తెలంగాణ ఎన్నికల పూర్తయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇప్పుడు స్పీకర్ ఎన్నిక కార్యక్రమం జరగనుంది. మెజార్టీ సభ్యులు ఉన్న కాంగ్రెస్ పార్టీ స్పీకర్ గా సీనియర్ నాయకుడైన గెడ్డం ప్రసాద్ ను ప్రతిపాదించింది. ఈరోజు రేవంత్ రెడ్డి స్పీకర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని నామినేషన్ పత్రాలు పైన సంతకం చేశారు.
ఇదిలా ఉండగా స్పీకర్ గెడ్డం ప్రసాద్ ప్రతిపాదనను బిఆర్ఎస్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది. స్పీకర్ నామినేషన్ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొన్నారు. నామినేషన్ పత్రాల పైన రేవంత్ రెడ్డి తో పాటు కేటీఆర్ కూడా సంతకం చేసి తన మద్దతును ప్రకటించారు. స్పీకర్ గా గెడ్డం ప్రసాద్ మంచి పని తీరు కనబరుస్తారని ఆయనకు వ్యక్తిగతంగా మంచి పేరు ఉందని మద్దతు తెలిపినట్లుగా బిఆర్ఎస్ పార్టీ చెప్పింది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీతో టిఆర్ఎస్ ఏకీభవించడం శుభ పరిణామంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే రాబోయే రోజుల్లో అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్ష విపక్ష పార్టీల మధ్య ఎటువంటి వాదోపవాదాలు జరుగుతాయో చూడాలి అని అంటున్నారు.