ఇండియన్ క్రికెట్ టీమ్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో రెండవ సారి ఫైనల్ లో చోటు సంపాదించుకుంది. జూన్ 7 నుంచి 11 వరకు డబ్ల్యూటీసీ రెండవ ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఇంగ్లండ్‌లోని ఓవల్‌లో జరగనుంది. అయితే డబ్ల్యూటీసీ తొలి ఎడిషన్‌లో కూడా టీం ఇండియా ఫైనల్‌కు చేరుకుంది. కానీ న్యూజిలాండ్‌ పై గెలుపును సాధించలేకపోయింది.

Video Advertisement

దాంతో ఈసారి ఆ లోటును భర్తి చేయాలని, అలాగే 2013 నుంచి ఐసీసీ ట్రోఫీని సాధించాలనే కోరికను తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తోంది. అయితే ఫైనల్‌ మ్యాచ్ లో వర్షం పడే ఛాన్స్ ఉండడంతో డబ్ల్యూటీసీ విజేతను ఎలా నిర్ణయిస్తారనే విషయం గురించి ప్రస్తుతం క్రికెట్ ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. మరి వర్షం పడినపుడు  ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం..
ఈసారి ఎలాగైనా ఐసీసీ ట్రోఫీ సాధించాలనే కసితో భారత జట్టు ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్ లో తలపడబోతుంది. ఆఖరిసారిగా న్యూజిలాండ్‌ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్నాడు. ఈసారి రోహిత్ శర్మ కెప్టెన్ గా  వ్యవహరిస్తున్నారు. జూన్ 7 నుండి 11 వరకుఇంగ్లండ్‌లో జరిగే ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్ కు కూడా వర్షం వల్ల అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు డబ్ల్యూటీసీ  ఫైనల్ కు కూడా వర్షం అడ్డంకిగా మారే ఛాన్స్ ఉంది. అయితే, ఈ ఫైనల్ మ్యాచ్ కూడా రిజర్వ్ డే అందుబాటులో ఉంది. కెన్నింగ్‌టన్‌ ఓవల్‌ గ్రౌండ్ లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌ లో వర్షం పడే ఛాన్స్ ఉండడంతో ట్రోఫీ విన్నర్ ను ఎలా నిర్ణయిస్తారు అనే ప్రశ్న అందరిలోనూ వస్తోంది. జూన్ 7 – 11 వరకు జరిగే మ్యాచ్ లో నిర్ణయం రానట్లయితే జూన్ 12 రిజర్వ్ డే అందుబాటులో ఉంది.
ఇక వర్షం కారణంగా ఫైనల్‌ మ్యాచ్ రద్దు అయినట్లయితే, ఐసిసి రూల్స్ ప్రకారం ఫైనల్‌ లో తలపడే రెండు జట్లను అంటే ఇండియా మరియు ఆస్ట్రేలియా రెండు జట్లను ఐసిసి చాంపియన్‌షిప్ విజేతలుగా ప్రకటిస్తుంది. అందువల్ల భారత జట్టు అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు.

Also Read: టీం ఇండియాలో “స్టార్ ప్లేయర్” అన్నారు… కానీ IPL లో మాత్రం “ఫ్లాప్ ప్లేయర్” అయ్యాడు..! మరి ఇప్పుడు ఇతని పరిస్థితి ఏంటి..?