చాణుక్యుడు ఎంతటి మహాజ్ఞానో మనందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆర్థిక సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రంలో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది. ఈయన రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి గడించారు. ఈయన చెప్పిన నీతి వాక్యాలు నేటికీ చిరస్మరణీయాలు. వాటిని తరువాతి తరానికి కూడా అందచేసి.. మంచి భవిష్యత్ ను రూపొందించుకునేలా తోడ్పడాలి. చాణిక్య నీతి ఎన్నో ముఖ్యమైన విషయాలు చెబుతోంది. ఇప్పుడు ఎవరి ఇంట్లో భోజనం చేయకూడదు అని చాణక్య చెప్పారో చూద్దాం.
#1. అనేక మంది పురుషులతో సంభందాలు పెట్టుకున్న స్త్రీ ఇంట్లో అస్సలు భోజనం చేయకూడదు అని చాణక్య చెప్పారు. ఆమె ఇంట్లో భోజనం చేయడం మంచిది కాదు అని..అనేక సమస్యలు వస్తాయని చెప్పారు.
#2. అంటూ వ్యాధులు ఉన్న రోగుల ఇంట్లో కూడా భోజనం చేయద్దని చాణక్య అన్నారు. ఎందుకంటే రోగుల ఇంట్లో భోజనం చేయడం ద్వారా క్రిములు మన శరీరంలోకి కూడా ప్రవేశించే ప్రమాదం ఉంది. దీని వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు.
#3. అక్రమంగా డబ్బు సంపాదించిన వారి ఇంట్లో అస్సలు భోజనం చేయకూడదు. ఎందుకంటే వారు తప్పు చేసి సంపాదించిన డబ్బుతో అన్నం తింటారు. అలా మోసం చేసి సంపాదించిన వారి ఇంట్లో తినడం మనపై కూడా చేదు ప్రభావం చూపుతాయి.
#4. అలాగే నేరస్థుల ఇళ్లలో అస్సలు భోజనం చేయద్దు అని చెప్పారు చాణక్య. అలాంటి వారి ఇంట్లో భోజనం చేయడం వల్ల మనకి ఇబ్బందులు రావచ్చు. మన ఆలోచనలపైన కూడా చెడు ప్రభావం చూపవచ్చు.
మన ఆలోచనలు, అలవాట్లు ఎప్పుడూ కూడా మంచివే అయ్యి ఉండాలి. జీవితంలో మనం వేసే అడుగులు కూడా మంచి వైపే అయ్యుండాలి. అందుకే చెడు వ్యక్తులకు దూరంగా ఉండాలి. అలాంటి వారి ఇంట్లో ఆహరం కూడా తీసుకోవద్దు.