గతనెల మూడో తేదీన సోషల్ మీడియాలో ఓ పోస్టు బాగా వైరల్ అయ్యింది. ఓ మహిళ ముగ్గురు పిల్లలతో కలిసి ఇటుకల బట్టీ దగ్గర నిలబడిన ఫొటో అది.ఈ ఫొటో వెనుక గుండెను బరువెక్కించే విషాదకరమైన కథ ఉంది.ఆకలికి పేద గొప్పా తేడా తెలియదు. తినటానికి తిండి లేకపోయినా ఆకలి అనేది మనిషికే కాదు ప్రతీ జీవికి సర్వసాధారణం.అలా కడుపేదరికంలో మగ్గిపోతున్న ఓ తల్లి కడుపున బిడ్డలకు పట్టెడన్నం పెట్టటానికి చేసిన పని మనస్సుల్ని కలచివేస్తోంది.తమిళనాడులోని సేలంకు చెందిన సెల్వం, ప్రేమ దంపతులకు ముగ్గురు పిల్లలు. సెల్వం, ప్రేమ ఇటుక బట్టీలో పని చేస్తుండేవారు. సొంతంగా వ్యాపారం చేయడానికి సెల్వం అప్పు చేశాడు. వడ్డీతో కలిపి ఆ అప్పు రూ. 2.5 లక్షలు అయింది. వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. కొందరు మోసగించారు. దీంతో ఏడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తల్లి ముగ్గురు బిడ్డలు వీదిన పడ్డారు.ఇంట్లో అన్ని అమ్మేసి అప్పులకు కట్టేసింది. తమకంటూ ఏమి మిగల్లేదు. ఉండటానికి గూడు తప్ప.. బంధువులు, ఇరుగుపొరుగు వారు పట్టించుకోలేదు.

బిడ్డల ఆకలి కేకలను చూడలేక అల్లాడిపోయింది. ఇంతలో వెంట్రకులు కొంటామంటూ పిలుపు వినిపించింది. అంతే.. ఇంట్లోకి పరిగెత్తుకెళ్లి తన జుట్టును కత్తిరించి తీసుకొచ్చి అమ్మేసింది. ఆ జుట్టుకు అతడు రూ.150 ఇచ్చాడు. పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లి ఇంట్లోకి బియ్యం, సరుకులు తెచ్చింది. పొయ్యి వెలిగించి అన్నం వండి పిల్లలకు కడుపునిండా పెట్టింది.ప్రేమ ఆకలి కష్టాలు తెలుసుకున్న బాలా అనే గ్రాఫిక్ డిజైనర్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెటిజన్లు చలించి ఆమెకు రూ.1.45 లక్షల వరకు ఆర్థిక సాయాన్ని అందించారు. ఆ మొత్తాన్ని ప్రేమకు ఇచ్చాడు.. ఇటుకబట్టీలో పనికి కూడా కుదిర్చాడు. ప్రేమ పరిస్థితి గురించి తెలిసిన సేలం జిల్లా అధికారులు కూడా స్పందించి వితంతు పింఛన్ మంజూర్ చేశారు. ప్రభుత్వం ప్రేమకు వితంతు పెన్షన్‌ను మంజూరు చేసింది.
News
తాగిన మత్తులో పోలీసులకు చుక్కలు చూపించిన కుర్రాడు…వీడియో చూస్తే నవ్వుకుంటారు …
తాగిన మందు తలకెక్కింది. ఇంకేముంది మత్తులో ఉన్న మందుబాబు డ్యూటీలో ఉన్న పోలీసులనే చెడుగుడు ఆడేశాడు. పోలీసులకు కొద్దిసేపు చిరాకు తెప్పించాడు ఆ మందు బాబు. బండి దిగు అంటే ఎందుకు దిగాలి , నాకేం అవసరం అంటూ గోల చేసాడు. అతన్ని బండి ఎక్కిద్దాం అని చూసిన పోలీసులకు చుక్కలు చూపించాడు. నన్ను పట్టుకుంటారు ఎందుకు అని సతాయించాడు. స్టేషన్ కి తీసుకెళ్లారు అంతేగా తీసుకెళ్లండి. నేనేం తప్పు చేయలేదు. మహా అయితే కొడతారు చంపుతారు అంతే గా అంటూ హడావిడి చేసాడు. ఈ వీడియో అక్కడి వారు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసారు. ఇది చూసిన వారు అందరు నవ్వుకుంటున్నారు. ఈ వీడియో ఇప్పుడు హల్చల్ చేస్తుంది. మీరు కూడా ఒక లుక్ వేసుకోండి.

గతంలో ఇలాగె ఒకడు తాగి పోలీసులకి దొరికి రాదు రాదు అనే డైలాగ్ తో ఎంత ఫేమస్ అయ్యాడో మీకు తెలిసిందే. గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా రాదు అనే డైలాగ్ ఎంతో మంది టిక్ టాక్ లో వీడియోలు కూడా చేసారు. మీకు కూడా గుర్తుండే ఉంటది.
watch video:
విజయ్ దేవరకొండ, రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. దర్శకుడు మాధవ్ డిఫ్రెంట్ స్టోరీతో వచ్చినప్పటికీ క్లైమాక్స్ లో అదే మూసపద్ధతిలో ఎండ్ పలుకుతాడు. విజయ్, రాశి, ఐశ్వర్య రాజేష్ లు యాక్టింగ్ పరంగా వదిగిపోయారు.

ఫస్ట్ ఆఫ్ బాగున్నప్పటికీ సెకండ్ ఆఫ్ ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది.సాంగ్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. దర్శకుడు సెకండ్ ఆఫ్ లో ఎమోషనల్ కాస్త ఎక్కువగా చూపించాలని ప్రయత్నించినప్పటికీ పండించటంలో నటి, నటులు ఫెయిల్ అయ్యారనిచెప్పాలి.ఈ సినిమా చూసిన ఆడియన్స్ మాత్రం పబ్లిక్ టాక్ లో దీనంత చెత్త సినిమా ఇప్పటివరకు చూడలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సహనానికి పరీక్ష పెట్టారు అంటున్నారు. ఇకనైనా విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి ఫీవర్ నుండి బయటకి వచ్చి వేరే జోన్ సినిమాలు చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు.

విజయ్ నటన బాగున్నప్పటికీ సినిమాలో కంటెంట్ లేకపోవడంతో ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. మొత్తం మీద ప్లాప్ అనే చెప్పాలి. మరి ఈ సినిమాని సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోల్ల్స్ చేస్తున్నారో మీరే చూడండి. చూస్తే నవ్వకుండా ఉండలేరు. సినిమా చూడటం కంటే ఈ ట్రోల్ల్స్ చూడటం బెటర్ అనుకుంట.!
watch video:
ఉసేన్ బోల్ట్ ను మించిన వేగం…బురదలో100మీటర్లు 9సెకన్లలో పరిగెత్తి రికార్డు బ్రేక్ చేసాడు.
ఉసేన్ బోల్ట్‌ను ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తిన రన్నర్‌గా అంతా గుర్తుపెట్టుకుంటారు. 100మీ. రేసును కేవలం 9.58 సెకన్లలోనే పూర్తి చేసిన ఒకేఒక్క అథ్లెట్‌గా నిలిచాడు. అయితే అతడిని మించిన వేగంతో శ్రీనివాస గౌడభారత్‌లో రాత్రికి రాత్రే సూపర్‌స్టారయ్యాడు.కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని ఐకళ ప్రాంతంలో ఈ నెల 1న నిర్వహించిన కంబళ పోటీలో వంద మీటర్ల దూరాన్ని శ్రీనివాస గౌడ కేవలం 9.55 సెకన్లలో పరుగెత్తడం సంచలనంగా మారింది. ఐకళలో తన దున్నలతో కలిసి 142.50 మీటర్ల దూరాన్ని 28 ఏళ్ల శ్రీనివాస గౌడ 13.62 సెకన్లలో పరిగెత్తినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ లెక్కన అతడు వంద మీటర్ల పరుగును కేవలం 9.55 సెకన్లలో పూర్తిచేసినట్లన్నమాట.

బురద మళ్లలో పోటీదారులు తమ దున్నలతో కలిసి వేగంగా పరిగెత్తాల్సి ఉంటుంది. నగదు బహుమతి రూ.లక్షల్లో ఉంటుంది. వేగంగా పరిగెత్తించేందుకుగాను దున్నలను పోటీదారులు కొరడాతో బలంగా కొడుతుండటంపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేయడంతో కొన్నేళ్ల క్రితం కంబళను నిషేధించారు. కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యాక ఆ నిషేధాన్ని తొలగించారు.ఉడుపిలో ఈ పరుగు పందేలను ఏటా నిర్వహిస్తుంటారు. ఎవరైతే వాటిని వేగంగా పరిగెత్తించి లక్ష్యాన్ని చేరుకుంటారో వారే విజేతలుగా నిలుస్తారు. అయితే బోల్ట్‌తో పోలిక ఎలా ఉన్నా ఈక్రమంలో అతను కంబళ పోటీల్లో 30 ఏళ్ల రికార్డును బద్దలు కొడుతూ అత్యంత వేగంగా పరిగెత్తిన వ్యక్తిగా నిలిచాడు.
ఏంటి నితిన్ మొన్నేమో అలా అన్నావ్…ఇప్పుడు భార్య గురించి ఇలా పోస్ట్ చేసావ్?
నితిన్ కల్యాణానికి ముహూర్తం కుదిరింది. దుబాయ్ వేదికగా పెళ్లి జరగనుంది. ఇప్పుడు నితిన్ చేస్తున్న ‘భీష్మ’ సినిమా ట్యాగ్‌లైన్ ‘ది బ్యాచ్‌లర్’. అయితే నితిన్ బ్యాచ్‌లర్ లైఫ్‌కి ఫుల్స్టాప్ పడబోతోంది. పెళ్లి పనులు స్టార్టడ్, మ్యూజిక్ స్టార్ట్స్ అని ట్విట్టర్ లో ట్వీట్ చేసి నిశ్చితార్థం ఫోటోలు పంచుకున్నాడు నితిన్. పెళ్లి పనులు స్టార్టడ్ అని కూడా అన్నాడు. ఈ పోస్ట్ కి ఎంతో మంది సెలబ్రిటీస్ రిప్లైలు కూడా ఇచ్చారు, కంగ్రాట్స్ తెలిపారు.

ఇది ఇలా ఉండగా.. నితిన్, రష్మిక జంటగా నటించిన భీష్మ త్వరలో ప్రేక్షకుల ముందుకి రానున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు పాటలు ప్రజాధారణ పొందాయి. ఇక అసలు విషయానికి వస్తే…మొన్నేమో నితిన్ భీష్మ సినిమాలోని “సింగిల్స్ ” సాంగ్ షేర్ చేసి ఫరెవర్ సింగల్ అన్నాడు. నిన్నేమో పెళ్లి పనులు స్టార్టడ్ అని పోస్ట్ చేసాడు. దీనిపై నెటిజెన్స్ ఫన్నీ ట్రోల్ల్స్ చేస్తున్నారు. అప్పుడు సింగల్ బెస్ట్ అని ఇప్పుడు పెళ్లి పనులు స్టార్టడ్ అంటావా అంటూ సరదా ఛలోక్తులు విసురుతున్నారు.

దుబాయ్‌లోని పలాజో వెర్సాసెలో ఏప్రిల్ 15 వ తేదీన నితిన్ వివాహ వేడుక జరగనుంది.
ఏప్రిల్ 16వ తేదీన రిసెప్షన్ నిర్వహించనున్నట్టు తెలిసింది. ఇది ఇలా ఉండగా…వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న భీష్మ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకి రానుంది. నితిన్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్నారు. మరి అటు సినిమా ఇటు లైఫ్ రెండు సక్సెస్ అవ్వాలని నితిన్ కి విషెస్ తెలుపుదాం.
“వరల్డ్ ఫేమస్ లవర్” తో విజయ్ హిట్ కొట్టాడా? స్టోరీ రివ్యూ రేటింగ్!!!
చిత్రం: వరల్డ్ ఫేమస్ లవర్
నటీనటులు: విజయ్ దేవరకొండ, రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కాథరిన్ తెరెసా, ఇజాబెల్లె తదితరులు
నిర్మాత: కె.ఎ.వల్లభ
దర్శకత్వం: క్రాంతి మాధవ్
మ్యూజిక్: గోపీ సుందర్
విడుదల తేదీ: ఫిబ్రవరి 14, 2020

కథ:
గౌతమ్ (విజయ్ దేవరకొండ) ను జైలు లో కొట్టే సీన్ తో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. యామిని (రాశీ ఖన్నా)తో లవ్ స్టోరీ ముందుగా వస్తుంది. తర్వాత బ్రేక్ అప్ అవుతారు. అక్కడి నుంచి స్టోరీ ఎల్లందు బొగ్గు గనులకు షిఫ్ట్ అవుతుంది. అక్కడ విజయ్ దేవరకొండ శీనయ్యగా కనిపిస్తాడు. ఆ కథ ఎలా షిఫ్ట్ అవుతుంది అనేది ట్విస్ట్. అప్పటికే సువర్ణ (ఐశ్వర్య రాజేష్)తో పెళ్లయి పిల్లాడు ఉన్న సీనయ్య కోల్ మైన్ వెల్ఫేర్ ఆఫీసర్ స్మిత (కేథరిన్)తో ప్రేమలో పడతాడు. దీని తర్వాత కథ పారిస్ కి షిఫ్ట్ అవుతుంది. ఇజాబెల్లెతో ప్రేమలో పడతాడు విజయ్. వీళ్ళందరికీ ఏమైనా కనెక్షన్ ఉందా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
దర్శకుడు మాధవ్ డిఫ్రెంట్ స్టోరీతో వచ్చినప్పటికీ క్లైమాక్స్ లో అదే మూసపద్ధతిలో ఎండ్ పలుకుతాడు. విజయ్, రాశికన్నా, ఐశ్వర్య రాజేష్ లు యాక్టింగ్ పరంగా వదిగిపోయారు.ఫస్ట్ ఆఫ్ బాగున్నప్పటికీ సెకండ్ ఆఫ్ ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది.సాంగ్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. దర్శకుడు సెకండ్ ఆఫ్ లో ఎమోషనల్ కాస్త ఎక్కువగా చూపించాలని ప్రయత్నించినప్పటికీ పండించటంలో నటి, నటులు ఫెయిల్ అయ్యారనిచెప్పాలి.

ప్లస్ పాయింట్స్:
విజయ్, రాశికన్నా, ఐశ్వర్య రాజేష్ ల యాక్టింగ్
పారిస్ సన్నివేశాలు
శీనయ్య పాత్ర
ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్:
స్లో గా సాగే సన్నివేశాలు
బోరింగ్ సీన్స్
క్లైమాక్స్
సెకండ్ హాఫ్
సాంగ్స్

రేటింగ్: 2.5/5
టాగ్ లైన్: ముల్టీఫ్లెక్ సినిమా కావటంతో కమర్షియల్ గా ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టం. ఫేమస్ లవర్ అవేరేజ్ అనే చెప్పాలి
గతనెల మూడో తేదీన సోషల్ మీడియాలో ఓ పోస్టు బాగా వైరల్ అయ్యింది. ఓ మహిళ ముగ్గురు పిల్లలతో కలిసి ఇటుకల బట్టీ దగ్గర నిలబడిన ఫొటో అది.ఈ ఫొటో వెనుక గుండెను బరువెక్కించే విషాదకరమైన కథ ఉంది.ఆకలికి పేద గొప్పా తేడా తెలియదు. తినటానికి తిండి లేకపోయినా ఆకలి అనేది మనిషికే కాదు ప్రతీ జీవికి సర్వసాధారణం.అలా కడుపేదరికంలో మగ్గిపోతున్న ఓ తల్లి కడుపున బిడ్డలకు పట్టెడన్నం పెట్టటానికి చేసిన పని మనస్సుల్ని కలచివేస్తోంది. ఆ తల్లి పడిన బాధ ఏంటో తెలియాలి అంటే కింద ఉన్నా వీడియో చుడండి .అలాగే అందరికి షేర్ చేయండి
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కీలక నిర్ణయం…ఇప్పటి నుంచి ఫేక్ కలక్షన్లు గొడవా ఉండదు
తెలుగు సినిమా ఇప్పుడు రికార్డు వసూళ్ల వలలో చిక్కుకుంది. మా సినిమా ఇంత సాధించింది.. మాది ఇన్ని రికార్డులు బద్దలు కొట్టింది అంటూ – పోస్టర్లు వేసుకుంటూ, ఎవరి డబ్బా వాళ్లే కొట్టుకుంటున్నారు. ఇంకాస్త ముందుకు వెళ్లి `వాళ్లది ఫేక్ కలక్షన్లు..మా హీరో గొప్పంటే .. మా హీరో గొప్ప.. మా హీరో ఈ రేంజ్ లో వసూళ్లు సాదించాడంటే .. కాదు మీవి ఫేక్ ఫేసూల్లు ఇదిగో మా హీరో జెన్యూన్ వసూళ్లు అంటూ ఇంకా ఆయా హీరోల ఫాన్స్ మధ్య గొడవలు నడుస్తూనే ఉన్నాయి.ఈ విషయం గురించి అటు కోలీవుడ్, ఇటు బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. ఆ హీరోలు టాలీవుడ్ పరువు తీస్తున్నారని టాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు

దీనికి అడ్డుకట్ట వేయాలని నిర్మాతలు కలిసికట్టుగా ఓ నిర్ణయం తీసుకున్నారు.నిర్మాతల శ్రేయస్సు కోసం ఏర్పడిన ప్రొడ్యూసర్స్ గిల్డ్ సినిమాల రిలీజ్‌ల విషయంలో నిర్మాతలకు తన వంతు సహకారాన్ని అందిస్తుంది. సినిమాల రిలీజ్ విషయంలో క్లాష్ రాకుండా కీలక పాత్ర పోషించిన ప్రొడ్యూసర్స్ గిల్డ్… తమ సినిమా వసూళ్ల లెక్కలు ఎవరికి వాళ్లు ప్రకటించుకోకూడదని గిల్డ్ ఓ నియమం విధించింది. ఒకవేళ సినిమా వసూళ్ల వివరాలు ప్రకటించుకోవాల్సివస్తే అందుకు గిల్డ్ అనుమతి తీసుకోవాలి. ఇలా చేస్తే ఫేక్ కలక్షన్ల గొడవ తగ్గుతందున్నది అభిప్రాయం.. మొత్తానికి ఇది మంచి అడుగే. గిల్డ్ నిస్పక్షపాతంగా ఉంటే తప్పకుండా ఫేక్ వసూళ్ల బెడద తప్పుతుంది.మొత్తానికి ఇది సినిమా అభిమానులకు మంచి అడుగే. గిల్డ్ ఖచ్చితంగా పనిచేస్తే ఫేక్ వసూళ్ల బెడద తప్పుతుంది అని సినీ అభిమానులు కోరుకుంటున్నారు
చైనాలో మొదలైన కరోన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. …అలా వైరస్ బారిన పడిన ఒక మహిళ పండంటి బాబుకు జన్మనిచ్చింది. . అయితే వైద్యులు పుట్టిన బాలుడికి కూడా వెంటనే కరోనా టెస్టులు చేశారు. అదృష్టవశాత్తు బాలుడికి వైరస్ సోకలేదని వైద్యులు తెలిపారు. తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో శనివారం ఈ బాలుడు జన్మించాడు. వైద్యులు తగిన రక్షణ చర్యలు తీసుకున్న తర్వాత ఆపరేషన్ చేసి బాలుడిని బయటకు తీశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.కరోనాను ఎదిరించి పుట్టిన ఈ బాలుడి వార్త సోషల్ మీడియాలో అందరినీ ఆకర్షిస్తుంది. నెటిజన్లు అందరూ ఆ బాలుడిని లక్కీ బోయ్ అని అంటున్నారు
Lucky baby: A woman infected with novel coronavirus pneumonia gave birth to a boy with no infection in Zhejiang, China. #FightVirus pic.twitter.com/hQtK1RZUXi
— China Xinhua News (@XHNews) February 9, 2020
మనం చేసిన సహాయం…ఏదో ఒక రూపంలో నిన్ను వెతుకుంటు వస్తుంది అని చెప్పడానికి వీళ్ళ కథే ఒక ఉదాహరణ
ఒక రైతు తన పొలంలో పని చేసుకుంటుంటే ఏవో అరుపులు వినిపించాయి.వెంటనే అటు వైపు వెళ్లి చూస్తే అక్కడ ఒక అబ్బాయి బావిలో పడి “HELP, HELP” అని అరుస్తూ ఉంటాడు, రైతు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బావిలో దూకి ఆ అబ్బాయిని కాపాడి ధైర్యం చెప్పి ఇంటికి పంపిస్తాడు.తర్వాతి రోజు వాళ్ళింటి ముందు ఒక ఖరీదయిన గుర్రపుబండి వచ్చి ఆగుతుంది, అందులో నుండి ఖరీదయిన దుస్తులు ధరించిన పెద్ద మనిషి దిగి నేరుగా రైతు వద్దకు వస్తాడు,ఎవరు బాబు మీరు?? ఎవరు కావాలి?? అని అడుగుతాడు రైతు.”నమస్తే, నేను పక్క వూర్లో ఉంటాను, నిన్న మీరు మా అబ్బాయిని బావిలో పడిపోతే రక్షించారు, అందుకు కృతజ్ఞతగా ఏమిచ్చినా మీ ఋణం తీరదు, దయచేసి ఈ ధనం తీసుకోండి” అంటూ ఒక ఇనప్పెట్టె ఇస్తాడు.అప్పుడు రైతు “క్షమించండి, నేను ప్రతిఫలం ఆశించి చేయలేదు, ఒక వ్యక్తి ఆపదలో ఉంటే నా చేతనయిన సాయం చేసాను, అది మనిషిగా నా ధర్మం, ” అంటూ సున్నితంగా తిరస్కరిస్తాడు.ఇంతలో ఆ రైతు కొడుకు అక్కడికి వచ్చి పెద్ద మనిషికి నమస్కరిస్తాడు….ఈ అబ్బాయి నీ కొడుకా?? ఏం చదువుతున్నాడు?? అని అడుగుతాడు పెద్దమనిషి.

అవునండి నా కొడుకే, కొంతవరకు చదివించాను, ఇక చదివించే స్తోమత లేదు, ఇపుడు నాతో పాటే పొలానికి వచ్చి పనుల్లో సాయపడుతుంటాడు” అంటాడు రైతు.”అలాగా, అయితే నా మాట విను, నీ కొడుకుని నేను చదివిస్తాను, నా కొడుకుతో పాటు పెద్ద చదువులు చదువుకుంటాడు, ఖర్చంతా నేను భరిస్తాను. నా మాట కాదనకు, నా కొడుకుని కాపాడిన నీ ఋణం కొంతయినా తీర్చుకోనివ్వు” అంటాడు.ఆ పెద్ద మనిషి అంతలా అడుగుతుంటే కాదనలేక సరే అంటాడు రైతు.పెద్ద మనిషి పిల్లలిద్దరిని పెద్ద చదువులు చదివిస్తాడు, వాళ్ళిద్దరూ చాలా గొప్ప వాళ్ళు అవుతారు.కొంతకాలానికి ఆ పెద్ద మనిషి కొడుక్కి ఒక అంతు తెలియని వ్యాధి వస్తుంది, డాక్టర్లు అందరూ అతన్ని పరీక్షించి చేతులెత్తేస్తారు, అప్పుడు ఆ రైతు కొడుకు వచ్చి తను కనిపెట్టిన మందుతో ఆ వ్యాధిని నయం చేస్తాడు.
ఆ రైతు కొడుకు ఎవరో తెలుసా??పెన్సిలిన్ మందుని కనిపెట్టి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త “Alexander Fleming”..!!! ఇంతకు ఆ రెండో వ్యక్తి ఎవరో తెలుసా?? బ్రిటీష్ ప్రధాన మంత్రి ” Winston Churchil” అందుకే అంటారు ” పుణ్యం వూరికే పోదు, కలకాలం తోడొస్తుంది” అని.!!
<
