భార్యభర్తల బంధం కలకాలం సంతోషంగా సాగాలంటే ఒకరి పై మరొకరికి నమ్మకం ఉండాలి. భార్య భర్తల బంధానికి నమ్మకమే పునాది. కానీ జీవితభాగస్వామి అయిన భార్యకు కొన్ని విషయాలు చెప్పినట్లయితే ఆ బంధానికి బీటలు ఏర్పడవచ్చని అనుభవజ్ఞులు చెబుతున్నారు.
భార్యాభర్తల జీవనం సంతోషంగా సాగాలి అంటే ఎలా ఉండాలో? ఏం చేయాలి అనేవాటిని చెప్పే అనుభవజ్ఞులు, భర్త భార్యకు అస్సలు చెప్పకూడని ఐదు విషయాలు గురించి కూడా చెప్పారు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
- భర్త తన మాజీ ప్రేయసి గురించి భార్యకు అస్సలు చెప్పకూడదు. ఆ జ్ఞాపకాల గురించిన ప్రస్తావన కూడా భార్య ముందు తేకూడదు. ఎందుకంటే పెళ్ళి జరిగిన క్షణం నుంచి భార్య భర్తే లోకంగా బ్రతుకుతుంది. భర్త మనసులో తనకు మాత్రమే చోటు ఉండాలని భావిస్తుంది.
2. భర్త తనకు ఉన్న కొన్ని బాలహీనతల గురించి కూడా భార్య దగ్గర చెప్పకూడదని అనుభవజ్ఞులు చెబుతున్నారు. అలాంటివీ భార్యకు చెప్పినప్పుడు, గొడవ జరిగినపుడు భార్య ఆ బలహీనతను ఎత్తి చూపే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. బలహీనత గురించి భార్యతో మాత్రమే కాకుండా ఇతరులకు సైతం చెప్పకూడదట,మీ బాలహీనతను వారికి అనుకూలంగా మార్చుకోవడం ద్వారా కొత్త సమస్యలు రావచ్చు.
3.తల్లిదండ్రులు లేదా ఇతర కుటుంబ సభ్యుల గురించిన చెడు విషయాలను సైతం భార్యతో పంచుకోకూడదు. అలా చెప్పడం వల్ల భర్త కుటుంబ సభ్యుల పై గౌరవం తగ్గడమే కాకుండా చులకన ఏర్పడుతుంది.
4. గతంలో చేసిన తప్పులను కూడా భర్త తన భార్యతో చెప్పకూడదు. అలా చెప్పడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవ వచ్చినప్పుడు వాటిని ఎట్టి చూపే అవకాశం ఉంటుంది.
5. భర్త తనకున్న ఆరోగ్య సమస్యల గురించి భార్యకు అబద్ధాలు చెప్పకూడదు. అవి బయటపడినప్పుడు భార్య తట్టుకోలేదు. దాని కారణంగా ఇద్దరి మధ్య సమస్యలు ఏర్పడవచ్చు. చేసిన తప్పును నిజాయితీగా అంగీకరించకుంటే భార్యభర్తల మధ్య నమ్మకం తగ్గి వారి వైవాహిక బంధం బలహీనమవుతుంది.
Also Read: ఎన్ని సంవత్సరాలు ఇంటికి అద్దె కడితే…ఆ ఇల్లు మీ సొంతం అవుతుందో తెలుసా.?