భారత లెజెండరీ క్రికెటర్లు అయిన సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్, లపై మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ అయిన గౌతమ్ గంభీర్ మండిపడ్డారు. దానికి కారణంవారిద్దరూ పాన్ మసాల ప్రకటనలో నటించారు. అలాంటి ప్రకటనలో దిగ్గజ క్రికెటర్లు నటించడాన్ని తప్పుబట్టాడు. వారి పై ఘాటుగా వ్యాఖ్యలు చేశాడు.
ఇటీవల గౌతమ్ గంభీర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై సంచలన కామెంట్స్ చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
రీసెంట్ గా భారత మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గావాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్ మరియు విండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ ఒక ‘పాన్ మసాలా’ ప్రకటనలో నటించారు. దాంతో గౌతమ్ గంభీర్ ఓ ఇంటర్వ్యూలో వారి పై ఘాటుగా స్పందించాడు. డబ్బు సంపాదించడం కోసం ఎన్నో మార్గాలు ఉన్నాయని, పాన్ మసాలా ప్రకటనలలో నటించడం వల్ల ఆ ప్రకటనలు చూసే కోట్లాది పిల్లలకు చెడు సందేశం వెళ్తుందని గంభీర్ అన్నారు.
గంభీర్ మాట్లాడుతూ ‘ఒక క్రికెటర్ పాన్ మసాలా ప్రకటనలో నటిస్తారని తన లైఫ్ లో అనుకోలేదని, ఈ పని అసహ్యంగా ఉందని అన్నారు. ఈ యాడ్ ద్వారా ఏం సందేశం ఇస్తున్నారని గంభీర్ అడిగాడు. అలాగే రోల్ మోడల్స్‌ను కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలని ఫ్యాన్స్ కి సూచించాడు. ‘‘ఏ వ్యక్తి అయినా వారు చేసే పని ద్వారానే గుర్తింపును తెచ్చుకుంటాడు. కోట్లాది మంది మిమ్మల్ని చూసి, మీరు చేసేవాటిని అనుకరిస్తూ ఉంటారు. అందువల్ల పాన్ మసాలా ప్రకటన చేయడం కరెక్ట్ కాదని అన్నారు.
ఈ క్రమంలో గతంలో ఒక విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. గంభీర్ సచిన్ తెందూల్కర్ గురించి చెప్పారు. ‘సచిన్‌కు ఒక సమయంలో పాన్ మసాలా ప్రకటన కోసం రూ. 20-30 కోట్ల ఆఫర్ వచ్చింది. అయితే సచిన్ ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశారు. ఆల్కహల్, పొగాకు ఉత్పత్తుల యాడ్స్ చేయనని తన తండ్రికి సచిన్ మాట ఇచ్చాడు. అందువల్లే సచిన్ ఒక రోల్ మోడల్’ అని గౌతమ్ గంభీర్ అన్నారు.
Also Read: “అతని వల్లే నా కెరీర్‌ను నాశనం అయ్యింది.. !” అంటూ… “అంబటి రాయుడు” కామెంట్స్..! ఏం అన్నారంటే..?

అంబటి రాయుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హెచ్‌సీఏలో తన చిన్నప్పటి నుండే పాలిటిక్స్ మొదలు అయ్యాయని అన్నారు. శివలాల్ యాదవ్ తన కొడుకు అర్జున్ యాదవ్‌ను భారత జట్టుకు ఆడించాలని తనను ఇబ్బంది పెట్టారని రాయుడు అన్నారు. దానికి కారణం అర్జున్ యాదవ్ కన్నా తాను బాగా ఆడుతుండటం వల్ల అడ్డంకిగా ఉన్న తనను తొలగించెందుకు ప్రయత్నం చేశారు.
ఆ సమయంలో తనకు 17 ఏళ్లు అని, అందువల్ల అర్జున్ యాదవ్ భారత జట్టుకు త్వరగా సెలెక్ట్ అవ్వాలని కోరుకునేవాడినని తెలిపారు. అయితే భారత్‌కు ఆడటం అర్జున్ యాదవ్ వల్ల కాలేదని అన్నారు. ‘హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో నా చిన్నప్పుడే క్యాన్సర్ ప్రారంభం అయ్యిందని, ప్రస్తుతం అది 4 వ స్టేజ్‌కు చేరిందని అన్నారు. బీసీసీఐ కల్పించుకుంటే పరిస్థితి మారుతుందని అన్నారు.
2003-04లో భారత్ -ఏకి బాగా ఆడాను. అయితే 2004లో మారిన సెలక్షన్ కమిటీలో శివలాల్ యాదవ్ సన్నిహితులు వచ్చారని, ఇక అక్కడి నుంచి తన కెరీర్ కు బ్రేక్ పడిందని అన్నారు. తనను ఎందుకు సెలెక్ట్ చేయలేదని అడగటంతో 4 ఏళ్ల పాటు తనతో ఎవరిని మాట్లాడనీయలేదని అన్నారు. తనను మానసికంగా కూడా దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారని చెప్పాడు. బీసీసీఐ మేనేజ్మెంట్లో ఉన్న శివలాల్ యాదవ్ వల్లే తనను వరల్డ్ కప్ 2019 కి ఎంపిక చేయలేదని అన్నాడు. శివలాల్ యాదవ్ వల్లే తన కెరీర్ పోయిందని అంబటి రాయుడు చెప్పారు.
21 శతాబ్దంలో గత 22 సంవత్సరాలో బౌలింగ్ యావరేజ్ లో ఇంత తక్కువ ఉన్న బౌలర్ మరొకరు లేరు. పెసర్ స్కాట్ బోలండ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్లో భారత జట్టు పతనాన్ని శాసించాడు. బోలండ్ ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో శ్రీకర్ భరత్, శుభ్‌మన్ గిల్ లను క్లీన్ బౌల్డ్ చేశాడు. రెండవ ఇన్నింగ్స్‌లో కూడా బోలండ్ మరోసారి గిల్, రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లిలను అవుట్ చేశాడు. 34 సంవత్సరాల బోలండ్ ఇంత వరకు ఆడిన ఎనిమిది టెస్ట్ మ్యాచ్ లలోనూ ఆస్ట్రేలియా ట్రంప్ కార్డుగా నిలిచాడు. ఈ ఫాస్ట్ బౌలర్ ముఖ్యంగా ఆస్ట్రేలియా పిచ్‌ల మీద చెలరేగిపోతాడు.
ఇక డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ పై ఆస్ట్రేలియా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 444 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీంఇండియా 234 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఘోర పరాజయాన్ని చవిచూసింది. 164/3 వద్ద 5వ రోజు మ్యాచ్ ను మొదలుపెట్టిన టీంఇండియా ఎలాంటి ప్రతిఘటన చేయకుండానే చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసి, 469 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. భారత్ 296 రన్స్ కే ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్‌లో 270/8 వద్ద ఆస్ట్రేలియా డిక్లేర్ చేసింది. టీంఇండియా 234 రన్స్ కు ఆలౌట్ అయ్యింది.
గత సంవత్సరంలోనూ టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో బెన్ స్టోక్స్ 52 పరుగులు చేసి, ఇంగ్లండ్‌ను విజేతగా నిలిపాడు. 32 ఏళ్ల ఈ ప్లేయర్ విలువ గత సంవత్సరాల నుండి బారీగా పెరిగింది. 2017లో నైట్‌క్లబ్ కి వెళ్ళిన స్టోక్స్ గోడవ పడినందుకు అరెస్ట్ అయ్యాడు. జైలుకు కూడా వెళ్ళాడు. అయినప్పటికీ బెన్ స్టోక్స్ కి ఏమాత్రం డిమాండ్ తగ్గలేదు.
ఇదిలా ఉంటే బెన్ స్టోక్స్ ఐపీఎల్లో మంచి డిమాండ్ ఉంది. 2018 లో జరిగిన ఐపీఎల్ లో అత్యంత కాస్ట్లీ ప్లేయర్ గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ రూ.12.50 కోట్లకు బెన్ స్టోక్స్ ను కొనుగోలు చేసింది. తాజాగా ముగిసిన 2023 ఐపీఎల్ లో చెన్నై జట్టు రూ. 16.25 కోట్లకు బెన్ స్టోక్స్ కొనుగోలు చేసింది. అయితే స్టోక్స్ చెన్నై జట్టు తరుపున రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. లీగ్ స్టేజ్ తర్వాత ఇంటికి వెళ్ళాడు. ఫైనల్స్ లో చెన్నై విజేతగా నిలిచింది.
అంతే కాకుండా జూన్ 3న బెన్ స్టోక్స్ టెస్ట్ క్రికెట్ హిస్టరీలో బ్యాటింగ్, వికెట్ కీపింగ్, బౌలింగ్ చేయకుండా మ్యాచ్ గెలిచిన తొలి కెప్టెన్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఐర్లాండ్ పై బెన్ స్టోక్స్ ఈ ఘనతను రెండుసార్లు సాధించాడు. ఐర్లాండ్‌తో జరిగిన ఒకేఒక టెస్టులో పది వికెట్ల తేడాతో గెలుపును సాధించింది.







రెండి సంవత్సరాలకు ఒకసారి ఐసీసీ నిర్వహించే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ జూన్ 7న (బుధవారం) నుండి మొదలవనుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ లోని ‘ఓవల్’ గ్రౌండ్ సిద్ధమైంది. రోహిత్ శర్మ సారథ్యంలో టీం ఇండియా జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది. మరి ఈ ఓవల్‌లో ‘గద’ అందుకునే జట్టు ఏది అని అందరు చూస్తున్నారు. క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం టీ20 దే హవా నడుస్తోంది. జెంటిల్మన్ గేమ్‌కు అసలు రూపం అంటే టెస్ట్. ఈ టెస్ట్ మ్యాచ్ లకు పాపులారిటీ తీసుకురావడం కోసం ఐసీసీ చేసిన ఆలోచనే డబ్ల్యూటీసీ. ఇది 2019-21లో మొదలైంది.
ఇప్పుడు జరుగబోయేది డబ్ల్యూటీసీలో రెండో సీజన్. గెలిచిన జట్టుకు అందచేసే గదను ఇంగ్లండ్ లోని థామస్ లైట్ తయారు చేసింది. క్రికెట్లో ముఖ్యమైన బంతిని కేంద్ర బిందువుగా చేసి, గదను తయారు చేసింది. దీనికి బంగారు పూత ఉన్న బంతిని అమర్చింది. బంతి అమరిక టెస్ట్ క్రికెట్ అంతర్జాతీయ స్థాయిని తెలుపుతుంది. గద యొక్క హ్యాండిల్ క్రికెట్ స్టంప్ ను సూచిస్తుంది. హ్యాండిల్ కి రిబ్బన్ ఉన్నగెలుపుకు చిహ్నంగా భావిస్తారు.
ఈ గదను ముందుగా డిజైన్ చేసింది మాత్రం ట్రోఫీ డిజైనింగ్ కంపెనీ ట్రెవర్ బ్రౌన్. గద రూపకల్పనకు ప్రేరణ ఇచ్చింది ఏమిటనేది బ్రౌన్ తెలిపారు. ‘ఉత్కంఠభరిత మ్యాచ్‌లో గెలిచిన వెంటనే ఒక ప్లేయర్ స్టంప్‌ను తీసుకొని దానిని సంతోషంగా ఊపడం నన్ను ఆకర్షించింది. ఆ విధంగా గద ఐడియా వచ్చింది’ అని అన్నారు.









ఈసారి ఎలాగైనా ఐసీసీ ట్రోఫీ సాధించాలనే కసితో భారత జట్టు ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్ లో తలపడబోతుంది. ఆఖరిసారిగా న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్నాడు. ఈసారి రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. జూన్ 7 నుండి 11 వరకుఇంగ్లండ్లో జరిగే ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్ కు కూడా వర్షం వల్ల అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్ కు కూడా వర్షం అడ్డంకిగా మారే ఛాన్స్ ఉంది. అయితే, ఈ ఫైనల్ మ్యాచ్ కూడా రిజర్వ్ డే అందుబాటులో ఉంది. కెన్నింగ్టన్ ఓవల్ గ్రౌండ్ లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ లో వర్షం పడే ఛాన్స్ ఉండడంతో ట్రోఫీ విన్నర్ ను ఎలా నిర్ణయిస్తారు అనే ప్రశ్న అందరిలోనూ వస్తోంది. జూన్ 7 – 11 వరకు జరిగే మ్యాచ్ లో నిర్ణయం రానట్లయితే జూన్ 12 రిజర్వ్ డే అందుబాటులో ఉంది.
ఇక వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దు అయినట్లయితే, ఐసిసి రూల్స్ ప్రకారం ఫైనల్ లో తలపడే రెండు జట్లను అంటే ఇండియా మరియు ఆస్ట్రేలియా రెండు జట్లను ఐసిసి చాంపియన్‌షిప్ విజేతలుగా ప్రకటిస్తుంది. అందువల్ల భారత జట్టు అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు.