సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య పెద్ద చర్చే జరుగుతోంది.