చివరిలో ధోనీ క్రీజ్ లో ఉన్నప్పుడు… పంత్ చేసిన ఆ తప్పు వల్లే ఢిల్లీ ఓడిపోయిందా.?

చివరిలో ధోనీ క్రీజ్ లో ఉన్నప్పుడు… పంత్ చేసిన ఆ తప్పు వల్లే ఢిల్లీ ఓడిపోయిందా.?

by Mohana Priya

Ads

దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి మధ్య జరిగిన క్వాలిఫైయర్-1 మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. చెన్నైతో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 5.3 ఓవర్లు ముగిసే సమయానికి 50/2 స్కోర్ తో నిలిచింది. ఈ దశలో అక్షర్ పటేల్ (10: 11 బంతుల్లో 1×4)ని బ్యాటింగ్‌ కి పంపగా, అతను విఫలం అయ్యారు. తర్వాత ఇన్నింగ్స్ 19వ ఓవర్‌ లో హెట్‌మెయర్ అవుట్ అయిన తర్వాత, రిషబ్ పంత్ కి జోడిగా బ్యాటింగ్ చేసే ప్లేయర్ చివరిలో లేకపోయారు.

Video Advertisement

mistake made by rishabh pant in dc vs csk qualifier 1

సాధారణంగా ఏడో స్థానంలో బ్యాటింగ్ కి వచ్చే అక్షర్‌ పటేల్ స్లాగ్ ఓవర్లలో సులభంగా బ్యాటింగ్ ఝళిపించగలరు. కానీ అప్పటికే అక్షర్ పటేల్ అవుట్ అయి ఉండడంతో, ఆఖరిలో ఆ ప్రభావం ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్ పై పడింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 172 పరుగులు చేయగా లక్ష్యానికి మరో 2 బంతులు మిగిలి ఉండగానే చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇక్కడ, “ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కి ముందుచూపు లేదు” అని నెటిజన్లు, అలాగే మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తున్నారు.

mistake made by rishabh pant in dc vs csk qualifier 1

లక్ష్యఛేదనలో చెన్నై విజయం సాధించడానికి చివరి 6 బంతుల్లో 13 పరుగులు అవసరం అవ్వగా, టామ్ కరన్ తో రిషబ్ పంత్ బౌలింగ్ చేయించారు. అప్పటికే 3 ఓవర్లు వేసిన టామ్ కరన్ 16 పరుగులు చేయగలిగారు. అతని బౌలింగ్లో వేరియేషన్ ఉన్నాకూడా పేస్ లేకపోవడంతో చెన్నై బ్యాట్స్‌మెన్‌లు ఈజీగా షాట్లు ఆడేశారు. అయినప్పటికీ కూడా అతనితోనే ఆఖరి ఓవర్ ని రిషబ్ పంత్ వేయించడంతో, మొదటి బంతికి మోయిన్ అలీ వికెట్ తీసిన టామ్ కారన్ తర్వాత ధోనీకి వరుసగా మూడు బౌండరీలు సమర్పించి, మధ్యలో ఒక వైడ్ కూడా విసిరారు. దాంతో మరో 2 బంతులు మిగిలి ఉండగానే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది.

mistake made by rishabh pant in dc vs csk qualifier 1

ఆఫ్ స్టంప్ కి వెలుపలగా స్లో డెలివరీ రూపంలో టామ్ వేసిన బంతులని ధోనీ ఎంతో సులభంగా బౌండరీకి తరలించారు. దక్షిణాఫ్రికాకు చెందిన ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడా అప్పటికి 3 ఓవర్లు వేసి ఉన్నారు. ఆఖరి ఓవర్ కూడా అతనితో వేయిస్తారు ఏమో అని ఊహించారు. కానీ అనుభవం, పేస్ ఉన్న రబాడాని పక్కన పెట్టి పంత్ విమర్శలకు గురయ్యారు. బంతిని బలంగా బాధ గల ధోనీకి చివరి ఓవర్లో స్లో డెలివరీలు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. మిడిల్ ఓవర్లలో మంచి ఫలితాన్ని ఇచ్చిన స్లో డెలివరీలు, చివరిలో బెడిసి కొట్టాయి. ఈ సీజన్ ఐపీఎల్ లో టామ్ కరన్ కి ఇది మూడవ మ్యాచ్. మొత్తంగా ఐపీఎల్ లో ఇప్పటి వరకు అతను ఓవర్ కి 11 పరుగులు చొప్పున సమర్పించుకున్నారు.


End of Article

You may also like