టీం ఇండియాలో “స్టార్ ప్లేయర్” అన్నారు… కానీ IPL లో మాత్రం “ఫ్లాప్ ప్లేయర్” అయ్యాడు..! మరి ఇప్పుడు ఇతని పరిస్థితి ఏంటి..?

టీం ఇండియాలో “స్టార్ ప్లేయర్” అన్నారు… కానీ IPL లో మాత్రం “ఫ్లాప్ ప్లేయర్” అయ్యాడు..! మరి ఇప్పుడు ఇతని పరిస్థితి ఏంటి..?

by kavitha

Ads

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ ప్రతిభ ఉన్న క్రికెటర్లకు భారత జట్టులో స్థానం సంపాదించడానికి మార్గం. ఐపీఎల్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్. ఐపీఎల్ లో తమ సత్తాను చాటిన క్రికెటర్లు ఎంతోమంది టీం ఇండియాలో స్థానం పొందారు.

Video Advertisement

అలా గత రెండు ఐపీఎల్ సీజన్లలో తన ప్రతిభను చాటిన ఒక క్రికెటర్, భారతజట్టులో స్థానం సంపాదించుకున్నాడు  అందరి చేత టీమిండియా సూపర్ స్టార్ అనిపించుకున్నాడు. కానీ టీమిండియా తరుపునే కాకుండా ఐపీఎల్ 16వ సీజన్ లో రాణించలేదు. భారత్ కు ఆడేది కూడా అనుమానమే అంటున్నారు. ఆ క్రికెటర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
క్రికెట్ లో ప్రస్తుతం ఉన్న రూల్స్ బ్యాటర్స్ కు అనుకూలించే విధంగా ఉన్నాయి. అయితే టి20 ఫార్మాట్ లో బౌలింగ్ చేయాలంటే అంత తేలిక కాదు. బౌలింగ్ చేయాలంటే దడ పుడుతుంది. కొందరు బౌలర్లు మాత్రం వైవిధ్యమైన బాల్స్ తో బ్యాటర్స్ ను కట్టడి చేస్తుంటారు. బౌలింగ్ లో వైవిధ్యాన్ని చూపిస్తేనే బౌలర్లు క్రికెట్ లో నిలదొక్కుకోగలరు. అది వైవిధ్యాన్ని ప్రదర్శించలేక 2021 ఐపీఎల్ లో సంచలనం సృష్టించిన ఉమ్రాన్ మాలిక్ 16 వ సీజన్ లో రాణించ లేకపోయాడు.
కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌ పేరుగాంచిన 24 ఏళ్ల ఉమ్రాన్ మాలిక్ 2021 ఐపీఎల్ లో మొదటిసారి ఎంట్రీ ఇచ్చాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరుపున నెట్ బౌలర్ గా ఆడాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడంతో ఉమ్రాన్ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. 2021లో ఆడింది తక్కువ మ్యాచ్ లే అయినా అందరి దృష్టిని ఆకర్షించాడు. 2022లో ఐపీఎల్ లో మరోసారి టాక్ ఆఫ్ ద లీగ్ అయ్యాడు. ఉమ్రాన్ క్రమం తప్పకుండా అదే వేగంతో బౌలింగ్ చేస్తుండడంతో అతడిని టీమిండియాకు సెలెక్ట్ చేశారు. ఆ సమయంలో ఉమ్రాన్ మాలిక్ పై ప్రశంసలు కురిసాయి. కానీ ఉమ్రాన్ టీమిండియా తరఫున రాణించలేదు. ఇక తాజాగా జరిగిన ఐపీఎల్ సీజన్ లో నిరాశపరిచాడు. 16వ సీజన్ లో ఎనిమిది మ్యాచ్ లు ఆడిన ఉమ్రాన్ తీసింది 5 వికెట్లు మాత్రమే. 10.85 ఎకానమీతో రన్స్ ఇచ్చాడు. దాంతో హైదరాబాద్ జట్టు ఉమ్రాన్ ని పక్కన పెట్టింది. ఉమ్రాన్ ప్రతి బాల్ ను 150 కిలో మీటర్ల వేగంతో వేస్తున్నాడు. కానీ వైవిధ్యాన్ని ప్రదర్శించడం లేదు. దాంతో ప్రత్యర్ధులు ఉమ్రాన్ పేస్ ను వాడి రన్స్ చేస్తున్నారు. వేగం ఉన్నా ఉమ్రాన్ బౌలింగ్ తో టీంకు నష్టం జరుగుతోంది. ఇలాగే ఉంటే ఉమ్రాన్ భారత జట్టుకు ఎంపిక అవ్వడం కష్టం అంటున్నారు.

Also Read: “అంబటి రాయుడుకి అన్యాయం చేశారు..!” అంటూ… అనిల్ కుంబ్లే కామెంట్స్..! ఏం జరిగిందంటే..?


End of Article

You may also like