మనం రోడ్ల మీద వెళ్తున్నప్పుడు తరచుగా చూసేవి మ్యాన్ హోల్స్. ఈ మ్యాన్ హోల్స్ దాదాపు ప్రతి చోట మనం చూస్తూనే ఉంటాం. అలాగే మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉండటం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే మ్యాన్ హోల్స్ ఎప్పుడు క్లోజ్ చేసి ఉండేలాగా చూసుకుంటూ ఉంటారు. అయితే మ్యాన్ హోల్స్ మూతని మనం సరిగ్గా గమనిస్తే మనందరికీ కొంతమందికైనా ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు.
అదేంటంటే దాదాపు అన్ని మ్యాన్ హోల్స్ మీద మూతలు సర్కిల్ షేప్ లోనే ఉంటాయి. ఎక్కడో ఒక చోట మాత్రమే కాదు ప్రతి చోట మ్యాన్ హోల్ మీద మూత సర్కిల్ షేప్ లోనే ఉంటుంది. సాధారణంగా మనందరం ఎక్కువగా యూజ్ చేసేది స్క్వేర్ షేప్. కానీ మ్యాన్ హోల్ మీద మూత మాత్రం సర్కిల్ షేప్ లో ఉండడానికి కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
# సర్కిల్ షేప్ లో ఉండడం వలన మూత మ్యాన్ హోల్ లోకి జారి పడిపోయే ప్రమాదం ఉండదు. ఒకవేళ స్క్వేర్ షేప్ లో ఉంటే డయాగ్నల్ గా పెడితే మూత మ్యాన్ హోల్ లో కి పడుతుంది.
# సర్కిల్ షేప్ లో ఉన్న మూతని ఈజీగా కదిలించవచ్చు. అలాగే కదలకపోతే రోల్ కూడా చేయొచ్చు.
# స్క్వేర్ షేప్ తో కంపేర్ చేస్తే సర్కిల్ షేప్ స్ట్రాంగ్ గా ఉంటుంది. అంటే ఒకవేళ స్క్వేర్ షేప్ మూత ఉన్న మ్యాన్ హోల్ మీద ప్రెషర్ పడితే, అంటే దాని మీద నుండి లారీ లాంటి వాహనం ఏమైనా వెళ్తే స్క్వేర్ షేప్ లో సెంటర్ నుండి సైడ్స్ కి, ముఖ్యంగా కార్నర్స్ కి సమానమైన డిస్టెన్స్, స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఉండదు. స్క్వేర్ షేప్ లో సెంటర్ ని బలహీనమైన పాయింట్ గా పరిగణిస్తారు.
స్క్వేర్ షేప్ లో ఎక్కువ సపోర్ట్ ఇచ్చేవి కార్నర్స్. అందుకే భూకంపం వచ్చినప్పుడు కూడా ఒక రూమ్ లో కార్నర్స్ లో ఉండాలి అని చెబుతారు. సర్కిల్ షేప్ లో అయితే సెంటర్ నుండి అన్ని సపోర్టింగ్ సైడ్స్ కి సమానమైన డిస్టెన్స్ ఉంటుంది. అందుకే సర్కిల్ షేప్ మూత పై ఏదైనా ప్రెషర్ పడితే స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది అన్ని వైపులకి సమానంగా జరుగుతుంది.
# సర్కిల్ షేప్ ఉన్న మూతలు ఏ విధంగా అయినా పెట్టొచ్చు. ఏ విధంగా పెట్టినా కూడా సైడ్స్ కి ఎలా అయినా సెట్ అవుతాయి.
# ఇవన్నీ మాత్రమే కాకుండా సర్కిల్ షేప్ లో ఒక గుంత తవ్వడం చాలా సులభం.
చాలా వరకు మ్యాన్ హోల్ మీద మూతలు సర్కిల్ లో ఉండటానికి కొన్ని కారణాలు ఇవే.