దుబాయ్ వేదికగా ఇండియాకి, పాకిస్థాన్‌కి మధ్య జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో 10 వికెట్ల తేడాతో పాకిస్థాన్ జట్టు విజయం సాధించింది. మ్యాచ్‌లో అంతకుముందు టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దాంతో భారత్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన ఓపెనర్లు రోహిత్ శర్మ (0), కేఎల్ రాహుల్ (3: 8 బంతుల్లో) తక్కువ స్కోర్ కి షాహీన్ అఫ్రిదీకి వికెట్ సమర్పించుకున్నారు. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (11: 8 బంతుల్లో 1×4, 1×6) దూకుడుగా ఆడుతున్నట్టు కనిపించినా కూడా అతనిని హసన్ అలీ బోల్తా కొట్టించారు.
రిషబ్ పంత్ (39: 30 బంతుల్లో 2×4, 2×6)తో కలిసి నిలకడగా ఆడిన విరాట్ కోహ్లీ (57: 49 బంతుల్లో 5×4, 1×6), నాలుగవ వికెట్‌కి 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హసన్ అలీ బౌలింగ్‌లో బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు కొట్టిన రిషబ్ పంత్, తర్వాత ఓవర్లో భారీ షాట్ కోసం ప్రయత్నించి షదాబ్ ఖాన్‌కి వికెట్ సమర్పించుకున్నారు. పాకిస్థాన్ జట్టు బౌలర్లలో షాహీన్ అఫ్రిది మూడు వికెట్లు, హసన్ అలీ రెండు వికెట్లు, షదాబ్ ఖాన్ ఒక వికెట్, హారీస్ రౌప్ ఒక వికెట్ సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్‌పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15