తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న తరానికి సినిమాలో కామెడీ అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు బ్రహ్మానందం. ఏమి చేయకుండా అలా నిలబడిన నవ్వించే టాలెంట్ కలిగిన బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
తన సినీ ప్రస్థానంలో వేయికి పైగా చిత్రాలలో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో స్థానాన్ని సుస్థిరం చేసుకున్న నటుడు బ్రహ్మానందం.

అయితే తండ్రిని వరించిన ఫెమ్ కొడుకుని వరించాలి అన్న రూల్ లేదు కదా.. అలాగే తండ్రి బాటలో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి అనుకున్న రాజా గౌతమ్.. అనుకున్న రీతిన సక్సెస్ సాధించలేకపోయాడు. రాఘవేంద్రరావు స్క్రీన్ ప్లే ఇచ్చిన పల్లకిలో పెళ్లికూతురు చిత్రంలో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాజా గౌతమ్ ఆ తరువాత రెండు మూడు చిత్రాలలో నటించినప్పటికీ ఊహించినంత స్టార్డమ్ సంపాదించలేకపోయాడు.

త్వరలో అతను బ్రేక్ ఔట్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నిజానికి అతనికి యాక్టింగ్ కంటే కూడా బిజినెస్ అంటే ఎక్కువ ఇష్టమట. హైదరాబాద్ మరియు బెంగళూరులో పలు వ్యాపార సంస్థలు పెట్టుబడులు పెట్టడమే కాకుండా రెస్టారెంట్లను కూడా నడుపుతున్న రాజా గౌతమ్ నెలసరి ఆదాయం సుమారు 30 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. ఎప్పుడైనా బోర్ అనిపించినప్పుడు మాత్రమే అతను సినిమాలు చేయడానికి ఇష్టపడతారట..
ALSO READ : “మా సినిమాలో అవి నాకే నచ్చలేదు..!” అంటూ… “ఆదిపురుష్” పై నటుడి కామెంట్స్..! ఏం అన్నారంటే..?









స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, నాగేశ్వరరావు అనే వ్యక్తి 25 సంవత్సరాల క్రితం శ్రీనివాస్‌నగర్ లో ఇంటిని నిర్మించుకున్నాడు. అయితే ఆ ఇంటి ముందు రోడ్డు ఎత్తు పెరగడం వల్ల వర్షాకాలంలో వరద నీళ్లు నాగేశ్వరరావు ఇంట్లోకి వస్తున్నాయి. దాంతో ఈ సంవత్సరం వరద నీళ్ళు తన ఇంట్లోకి రాకుండా అతను చర్యలు తీసుకోవాలను కున్నాడు. అందులో భాగంగా తన ఇంటిని ఎత్తును కొన్ని అడుగులు పెంచాలని భావించాడు. ఈ పనులను ఒక కాంట్రాక్టర్ కు అప్పగించాడు. హైడ్రాలిక్ జాకీలను ఉపయోగించి నాగేశ్వరరావు ఇంటిని మెల్లగా పైకి లేపడం ప్రారంభించారు. ఈ క్రమంలో హైడ్రాలిక్ జాకీలు పక్కకు జరిగాయి. దాంతో ఆ ఇల్లు పక్కనే ఉన్న మరో బిల్డింగ్ పైన వాలింది.
ఈ బిల్డింగ్ మొత్తం పక్కనే ఉన్న బిల్డింగ్ పైన వాలడంతో పక్క బిల్డింగ్ లో ఉన్న వారంతా భయంతో బయటకు పరుగెత్తారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వచ్చిన జీహెచ్ఎంసీ ఆఫీసర్లు నాగేశ్వరరావు ఇంటిని పరిశీలించారు. జాకీలు పక్కకు జరగడం వల్ల బిల్డింగ్ పక్కేన ఉన్న బిల్డింగ్ పైన వాలిందని ఆఫీసర్లు తెలిపారు. ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండానే మరమ్మతులు చేపట్టడంతో పోలీసులు నాగేశ్వరరావు పై కేసు రిజిస్టర్ చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు నాగేశ్వరరావు బిల్డింగ్ ని కూల్చేయాలని నిర్ణయించారు.







