ఈ సంవత్సరం మొదటిలో వాల్తేరు వీరయ్య సినిమాతో మన ముందుకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు భోళా శంకర్ సినిమాతో మళ్ళీ ప్రేక్షకులని అలరించడానికి రెడీ అయ్యారు. తమిళ్ లో అజిత్ కుమార్ హీరోగా రూపొందిన వేదాళం సినిమాకి రీమేక్ అయిన ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం : భోళా శంకర్
- నటీనటులు : చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్.
- నిర్మాత : రామబ్రహ్మం సుంకర
- దర్శకత్వం : మెహర్ రమేష్
- సంగీతం : మహతి స్వర సాగర్
- విడుదల తేదీ : ఆగస్ట్ 11, 2023
స్టోరీ :
కథ కోల్కతాలో మొదలు అవుతుంది. శంకర్ (చిరంజీవి) అనే వ్యక్తి, తన చెల్లెలు మహాలక్ష్మి (కీర్తి సురేష్) తో కలిసి ఆ సిటీకి వెళ్తాడు. అయితే అక్కడ కొంత మంది అమ్మాయిలని కిడ్నాప్ చేస్తూ ఉంటారు. అసలు ఆ అమ్మాయిల కిడ్నాపింగ్ ఎందుకు జరుగుతోంది? దీని వెనుక ఉన్నది ఎవరు? ఈ విషయం తెలుసుకున్న భోళా శంకర్ ఏం చేశాడు? ఆ అమ్మాయిలు అందరూ ఏమయ్యారు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా సరే రీమేక్ సినిమాలని ఆదరిస్తారు. కానీ అవి ఒరిజినల్ కి తగ్గట్టు, ఒరిజినల్ సినిమా ఫ్లేవర్ పాడు చేయకుండా ఉన్నట్టు అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది. లేదు అంటే ఎక్కువగా నెగటివ్ కామెంట్స్ వస్తాయి. గత కొంతకాలంగా చిరంజీవి మీద ప్రేక్షకులు చెప్పే కామెంట్ ఒకటే. రీమేక్ సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు అని. అందులోనూ ఇంకా ఎక్కువ ఆలోచింపచేసే విషయం ఏంటి అంటే ఆ సినిమాలు ఆల్రెడీ తెలుగులోకి డబ్ అయ్యాయి.
డబ్బింగ్ సినిమాలని రీమేక్ చేయడం ఏంటి అంటూ చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా ఆల్రెడీ చాలా కాలం క్రితమే తెలుగులో డబ్ అయ్యి రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో పాటలు, కొన్ని సీన్స్ తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ గొప్ప సినిమా ఏమీ కాదు. దాంతో అసలు ఈ సినిమా రీమేక్ చేస్తున్నారు అంటే, “ఇందులో అంత గొప్పగా ఏం ఉంది?” అనే కామెంట్స్ వినిపించాయి. ఇంక కథ విషయానికి వస్తే సినిమా ముందుకి వెళ్తున్న కొద్ది ప్రేక్షకులకి తర్వాత ఏమవుతుంది అని అర్థం అయ్యే కథ.
తెలుగులో కూడా పెద్దగా మార్పులు ఏమీ చేయలేదు. అదే కథ కానీ హీరో ఇమేజ్ కి తగ్గట్టు కొన్ని మార్పులు ఉన్నాయి. అవి సినిమాకి పెద్దగా సహాయ పడలేదు. అసలు సినిమా మొదలయ్యి కొన్ని సీన్స్ అయ్యాక, మనం ఈ సంవత్సరం వచ్చిన సినిమా చూస్తున్నామా? లేక ఏదో 80, 90 దశకంలో వచ్చిన సినిమా చూస్తున్నామా? అని అనిపిస్తుంది. అంత అవుట్ డేటెడ్ కథ ఇది. సినిమా మొదలు అయ్యి కొంత దూరం వెళ్ళాంగానే ఒక ప్రేక్షకుడు క్లైమాక్స్ వరకు చెప్పగలుగుతాడు.
ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చిరంజీవి తన భుజాల మీద ఈ సినిమాని వేసుకొని నడిపించారు. స్టైలింగ్ బాగుంది. కానీ కొన్ని సీన్స్ మాత్రం అవసరమా అనిపిస్తాయి. అసలు ఖుషి సినిమాలోని నడుము సీన్ ఈ సినిమాలో ఎందుకు పెట్టారు అనే విషయం కూడా అర్థం కాదు. చిరంజీవి ఇమేజ్ కి ఇంకా మంచి కథలు చేయొచ్చు. ఒకవేళ రీమేక్ చేయాలి అనుకున్నా కూడా ఏదైనా ఒక మంచి స్టోరీ ఓరియంటెడ్, లేకపోతే నటనకి స్కోప్ ఉన్న సినిమా చేస్తే బాగుంటుంది.
కానీ ఇలాంటి కమర్షియల్ సినిమాలు రీమేక్ చేస్తే ప్రేక్షకులకు ఇదంతా ఆల్రెడీ తెలిసిన కథ కాబట్టి పెద్ద కొత్తగా ఏమీ అనిపించదు. ఇంక కీర్తి సురేష్ అయితే చూడడానికి బాగున్నారు. నటన పరంగా అయితే పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. దాదాపు ఇలాంటి పాత్ర పెద్దన్న సినిమాలో కూడా కీర్తి సురేష్ చేశారు. తమన్నా అయితే కేవలం హీరో పక్కన ఒక జోడి ఉండాలి కాబట్టి ఉన్నారు. సినిమాలో ఇంకా చాలా మంది నటీనటులు ఉన్నారు.
కానీ వారందరి పర్ఫార్మెన్స్ కూడా పెద్ద గుర్తుపెట్టుకోదగ్గ రేంజ్ లో ఏం లేదు. పాటలు ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది ఏమో అనిపించింది. ఒకటి రెండు పాటలు తీసిన విధానం బాగానే ఉన్నా కూడా, చిరంజీవి సినిమా కాబట్టి పాటల విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. మిల్కీ బ్యూటీ, చివరిలో వచ్చే సెలబ్రేషన్ సాంగ్ తప్ప పాటలు పెద్దగా గుర్తుపెట్టుకునేలాగా లేవు. డడ్లీ అందించిన సినిమాటోగ్రఫీ బాగానే ఉంది.
శ్రీముఖికి, చిరంజీవికి మధ్య వచ్చే ట్రాక్ మాత్రం కాస్త ఇబ్బందికరంగానే అనిపిస్తుంది. ఎంత కవర్ చేసినా సరే హీరో పక్కన హీరోయిన్ పెయిర్ అస్సలు బాలేదు. వారిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం స్పష్టంగా తెలిసిపోతోంది. ఎమోషన్స్ అస్సలు కనెక్ట్ అవ్వవు. కొన్ని యాక్షన్ సీన్స్, కొన్ని కామెడీ సీన్స్ తప్ప మిగిలిన అన్ని విషయాల్లో ఇంకా జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే విషయంలో అయితే ఇంకా జాగ్రత్త తీసుకుని ఉంటే సినిమా ఇంకా బాగుండేది ఏమో అని అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- చిరంజీవి
- లొకేషన్స్
మైనస్ పాయింట్స్:
- రొటీన్ కథ
- బలహీనమైన స్క్రీన్ ప్లే
- ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టే కొన్ని సీన్స్
- కనెక్ట్ అవ్వని ఎమోషన్స్
రేటింగ్ :
2.5/5
ట్యాగ్ లైన్ :
అసలు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా, పాత కథ అయినా పర్వాలేదు, కాన్సెప్ట్ కొత్తగా లేకపోయినా ప్రాబ్లం లేదు, కేవలం చిరంజీవి కోసం సినిమా చూద్దాం అనుకునే వారికి భోళా శంకర్ సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : మహేష్ బాబు సర్కారు వారి పాట “బ్యాంక్ డైలాగ్” అంతకు ముందే ఈ హీరో చెప్పారా..? ఏ సినిమాలో అంటే..?