దాదాపు రెండు నెలలపాటు క్రికెట్ మజాను పంచిన ఐపీఎల్ ముగిసింది. దీంతో ఇంగ్లాండ్ బయల్దేరి వెళ్లిన భారత క్రికెటర్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం సన్నద్ధం అవుతున్నారు. జూన్ ఏడో తేదీన ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మొదలు కానున్న సంగతి తెలిసిందే.
Video Advertisement
ఈసారి ఎలాగైనా సరే టైటిల్ గెలవాలనే పట్టుదలతో భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్లో బరిలోకి దిగుతోంది. పుజారా ముందే ఇంగ్లాండ్ వెళ్లి కౌంటీల్లో ఆడుతూ.. అక్కడి పరిస్థితులకు అలవాటు పడ్డాడు. మిగతా క్రికెటర్లు ఐపీఎల్ లీగ్ స్టేజ్ ముగిసిన దగ్గర్నుంచి దశల వారీగా ఇంగ్లాండ్ వెళ్లారు.రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలతోపాటు.. యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌కు కోహ్లి బ్యాటింగ్ టిప్స్ చెబుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ప్రాక్టీస్ సెషన్ లో ఉన్న కోహ్లీ ఫోటో కూడా ఒకటి బయటకి వచ్చింది. అయితే ఆ ఫోటోలో కోహ్లీ ఆర్సీబీ బాగ్ తో కనిపించాడు. దీనిపై నెటిజన్లు ఫన్నీ గా స్పందిస్తున్నారు. “అయ్యో ఎవరైనా గేమ్ కి వెళ్లేప్పుడు లక్కీ చార్మ్ ని తీసుకెళ్లారు. కానీ కోహ్లీ ఏంటి దీన్ని తీసుకెళ్లాడు”.. అంటూ ఒక యూసర్ కామెంట్ చెయ్యగా.. “ఆర్సీబీని కోహ్లీని ఎవరు వేరు చెయ్యలేరు..” అంటూ మరో యూసర్ కామెంట్ చేసాడు.
ఆర్సీబీ ఐపీఎల్ ప్లేఆఫ్స్ చేరకపోయినా.. కోహ్లి మాత్రం 14 మ్యాచ్ లలో 639 పరుగులు చేశాడు. రెండు వరుస సెంచరీలు చేయడం విశేషం. ఇక ఆరు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. 2013 తర్వాత తొలి ఐసీసీ ట్రోఫీ కోసం చూస్తున్న ఇండియాకు కోహ్లి ఫామ్ కలిసొచ్చేదే.
ఐపీఎల్ వల్ల బీసీసీఐ ఆటగాళ్లను బ్యాచులు బ్యాచులుగా లండన్‌కు పంపిస్తోంది. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడటం ఇది రెండోసారి. అరంగేట్రం ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి చవిచూసింది. మరోవైపు టీమ్‌ఇండియా ఇప్పటికే 15 మందితో కూడిన ప్రధాన జట్టును ప్రకటించింది. ముగ్గురు స్టాండ్ బై ఆటగాళ్లను తీసుకొంది. కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని కోచింగ్ స్టాఫ్ తోడుగా ఉంది. ఈసారి ఎలాగైనా ప్రపంచ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకోవాలని టీమ్ ఇండియా పట్టుదలగా ఉంది.
Also read: క్రికెట్ లో వాడే RED బాల్ కి, WHITE బాల్ కి, PINK బాల్ కి మధ్య ఉన్న “తేడా” ఏంటో తెలుసా..?