ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక ఓట్లతో విజయం సాధించింది. పోటీ చేసిన చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 70 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించి ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇంత మంది గెలిచిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో సెలబ్రేషన్స్ చేశారు. సెలబ్రేషన్ వేడుకలో నారా కుటుంబం వారందరూ కూడా పాల్గొన్నారు. అలాగే మిగిలిన కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.

కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇందులో లేరు. అసలు ఎలాంటి రాజకీయ విషయాల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనట్లేదు. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా పోస్ట్ చేయడం కానీ, ప్రచార కార్యక్రమాలలో పాల్గొనడం కానీ జూనియర్ ఎన్టీఆర్ చేయలేదు. ఇప్పుడు ఎన్నికల్లో గెలిచాక కూడా సెలబ్రేషన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ కనిపించట్లేదు. అందుకు జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్స్ లో బిజీగా ఉండడమే కారణం అని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో పాటు, హృతిక్ రోషన్ తో కలిసి హిందీలో వార్ 2 సినిమా కూడా చేస్తున్నారు. ఇది జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మొదటి బాలీవుడ్ సినిమా. రెండు సినిమాలు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఒకేసారి షూట్ చేస్తున్నారు.
ఈ బిజీ కారణంగానే జూనియర్ ఎన్టీఆర్ సెలబ్రేషన్స్ లో పాల్గొనలేదు అని తెలుస్తోంది. దేవర సినిమా కూడా రెండు భాగాలుగా రూపొందుతోంది. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. జనతా గ్యారేజ్ సినిమా తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న రెండవ సినిమా ఇది. ఈ సినిమా చాలా పెద్ద ఎత్తున రూపొందిస్తున్నారు. అన్ని భాషల సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఈ సినిమాలో నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హిందీలో చేస్తున్న వార్ 2 సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర కోసం చాలా ట్రైనింగ్ తీసుకున్నారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు.













ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లలో రాహుల్ గాంధీ ఒకరు. ఆయన వయసు ప్రస్తుతం 53 సంవత్సరాలు. ఇంత వయసు వచ్చినా రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోకపోవడంతో ఆయన పెళ్లి చాలా సార్లు చర్చలు జరిగాయి. ఎందుకు చేసుకోలేదు అంటూ అడుగుతూనే ఉన్నారు. దేశంలోని పలువురు ప్రముఖులు, హీరోయిన్లు సైతం రాహుల్ గాంధీని వివాహం చేసుకుంటాం అని ముందుకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇంతగా చర్చకు దారితీసిన పెళ్లి గురించి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా సమాధానం చెప్పారు. 2022లో సెప్టెంబర్ 7న రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. 137 రోజుల సుదీర్ఘ పాదయాత్రను శ్రీనగర్‌లోని చారిత్రాత్మక లాల్ చౌక్‌లో ముగించారు. ఈ యాత్ర 12 రాష్ట్రాలు మరియు రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో దాదాపు ఐదు నెలల్లో 4,080 కిలోమీటర్లు సాగింది.
ఆ సమయంలో రాహుల్ గాంధీ పూర్తిగా ప్రజల్లో ఉంటూ సామాన్యులను కలిసి మంచి చెడ్డలు తెలుసుకున్నారు. ఆ క్రమంలో కాలేజ్ స్టూడెంట్స్‌తో కూడా ముచ్చటించారు. అయితే వారిలో ఒక స్టూడెంట్ పెళ్లి గురించి రాహుల్ గాంధీని అడిగారు. ఆ ప్రశ్నకు ‘తన పనులు మరియు పార్టీ పనుల్లో పూర్తిగా నిమగ్నం అయినందువల్ల వివాహం గురించి ఆలోచించలేదని రాహుల్ గాంధీ వెల్లడించారు.