క్రికెట్‌లో ఉపయోగించే 3 రకాల బాల్స్ గురించి క్రికెట్ చూసేవారికి తెలిసే ఉంటుంది. టెస్ట్‌ క్రికెట్‌కు రెడ్‌ మరియు  పింక్‌ బాల్స్‌, వన్డే మరియు టీ20 లాంటి పరిమిత ఓవర్లు ఆడే క్రికెట్‌కు వైట్‌బాల్‌ ఉపయోగిస్తున్నారు.

Video Advertisement

వీటిని తయారు చేసేందుకు వాడే మెటీరియల్‌ దాదాపు ఒకటే అయినా రంగులు మాత్రం వేరు. అయితే క్రికెట్ లో  ఎందుకు 3 రకాల బాల్స్ వాడతారు? ఈ బాల్స్ మధ్య ఉండే తేడా ఏమిటో ఇప్పుడు చూద్దాం..
క్రికెట్ లో మొదటి నుండి కూడా రెడ్ బాల్ ను ఉపయోగిస్తున్నారు. 1971లో వన్డే క్రికెట్ ప్రారంభించిన తరువాత రెడ్ బంతితో వన్డే మ్యాచ్ ఆడటం కష్టం అయ్యింది. ఎందుకంటే సాధారణంగా టెస్ట్ మ్యాచ్ లో రోజుకి 90 ఓవర్లు బౌలింగ్ చేయవచ్చు. వెలుగు బాగా ఉన్నప్పుడు 98 ఓవర్లు వరకు బౌలింగ్ చేస్తారు. అయితే మొదట్లో వన్డే క్రికెట్ లో ఇన్నింగ్స్ కు అరవై ఓవర్లు ఉండేవి. అంటే మధ్యాహ్న సమయంలోనే 120 ఓవర్లు పూర్తి చెయ్యాలి. కానీ 120 ఓవర్లు ఒక్కరోజులో  పూర్తి చెయ్యడం చాలా కష్టం.
రెడ్ బాల్ పగటి సమయంలోనే బాగా కనిపిస్తుంది. కానీ ఫ్లడ్‌లైట్ల వెలుతురులో రెడ్‌ బాల్‌ ఎక్కువగా కనిపించదు. ఆ వెలుతురులో రెడ్ బాల్ గోధుమ రంగులో కనిపిస్తుంది. ఇక పిచ్ కూడా కొంచెం బ్రౌన్ కలర్ లోనే ఉంటుంది. దానివల్ల బ్యాటర్ బంతిని సరిగ్గా గమనించలేడు. ఇక మొదట్లోవన్డేలలో లైట్ ఫెయిల్ అయిన సందర్భాలలో మ్యాచ్ ను ఆపి, ఆ మరుసటి రోజు కంటిన్యూ చేసేవారు. దీంతో 1977 లో వైట్ బాల్ ను తీసుకొచ్చారు. అలాగే వన్డే మ్యాచులను డే అండ్ నైట్ ఆడటం ప్రారంభించారు. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో వైట్ బాల్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది.
2015లో టెస్ట్ క్రికెట్ ను కూడా డే అండ్ నైట్ ఆడటం మొదలుపెట్టారు. కానీ అయితే ఫ్లడ్ లైట్స్ వెలుతురులో  రెడ్ బంతితో ఆడటం చాలా కష్టం. అందువల్ల టెస్ట్ మ్యాచ్ కోసం పింక్ బాల్ ను తీసుకువచ్చారు. అయితే  డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ లను వైట్ బాల్ తో ఆడితే అయిపోయేది కదా అనుకోవచ్చు. కానీ టెస్ట్ మ్యాచ్ లను వైట్ జెర్సీలు ధరించి  ఆడతారు. అందువల్ల టెస్టుల్లో వైట్ బాల్ తో  ఆడితే అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి పింక్ బాల్ ను వాడుతున్నారు.

రెడ్ బాల్ – పింక్ బాల్ మధ్య  తేడా:

రెడ్ బాల్ కు పింక్ బాల్ కు అయితే ఎక్కువగా తేడా ఉండదు. అయితే టెస్ట్ మ్యాచుల్లో నైట్ టైం ఎండ ఉండదు కాబట్టి పిచ్ పైన జీవం అలాగే ఉంటుంది. దాంతో పింక్ బాల్ రాత్రి సమయంలో కొంచెం ఎక్కువగా స్వింగ్ అవుతుంది. పరిస్థితుల వల్ల ఈ బాల్స్  మధ్య కాస్త తేడా ఉంటుంది. ప్రోపర్టీస్ ఒకటే.
రెడ్ బాల్ – వైట్ బాల్ మధ్య తేడా:

1. రెడ్ బాల్ సీమ్ థ్రెడింగ్ కాస్త దగ్గరగా ఉంటుంది. బంతి పైన ఉండే కుట్లు కాస్త దగ్గరగా ఉంటాయి. అందువల్లే రెడ్ బాల్ ఎనబై ఓవర్స్ దాకా స్ట్రాంగ్ ఉంటుంది. వైట్ బంతి పైన ఉండే థ్రెడింగ్ కొంచెం వైడ్ గా ఉంటుంది. అందువల్ల వైట్ బాల్ 50 ఓవర్స్ అయిపోయేసరికి షేప్ అవుట్ కావడం మొదలవుతుంది.
2. వైట్ బాల్ ఫినిషింగ్ స్మూత్ గా, షైనీ గా ఉంటుంది. దీని వల్లే మ్యాచ్ మొదట్లో వైట్ బాల్ ఎక్కువ స్వింగ్ అవుతుంది. మ్యాచ్ అయ్యే కొద్ది తొందరగా పాతగా అవడం, మురికిగా మారడం వల్ల షైన్ పోయి స్వింగ్ తగ్గుతుంది. రెడ్ బాల్ ఫినిషింగ్ కాస్త హార్డ్ గా ఉంటుంది. దాని షైనింగ్, రఫ్ పార్ట్ ఎక్కువ సమయం వరకు ఉంటాయి. దాంతో మొదట్లో 30 ఓవర్స్ దాకా బాల్ ఎక్కువగా స్వింగ్ అవుతుంది.
3. రెడ్ బాల్ తో పోలిస్తే వైట్ బాల్ బరువు ఎక్కువగా ఉంటుంది. దాంతో బౌలర్ వైట్ బాల్ ను ఎక్కువగా కంట్రోల్ చెయ్యలేరు. ఎక్కువ స్కిల్ ఉన్న బౌలర్స్ వారు అనుకున్న లైన్ అండ్ లెంగ్త్ లో వైట్ బాల్ తో నిలకడగా వెయ్యగలరు. రెడ్ బాల్ బరువు కొంచెం తక్కువగా ఉండటం వల్ల ఏ బౌలర్ అయినా వేయగలరు.

Also Read: IPL నుండి ధోని రిటైర్ అవ్వకుండా… BBCI తీసుకొచ్చిన కొత్త నియమం ఏంటో తెలుసా..?