Off Beat
ప్రపంచంలోనే అత్యంత విజయవంతులైన ఈ 10 మంది రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతారో తెలుసా.?
ప్రతి మనిషికి నిద్ర అనేది చాలా అవసరం. కొంతమంది నిద్రని నెగ్లెక్ట్ చేస్తారు. కానీ నిద్ర ఎక్కువ పోయినా, కొద్ది గంటలు మాత్రమే నిద్రపోయినా కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే చాలామంది సిస్టమేటిక్ గా రోజు కొన్ని గంటలు లిమిట్ పెట్టుకొని, రోజూ ఒకే సమయానికి పడుకుంటారు, మళ్లీ పొద్దున్నే ఒకటే సమయానికి లేస్తారు. ఇంకొంతమంది ఎప్పుడు పడుకున్నా, ఎప్పుడూ లేచినా కూడా వాళ్లు నిద్రపోయే సమయం, అంటే ఎన్ని గంటలు నిద్ర పోవాలి అనేది మాత్రం ఫిక్స్డ్ గా ఉంటుంది. అలా కొంతమంది ప్రముఖులు రోజుకి ఎన్ని గంటలు పడుకుంటారో ఇప్పుడు చూద్దాం.
#1 బిల్ గేట్స్
మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ అయిన బిల్ గేట్స్ 7 గంటలు (9:30pm — 4:30am) నిద్రపోతారు.
#2 ఎలాన్ మస్క్
టెస్లా ఇంకా స్పేస్ ఎక్స్ కి సీఈవో అయిన ఎలాన్ మస్క్, 6 గంటలు (1am — 7am) నిద్రపోతారు.
#3 జాక్ డోర్సే
ట్విట్టర్ కో ఫౌండర్ అయిన జాక్ డోర్సే 7 గంటలు (10:30pm — 5:30am) నిద్రపోతారు.
#4 నరేంద్ర మోదీ
భారత దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ మూడు నుండి మూడున్నర గంటలు నిద్రపోతారు.
#5 టిమ్ కుక్
ఆపిల్ సీఈవో అయిన టిమ్ కుక్ 7 గంటలు (9:30pm — 4:30am) నిద్రపోతారు.
#6 డోనాల్డ్ ట్రంప్
యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ అయిన డోనాల్డ్ ట్రంప్ 3 గంటలు (1–4am) నిద్ర పోతారు.
#7 సత్య నాదెళ్ల
మైక్రోసాఫ్ట్ సీఈవో అయిన సత్య నాదెళ్ల 8 గంటలు (11am – 7am) నిద్రపోతారు.
#8 జెఫ్ బెజోస్
అమెజాన్ ఫౌండర్ ఇంకా సీఈవో అయిన జెఫ్ బెజోస్ 7 గంటలు (10pm — 5am) నిద్ర పోతారు.
#9 ఇంద్ర నూయి
పెప్సీ కో చైర్మన్ ఇంకా సీఈవో అయిన ఇంద్ర నూయి 4 గంటలు నిద్ర పోతారు.
#10 బరాక్ ఒబామా
యునైటెడ్ స్టేట్స్ మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా 6 గంటలు (1am — 7am) నిద్రపోతారు.
#11 సుందర్ పిచాయ్
ఆల్ఫాబెట్ సీఈవో ఎం సుందర్ పిచాయ్ 5 గంటలు నిద్ర పోతారు. ఒక ఇంటర్వ్యూలో ఉదయం 6:30 కి లేదా 7 గంటలకి నిద్ర లేస్తాను అని సుందర్ పిచాయ్ చెప్పారు.
#12 షారుక్ ఖాన్
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ 4 గంటలు లేదా అంతకంటే తక్కువ సమయం నిద్రపోతారు.
#13 ఎల్లెన్ డిజెనెరెస్
ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ది ఎల్లెన్ షో హోస్ట్ అయిన ఎల్లెన్ డిజెనెరెస్ 8 గంటలు (11pm — 7am) నిద్రపోతారు.
#14 మార్క్ జుకర్ బర్గ్
ఫేస్ బుక్ ఫౌండర్ అయిన మార్క్ జుకర్ బర్గ్ రోజుకి 5 గంటలు నిద్రపోతారు.
#15 బిల్ క్లింటన్
యునైటెడ్ స్టేట్స్ కి 42వ ప్రెసిడెంట్ అయిన బిల్ క్లింటన్ రోజుకి 5 నుండి 6 గంటలు నిద్రపోతారు.
దేశంలో సైనికులు, రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఇవి.! తప్పక తెలుసుకోండి..!
టీ పెట్టుకుని తాగడానికి మీకెంత టైం పడుతుంది పది నిమిషాలు , మరీ ఎక్కువంటే పావుగంట . కానీ సియాచిన్‌లో ఎంత టైమ్ పడుతుందో ఊహించగలరా మూడు గంటలు . అంతసేపు కష్టపడి పెట్టుకున్న టీని మూడు సెకన్లలో తాగేయాలి , లేదంటే గడ్డకట్టిపోతుంది . కేవలం టీ తాగడానికే అంత కష్టపడే పరిస్థితి అంటే అక్కడ ఎంతటి విపత్కర పరిస్థితుల్లో బతుకుతుంటారో ఆలోచించండి . మన దేశంలో సైనికులు , రైతులు పడుతున్న కష్టం , వారికి మనమిచ్చే గౌరవం ఏంటో తెలుసా ?
“సియాచిన్” ఈ పదం ఈ మధ్య తరచూ వార్తల్లో వినే ఉంటారు . సియాచెన్ హిమానీ నదం ప్రపంచంలోకెల్లా ఎత్తైన యుద్ధ క్షేత్రం. భారత్ పాకిస్తాన్‌లు అడపాదడపా అనేక సార్లు ఘర్షణ పడిన ప్రాంతం . రెండు దేశాలూ శాశ్వత సైనిక స్థావరాలను స్థాపించాయి. ఇక్కడి వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా ? అక్కడ సైనికుల ఆరోగ్యం , ఆహారం పరిస్థితి ఏంటో తెలుసా? యుద్దంలో కాదు , అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలించక, సరైన వసతులు లేక 2000 మందికి పైగా చనిపోయారు .
దేశానికి రైతే వెన్నెముక అని చిన్నప్పటి నుండి చదువుకుంటున్నాము . మనకి ఆహారం కావాలంటే రైతులు పంటలు పండించాలి . కానీ సేద్యం ఎప్పుడూ సంక్షోబాల వలయమే . ప్రకృతి విపత్తులనుండి మద్దతు వరకు ప్రతిది రైతన్నకి పరీక్ష , ఆ పరీక్షలు నెగ్గలేక ఆత్మహత్యల పాలవుతున్నాడు. అటువంటి వార్తలు చూడగానే అయ్యో అంటాం. రెండు కన్నీటి చుక్కలు కారుస్తాం. రైతు గొప్పతనం గురించి మాట్లాడతాం. వాళ్లకి మనమిచ్చే గౌరవం అదేనా?
రైతే రాజు , జై జవాన్ – జై కిసాన్ .. రైతుల్ని , సైనికుల్ని మాటల్లో పొగడడం తప్ప నిజజీవితంలో వాళ్లకి ఇచ్చే గౌరవం ఎంత ? ఒకసారి ఆలోచించండి. నిజం చెప్పండి , మీ ఇంట్లో కొడుకులు రైతు అవుతానంటే ఒప్పుకుంటారా? బార్డర్ కి వెళ్లి యుద్దం చేస్తామంటే సరే అంటారా? ఒక రైతుకి మీ కూతురినిచ్చి పెళ్లి చేస్తారా ? వీటన్నింటికి క్షణం పాటు ఆలోచించే వాళ్లు కూడా అర సెకన్ ఆలోచించకుండా కొటేషన్స్ శేర్ చేసేస్తుంటారు . రైతుని , సైనికున్ని పొగుడుతూ గొప్పలు చెప్తుంటారు . కానీ వాస్తవాలు వేరు .
ఆదివారం కూడా వారాల్లో ఒకటి. కానీ ఆదివారం అంటే హాలిడే అని ఎంతోకాలం నుండి మనం ఫిక్స్ అయిపోయాం. అందుకే ఆదివారం వస్తే పని చేయడానికి చాలా మందికి కొంచెం బద్దకంగా అనిపిస్తుంది. వారం మొత్తం పని చేసిన తర్వాత వచ్చే ఆదివారం మాత్రం రెస్ట్ తీసుకునే డే గానే కన్సిడర్ చేస్తారు. అయితే భారతదేశంలో ఆదివారం సెలవు రోజుగా ఎవరు ప్రకటించారో, అసలు భారతదేశంలో ఆదివారం సెలవు ఎలా వచ్చిందో తెలుసా?
స్వతంత్రం రాకముందు, అంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్న సమయంలో భారతదేశంలో ఉన్న మిల్స్ లో పని చేసేవాళ్ళు వారంలో ఏడు రోజులు పని చేయాల్సి వచ్చేది. వాళ్లు సెలవు లేదా విశ్రాంతి తీసుకునేవారు కాదు. అప్పుడు నారాయణ్ మేఘాజీ లోఖండే మిల్స్ వర్కర్లకు లీడర్ గా ఉండేవారు.
ఆయన వారంలో ఒకరోజు సెలవు రోజు ఉండాలి అనే ఆలోచనను బ్రిటిషర్స్ దగ్గర ప్రతిపాదించారు.వారంలో ఆరు రోజులు కష్టపడి పని చేసిన తర్వాత వర్కర్స్ కి తమ దేశానికి, సమాజానికి సేవ చేయడానికి ఒక్కరోజు కావాలి అని నారాయణ్ మేఘాజీ లోఖండే అన్నారట.
కానీ బ్రిటిష్ అధికారులు ఈ ప్రతిపాదనని తిరస్కరించారట. నారాయణ్ మేఘాజీ లోఖండే ఈ విషయంపై పోరాటం చేశారు. ఏడు సంవత్సరాల ఉద్యమం తర్వాత 1890లో జూన్ 10 వ తేదీన బ్రిటీష్ గవర్నమెంట్ ఆదివారాన్ని హాలిడే గా డిక్లేర్ చేసిందట.
ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, భారతదేశంలో ఆదివారం సెలవు దినంగా బ్రిటీష్ గవర్నమెంట్ ప్రకటించింది. భారతదేశ గవర్నమెంట్ ఈ విషయంపై ఎటువంటి ఆర్డర్ జారీ చేయలేదు. కానీ ఏదేమైనా “ఫాదర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ మూమెంట్ ఇన్ ఇండియా” అయిన నారాయణ్ మేఘాజీ లోఖండే యొక్క ఏడేళ్ల పోరాటానికి ఫలితంగా ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించారు.
హైదరాబాద్ లో వరదలకు కారణం ఏంటి.? గతంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా.?
హైదరాబాద్ లో భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమైయ్యాయి. మోకాళ్ళ లోతు వరకు నీళ్లు ఉండడంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇండియా టైమ్స్ కథనం ప్రకారం ఐఎండి హైదరాబాద్ శాస్త్రవేత్త (మెటీయరాలజిస్ట్) బి. రాజా రావు మాట్లాడుతూ ఆగస్టు 2000 సంవత్సరంలో బేగంపేట్ లో 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని,
ఇప్పుడు గత 24 గంటల్లో హయత్ నగర్ పరిధిలో 29.8 సెంటిమీటర్ల వర్షం నమోదైందని, ఘట్కేసర్ లో 32.3 సెంటీమీటర్ల వర్షం నమోదైందని, సిటీలోని దాదాపు 35 ప్రదేశాల్లో 21 సెంటీమీటర్ల వర్షం రికార్డు అయిందని చెప్పారు.
గతంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా.?
2000 సంవత్సరం ఆగస్టులో ఇలానే వరదలు వచ్చాయి. 1908, సెప్టెంబర్ 2వ తేదీన 153.2 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది, 1954 ఆగస్టు 1వ తేదీన 190.5 మిల్లీ మీటర్లు, ఆగస్టు 1970 లో 140 మిల్లీ మీటర్లు, ఆగస్టు 24వ తేదీ 2000 సంవత్సరంలో 240 మిల్లీమీటర్లు, ఆగస్ట్ 2001లో 230.4 మిల్లీ మీటర్లు, ఆగస్ట్ 2002లో 179.4 ఆగస్ట్ 2006 లో 218.7 మిల్లీ మీటర్లు, ఆగస్ట్ 2008 లో 220.7 మిల్లీ మీటర్లు, సెప్టెంబర్ 2016 లో 215 మిల్లీ మీటర్లు, ఇప్పుడు అక్టోబర్ 13వ తేదీ 2020 లో 45.4 మిల్లీమీటర్ల వర్షం నమోదయింది.
హైదరాబాద్ లో వరదలకు కారణం ఏంటి.?
అసలు సిటీ లో ఇంత భారీగా వరదలు రావడం ఏంటి అనే ప్రశ్న అందరిలో నెలకొంది. హైదరాబాద్ లో వరదలు రావడానికి కారణం ఏంటంటే, హైదరాబాద్ ఒక పరివాహక వ్యవస్థ. వెస్ట్రన్ ఎడ్జ్ (కూకట్ పల్లి, రామచంద్రపురం నుండి గచ్చిబౌలి వరకు) గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉంది. ఈస్ట్రన్ ఎడ్జ్ కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉంది. హైదరాబాద్ డెక్కన్ రీజియన్ లో ఉంది.
ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కొంచెం వేరేగా ఉంటుంది. అంటే స్లోప్ అనేది వేరే వేరే డైరెక్షన్స్ లో ఉంటాయి. అందుకే నీళ్లు కూడా ఒకటే డైరెక్షన్ లో వెళ్ళవు. ఈ ట్యాంక్స్ వ్యవసాయం కోసం ఉపయోగించుకునే వాళ్ళు. వీటి చుట్టూ ఉండే ఏరియాలు స్థానికంగా రక్షణ పొందుతున్న పరివాహక ప్రాంతాలు (ప్రొటెక్టెడ్ లోకల్ క్యాచ్మెంట్ ఏరియాస్). గత నలభై సంవత్సరాలుగా సిటీ మొత్తం వ్యవసాయ ప్రాంతం పైకి వచ్చేసింది.
బఫర్ ఏరియాస్ ఏమీ లేకుండా, నీటిపై రోడ్లను నిర్మించారు. అందుకు నెక్లెస్ రోడ్ ఒక ఉదాహరణ. ఇంకా ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీల నుండి వచ్చే వ్యర్థ పదార్థాలు, చెత్త కూడా చెరువుల్లోకి వెళుతున్నాయి. అలా పేరుకుపోయిన చెత్త వల్ల చెరువుల సామర్థ్యం మారి ఈ విధంగా ప్రభావం చూపింది. అంతేకాకుండా ఇంతకముందు హైదరాబాద్ నగరం చుట్టూ చాలా చెరువులు ఉండేవి. కానీ అందులో చాలా వరకు వ్యాపార స్థలాలుగా మారిపోయాయి. చెరువుల సంఖ్య తగ్గిపోవడం వల్ల వర్షపు నీరు వరదలాగా పారుతోంది.
ఈ ఫొటోలో “పాము” ఎక్కడుందో కనిపెట్టగలరా? జూమ్ చేస్తే తెలుస్తుంది..!!
ఏం కరోనానో ఏంటో?? ఇంకెన్ని రోజులో ఏంటో?? నచ్చిన చోటుకి వెళ్లడానికి లేదు, నచ్చింది తినడానికి లేదు..ఫ్రెండ్స్ ని , రిలేటివ్స్ ని కలవడానికి లేదు.. పైగా ఇప్పుడు వర్షాలు ఒకటి. ఇంట్లో కట్టేసినట్టుగా ఫీలవుతున్నారా?? ఎటూ కదలలేక ఇబ్బంది పడుతున్నారా? టివి చూసి చూసి విసుగొచ్చేసిందా ?? ఫోన్ వాడి వాడి బుర్ర హీటెక్కి పోతుందా?? రోజుకు 24గంటలు చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయా?? పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం, నిద్ర పోవడం ఇలా ఎన్ని రకాలుగా “టైం పాస్” చేసినా “టైం పాస్” కావట్లేదా..
ఒక్కసారి ఈ పజిల్స్ వైపు లుక్కేయండి.. పజిల్స్ సాల్వ్ చేయండి.. కొంచెం టైమ్ ఇక్కడ స్పెండ్ చేయండి.. ఇవే క్వశ్చన్స్ ఫ్రెండ్స్ కి శేర్ చేసి వాళ్లు ఏం ఆన్సర్స్ చెప్తారో చూడండి..కొంచెం సేపు టైం స్పెండ్ చేసి రిలాక్స్ అవ్వండి..come on..have fun..
#0. ఫొటోలో మీకు “పాము” కనిపిస్తుందా..? ఎక్కడుందో కనిపెట్టగలరా..? ఫోటో జూమ్ చేస్తే ఇంకా క్లియర్ గా తెలుస్తుంది.
>>>click here for answer<<<
#1. ఈ కింది ఫోటోలోని పాత హీరోయిన్స్ నేమ్స్ చెప్పుకోండి చూద్దాం..మీకు తెలియకపోతే మీ అమ్మనో, నాన్ననో లేదంటే ఇంట్లో పెద్దవాళ్లెవరుంటే వాళ్లని అడగండి…కాసేపు వారితో మాట్లాడినట్టు ఉంటుంది.. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా దొరుకుతాయి.
#2. రెండు గంటలక్కర్లేదు..రెండు నిమిషాల్లో చెప్పేస్తాం అంటారా.. సరే కానివ్వండి ఇంకెందుకాలస్యం..
#3. ఆకుకూరలు, కూరగాయల పేర్లు చెప్పండి.. చాలా సింపుల్ అనుకుంటున్నారా.. సమాధానాలు చెప్పండి చూద్దాం..
#4. ఈ కింద పిక్‌లో కనిపిస్తున్న అమ్మాయి బొట్టుపెట్టుకుంది.. ఏ నంబర్ దగ్గర ఆ బొట్టు ఉందో గెస్ చేయండి చూద్దాం..ఒక్కటే నంబర్ చెప్పాలి సుమా…
#5. హ..హా..ఇంత చిన్న క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే మేధావులా..కాస్కోండి చూద్దాం.. ఫస్ట్ అటెంప్ట్‌లోనే కరెక్ట్ ఆన్సర్ చెప్తే నిజంగా మీరు మేధావులే..
#6. కూ…చుక్..చుక్… బండి బండి రైలుబండి..పేరేంటో కనుక్కోండి..
#7. జనవరి నంబర్ 71313 నుండి మొదలు పెట్టి ఆగస్ట్ 68313 వరకు ఇక్కడ నెలలకు నంబర్స్ ఉన్నాయి.. సెప్టెంబర్ నెల నంబర్ ఎంతో గెస్ చేయండి.
#8. ఈ పదిహేను సిటీలు ఏంటేంటో చెప్పుకోండి చూద్దాం..వాటిని కనిపెడితే వాటికి ఆ పేరెందుకొచ్చిందో తెలుసుకోవచ్చు..
#9. ఈ కింది ఫోటోను చూసి, వాటికి సరైన సమాధానాలను ఆన్సర్ చేయండి…
#10. ఈ అమ్మాయి ఫోటోలో ఒక తేడా ఉంది…ఏంటో కనిపెట్టండి?
>>>సమాధానాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి<<<
ప్రతి ప్రదేశం లో మెడిసిన్స్ తో పాటు కచ్చితంగా అందుబాటులో ఉండాల్సిన వస్తువుల్లో శానిటరీ ప్యాడ్స్ ఒకటి. శానిటరీ ప్యాడ్స్ 1888లో కనిపెట్టారు అని కొంతమంది అంటే, 19వ శతాబ్దంలో వరల్డ్ వార్ సమయంలో కనిపెట్టారు అని మరికొంతమంది అంటారు.
ఈ శానిటరీ ప్యాడ్స్ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ముందు కటింగ్ మెషిన్ ద్వారా కాటన్ ని సేకరిస్తారు. కొన్ని మెషిన్ లలో దాని ద్వారా సేకరించిన కాటన్ అందులోనే శుభ్రపరిచే ఫెసిలిటీ ఉంటుంది. అలాంటప్పుడు ఆ మెషిన్ ద్వారా కాటన్ ని సేకరించి అక్కడే శుభ్రపరిచి ఫ్యాక్టరీ కి తీసుకువెళ్తారు. లేదంటే సేకరించిన కాటన్ ని ఫ్యాక్టరీలో శుభ్రపరుస్తారు.
మిషన్ సహాయం తో కాటన్ ని హాఫ్ మీటర్ వైడ్ లో ఒక పల్చటి లేయర్ లాగా చేస్తారు. వాటిని రోల్ చేసి ఉంచుతారు. తర్వాత మిషన్ సహాయం తోనే ప్యాడ్ షేప్ లో కట్ చేస్తారు. ఒక సానిటరీ ప్యాడ్ కి ఎంత అవసరమో చూసుకొని ఒక ప్యాడ్ కి అవసరమైనంత కాటన్ ని రెక్టాంగిల్ బాక్స్ లో పెడతారు. అందులో పాలిమర్ పౌడర్ మిక్స్ చేస్తారు.
కొన్నిచోట్ల కాటన్ తో పాలిమర్ పౌడర్ మిక్స్ చేసి, డోసర్ అనే మెషిన్ సహాయంతో ఒక ప్యాడ్ కి అవసరమైనంత కాటన్ కట్ చేసి, ఎయిర్ కరెంట్ ద్వారా ప్యాడ్ షేప్ మౌల్డ్ లోకి వచ్చేలా చేస్తారు. తర్వాత మౌల్డ్ లోకి వచ్చిన ప్యాడ్ కన్వేయర్ బెల్ట్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకవేళ ఇది టూ లేయర్ ప్యాడ్ అయితే ఒకటే సమయంలో సైమల్టేనియస్ గా రెండు కాటన్ లేయర్ లని తయారుచేసి తర్వాత వాటిని కలుపుతారు.
పాలిమర్ పౌడర్ లో లిక్విడ్ కలిపితే పౌడర్, జెల్ రూపంలో ఎక్స్పాండ్ అవుతుంది. పౌడర్ గా ఉన్న పాలిమర్ జెల్ అయినప్పుడు ఆ లిక్విడ్ పీల్చుకొని పౌడర్ గా ఉన్నప్పటి వాల్యూమ్ కంటే 40 టైమ్స్ పెరుగుతుంది. ఒక్కొక్క పాలిమర్ ఒక్కొక్క రియాక్షన్ స్పీడ్ లో అబ్జార్బ్ చేసుకుంటుంది.
ఈ పాలిమర్ యావరేజ్ రియాక్షన్ స్పీడ్ లో అబ్జార్బ్ చేసుకుంటుంది. కన్వేయర్ బెల్ట్ ద్వారా ట్రాన్స్ఫర్ అయిన ప్యాడ్ షేప్ లో ఉన్న కాటన్ కి రెండు వైపులా షీట్ అతికిస్తారు. ఒక షీట్ అబ్సార్బ్షన్ (obsorption) కి వీలుగా ఉంటే, ఇంకొక షీట్ నాన్ లీకబుల్ ఉంటుంది.
ఇప్పుడు అలా తయారు చేసిన ప్యాడ్ కి కింద భాగంలో ఒక పేపర్ అంటిస్తారు. కానీ ప్యాడ్స్ అప్పటికి ఒకదానికి ఒకటి కనెక్ట్ అయి, మొత్తం ఒక చైన్ లాగా ఉంటాయి. వాటిని కటింగ్ డై (డై కటింగ్) తో కట్ చేస్తారు. తర్వాత ఒక్కొక్క ప్యాడ్ ని ఒక్కొక్క పౌచ్ లో పెట్టి వాటిని ప్యాక్ చేస్తారు. ఈ విధంగా ఒక్కొక్క ప్యాడ్ తయారవడానికి 40 సెకండ్ల సమయం పడుతుందట.
watch video :
ఈ 15 ఐటమ్స్ మన దగ్గర చాలా స్పెషల్…కానీ ఇతర దేశాల్లో బ్యాన్…ఎందుకో తెలుసా.?
భారత దేశంలో చాలా వస్తువులు చాలా కారణాల వల్ల నిషేధించబడ్డాయి. అలాగే భారత దేశంలో వాడే కొన్ని ప్రాడక్ట్స్ కూడా ఇతర దేశాల్లో నిషేధించబడ్డాయి. ఆ ప్రాడక్ట్స్ ఏవో, అవి నిషేధించడానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
#1 కిండర్ సర్ ప్రైజ్
నాన్ నూట్రిటివ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయని, అలాగే తినే పదార్థం లో బొమ్మ పెట్టడం వల్ల చోకింగ్ హజార్డ్ అయ్యే అవకాశాలు ఉంటాయని యు.ఎస్.లో దీనిని బ్యాన్ చేశారు.
#2 అన్ ప్యాస్చరైస్డ్ మిల్క్
ప్రమాదకరమైన మైక్రోబ్స్ ఇంకా జెర్మ్స్ ఉంటాయని యుఎస్, కెనడా లోని దాదాపు ఇరవై రెండు రాష్ట్రాల్లో అన్ ప్యాస్చరైస్డ్ మిల్క్ ని బ్యాన్ చేశారు.
#3 విక్స్ వేపరబ్
ఇందులో ఉండే పదార్థాల వల్ల ఆస్తమా, టీబి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని నార్త్ అమెరికాలో, అలాగే కొన్ని యూరోపియన్ దేశాల్లో దీనిని బ్యాన్ చేశారు. దీనిని టాక్సిక్ పదార్థంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసింది.
అలాగే విక్స్ యాక్షన్ 500 వాడితే కూడా చాలా ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కొన్ని ప్రదేశాల్లో బ్యాన్ చేశారు.
#4 జెల్లీ క్యాండీ
కొంజాక్ అనే థికెనింగ్ ఏజెంట్ తో ఇవి తయారవుతాయని అని, దానివల్ల పిల్లలకి చోకింగ్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని యుఎస్ఏ, ఆస్ట్రేలియా, కెనడా వంటి ప్రదేశాల్లో వీటిని బ్యాన్ చేశారు.
#6 చూయింగ్ గమ్
పబ్లిక్ ప్లేసెస్ శుభ్రంగా ఉంచడానికి, మాస్ రాపిడ్ ట్రాన్సిట్ (MRT) సర్వీసెస్ లో ఇబ్బంది అవ్వకుండా ఉండడానికి సింగపూర్ లో చూయింగ్ గమ్స్ బ్యాన్ చేశారు.
#7 లైఫ్ బాయ్ సోప్
చర్మానికి హాని కలుగుతుంది అని, మనుషులకి అలాగే జంతువులకి కూడా ఈ సబ్బు మంచిది కాదు అని కొన్ని ఫారిన్ కంట్రీస్ దీనిని బ్యాన్ చేశారు
#8 రెడ్ బుల్
రెడ్ బుల్ తాగితే గుండెకు సంబంధించిన సమస్యలు, డిప్రెషన్, హైపర్ టెన్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని, 18 సంవత్సరాలకంటే తక్కువ వయస్సు ఉన్న వాళ్ళు దీన్ని తాగకూడదు అని, డెన్మార్క్, ఫ్రాన్స్ ఇంకా లిథువేనియాలో రెడ్ బుల్ ని బ్యాన్ చేశారు.
#9 పెస్టిసైడ్స్
పెస్టిసైడ్స్ వాడిన (చల్లిన) పదార్థాలు తింటే ఆరోగ్యానికి మంచిది కాదని భారతదేశంలో వాడే 60కి పైగా పెస్టిసైడ్స్ వేరే దేశాల్లో నిషేధించబడ్డాయి.
#10 సమోసా
వెస్టర్న్ స్నాక్స్ లాగా ఉన్నాయి అని సోమాలియాలో ఒక టెర్రరిస్ట్ గ్రూపు సమోసాలని బ్యాన్ చేశారు.
#11 నానో
గ్లోబల్ ఎన్‌సిఎపి నిర్వహించిన ఇండిపెండెంట్ క్రాష్ టెస్ట్ లో నానో ఫెయిల్ అయ్యింది. దీంతో ఒకవేళ ఈ కారు ఉపయోగిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని ఇతర దేశాల్లో నానో నిషేధించారు.
#12 డి కోల్డ్ టోటల్
కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది అని, డి కోల్డ్ టోటల్ ని బ్యాన్ చేశారు.
#13 మారుతి సుజుకి ఆల్టో 800
సేఫ్టీ స్టాండర్డ్స్ ఇంకా గైడ్ లైన్స్ అనుకున్నట్టుగా లేవు అని మారుతి సుజుకి ఆల్టో 800 ని కొన్ని ప్రదేశాల్లో బ్యాన్ చేశారు.
#14 డిస్ప్రిన్
గ్యాస్ట్రిక్ అల్సరేషన్, డిజి నెస్ (dizziness), హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్, దద్దుర్లు (రాషెస్) వచ్చే అవకాశాలు ఉన్నాయి అని దీన్ని బ్యాన్ చేశారు.
#15 నిములిడ్
లివర్ సంబంధిత సమస్యలు వస్తాయి అని, అలాగే ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ ఇంకా కొన్ని దేశాల్లో దీని వాడకాన్ని బ్యాన్ చేశారు.
అప్పట్లో టిక్ టాక్ లో ట్రెండ్ అయిన ” వినవే బర్రె పిల్ల” గుర్తుందా.? దాని వెనకున్న అసలు కథ ఏంటో తెలుసా.?
వినవే బర్రె పిల్ల . నువ్వినవే బర్రె పిల్లా….నేనా యెర్రిగొల్ల….అంటూ గతంలో ఓ పాట టిక్ టాక్ లో హడావుడి చేసింది గుర్తుందా.? టిక్ టాక్ లో సరదాగా సాగే బిట్ వరకే ఉంది ..కానీ ఈ పాట మొత్తం వింటే అసలైన సాహిత్యం తెలుసుకునే అవకాశం కలుగుతుంది. వినవే బర్రె పిల్ల … నువ్వినవే బర్రె పిల్లా… ఈ పాట ఎన్టీఆర్ నటించిన వీరకంకణం (1957 ) అనే సినిమాలోనిది. దక్షిణామూర్తి ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్…ఆయన సృష్టించినదే ఈ బర్రె పిల్లా పాట.! అయితే ఈ పాటలో తను చెప్పాలి అనుకున్న మాటలను వినవె బర్రె పిల్ల అంటూ చెబుతారు. ఆ పాట లిరిక్స్ ఒకసారి మీరే చూడండి.
నిజానికి మంచోడే…నెల కూలి పోతాడే.
అన్నొడే నా ఎర్రి గొల్ల….ఇది విన్నావా బర్రె పిల్ల
గొప్పోళ్ళ ఆటలన్నీ …గుట్టు మట్టుబయట పెట్టి…
గొప్పోళ్ళ ఆటలన్నీ చెప్పుకుంటే సిగ్గు చేటు.!
వినవే బర్రె పిల్ల,నువ్వినవే బర్రె పిల్లా… నేనే నా ఎర్రి గొల్ల
పచ్చి మోసగాడే పెట్టె మంచం పానుపుకెక్కి పవళించుతాడట …
ఆది మాట వినని వాడే మాడి మరణించుతాడే…
వినవే బర్రె పిల్ల,నువ్వినవే బర్రె పిల్లా… నేనే నా ఎర్రి గొల్ల
నాయకుడి వేషం ఏసి..నమ్మించి మోసగించి కోట్లకు పడిగెత్తుతారు కదే.
ఊరు మంచి కోరి రోజల్లా… పాటు పడే బీదోళ్లు బూడిదవుతారే
ఎవరెవరో …బాగుకుంటారే.!
వినవే బర్రె పిల్ల,నువ్వినవే బర్రె పిల్లా… నేనే నా ఎర్రి గొల్ల.
watch video:
watch video:
నిజాం కాలంలో లాక్ డౌన్, క్వారెంటైన్ ఎలా ఉండేదో తెలుసా? అప్పుడు ఎందుకు పెట్టారంటే?
కరోనా కేసులు ఇప్పటికి ఆగట్లేదు. పూర్తిగా లాక్ డౌన్ కూడా ఎత్తేసారు. మనం జాగ్రత్తగా ఉండటమే మనల్ని కాపాడుతుంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మార్చ్ లో ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే గతంలో వందేళ్ల క్రితం భయంకరమైన ప్లూ, కలరా లాంటి వ్యాధులు ప్రభలినప్పుడు కూడా లాక్ డౌన్ పాటించారు..ఆ వివరాలు ఏంటో చూడండి.
ప్రతి వందేళ్లకి ఒకసారి భయంకరమైన వైరస్లు ప్రపంచాన్ని వణికించాయని చదువుకున్నాం కదా.. ఆ వైరస్ల థాటికి వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు..సరిగ్గా వందేళ్లక్రితం అనగా 1919లో కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్లూ ప్రభలింది. ఫ్లూతో కొన్నివందల మంది మంచం పట్టారు.
కరోనా మాదిరిగానే అది కూడా అంటు వ్యాధి కావడంతో ఎక్కువ మంది జనాలు గుంపులు గుంపులుగా ఉండకుండా చూడాలని పాలకులు నిర్ణయించారు. ఆ నిర్ణయంలో భాగంగా ప్రజల రక్షణ కోసం రెండో నిజాం ఆలీఖాన్ నగరం చుట్టు పన్నెండు దర్వాజాలతో ప్రహారి కట్టించారు.
ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే రాకపోకలు జరిగేలా దర్వాజాలు తెరిచి ఉంచేవారు.మిగతా సమయాల్లో ఎటువంటి రాకపోకలు జరగకుండా దర్వాజాలు మూసివేసేవారు. ఇలా నగరంలో అంటు వ్యాధులు ప్రబలకుండా నగర దర్వాజాలు మూసి వేసేవారు.అంతేకాదు నగర ప్రజలను వేరే ప్రాంతాలకు వెళ్లనిచ్చే వారు కాదు, వేరే ప్రాంతాల వారిని నగరంలోకి రానిచ్చేవారు కాదు . అప్పటి ఈ లాక్ డౌన్ ఫలితంగా రోగాలు తగ్గుముఖం పట్టేవి.
అంతేకాదు క్వారంటైన్ అనేది వందేళ్ల క్రితందే.. 1915లో నగరానికి దూరంగా ఈరన్న గుట్ట దగ్గర చిన్న హాస్పిటల్ ని కట్టించారు . అంటువ్యాధులు సోకిన వారిని ఇతరులకు అంటకుండా ఊరికి దూరంగా ఉన్న ఆ హాస్పిటల్ లో క్వారంటైన్లో ఉంచేవారు. వందేళ్ల క్రితం ఏర్పడిన ఆ హాస్పిటలే క్వారంటైన్ హాస్పిటల్.. ప్రస్తుతం మన వాడుకలో కోరంటి హాస్పిటల్ గా పేరుగాంచింది. అలా దేశంలో మొదటి క్వారంటైన్ హాస్పిటల్ వందేళ్ల క్రితమే ప్రారంభమయింది. ఈ లాక్ డౌన్ ఇవన్ని అప్పుడు కూడా ప్రజలు పాటించారు.