ఎన్నికలలో కుటుంబాలు కూడా పాల్గొంటూ ఉంటాయి. ఒకే కుటుంబానికి చెందిన ఎంతో మంది ఎన్నికల్లో పాల్గొంటారు. కానీ ఒకే ఒక ప్రత్యర్థిపై ఒక కుటుంబానికి చెందిన వారు వరుసగా పోటీ చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే, మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డిపై మైనంపల్లి కుటుంబ సభ్యులు చాలా సంవత్సరాల నుండి పోటీ చేస్తూ ఉన్నారు.
మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004 లో అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ జిల్లా రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమెపై ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుండి మల్కాజ్ గిరి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మైనంపల్లి హనుమంతరావు సతీమణి మైనంపల్లి వాణి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ పిలుపుతో రామాయంపేట ఎమ్మెల్యేగా ఉన్న పద్మాదేవేందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి 2008 లో రామాయంపేట ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పుడు ఆమె మీద ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుండి మైనంపల్లి హనుమంతరావు బరిలో నిలిచి గెలిచారు.
2009 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి పొత్తులో భాగంగా మెదక్ టికెట్ ని మైనంపల్లి హనుమంతరావుకి కేటాయించారు. దాంతో పద్మాదేవేందర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి హనుమంతరావు చేతిలో ఓటమిపాలయ్యారు. 2014, 2018 లో పద్మాదేవేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వ్యక్తిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అయితే ఇప్పుడు మూడోసారి కూడా బీఆర్ఎస్ హై కమాండ్ పద్మాదేవేందర్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అయితే ఈసారి పద్మాదేవేందర్ రెడ్డి పై మైనంపల్లి వారి కుమారుడు రోహిత్ రావు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈసారి రోహిత్ రావు పద్మాదేవేందర్ రెడ్డి మీద గెలిచారు. దాంతో 19 ఏళ్లుగా జరుగుతున్న వైరంలో ఈసారి వారసుడు గెలిచారు అని అన్నారు.
ALSO READ : “రేవంత్ రెడ్డి” 15 రేర్ ఫొటోస్ ఓ లుక్ వేయండి…సినీ ప్రముఖులతో, జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు.!