వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో టీమిండియా ఎదురీత ఇంకా తగ్గలేదు. ఆస్ట్రేలియా ఆల్ అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్ కి దిగిన భారత్ వరుస పెట్టి వికెట్లను కోల్పోవడం అందరిని నిరాశపరిచింది. రోహిత్ శర్మ, పూజారా, విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్ తీవ్రంగా నిరాశ పరిచారు.

Video Advertisement

ఈ కారణంగా భారత్ రెండవ రోజు ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్ లో 38 ఓవర్లలో 5 వికెట్లకి 151 పరుగులు చేసి, మూడవరోజు మొదట్లోనే మరొక వికెట్ కోల్పోయింది. మొదటి ఓవర్ ని బొలాండ్ వేయగా, మొదటి బంతికి రహనే ఒక సింగిల్ తీశారు.

comments on team india player wtc

ఆ తర్వాత రెండవ బంతికి బ్యాటర్ కె ఎస్ భారత్ క్లీన్ బౌల్డ్ అయ్యారు. బొలాండ్ వేసిన ఇన్ స్వింగర్ ని ఆడడంలో భరత్ లెక్క తప్పారు. దాంతో ఒక వికెట్ కోల్పోయారు. రిషబ్ పంత్ స్థానంలో టెస్ట్ మ్యాచ్ లో వికెట్ కీపింగ్ చేస్తున్నారు భరత్. ఇప్పటి వరకు ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా ఆడలేదు అని చెప్పాలి. ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ తో తనని తాను నిరూపించుకునే అవకాశం వచ్చినా కూడా భరత్ దాని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు.

comments on team india player wtc

ఫైనల్ లో వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్ రావాలి అని చాలా మంది అనుకున్నారు. కానీ అతన్ని కాదు అని టీం ఇండియా భరత్ కి అవకాశం ఇచ్చారు. దాంతో భరత్ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు అని అర్థం అవుతోంది. కానీ ఈ నమ్మకాన్ని భరత్ నిలబెట్టుకోలేదు అని అంటున్నారు. కేవలం 5 పరుగులు మాత్రమే చేసి వెను తిరగడం అనేది చర్చనీయాంశంగా మారింది.

comments on team india player wtc

దాంతో, “ఇతని కోసం ఇషాన్ కిషన్ ని పక్కన పెట్టారా?” అని కామెంట్స్ మొదలయ్యాయి. ఒకవేళ అతను వచ్చి ఉంటే ఇంతకంటే బాగా ఆడేవాడు కదా అని అంటున్నారు. రెండో ఇన్నింగ్స్ లో కూడా భరత్ నిరాశపరిస్తే టెస్ట్ మ్యాచ్ కెరీర్ డేంజర్ లో పడే అవకాశం గట్టిగా ఉంది. రిషబ్ పంత్ వచ్చే వరకు ఇషాన్ కిషన్ కి మాత్రం అవకాశం ఇస్తారు. కానీ భరత్ మీద మాత్రం కామెంట్స్ వస్తున్నాయి. మరి ఇప్పుడు భరత్ ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.

ALSO READ : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) లో విజేతకు ఇచ్చే “గద” వెనుక ఉన్న… కథ ఏంటో తెలుసా..?