సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా ఇటీవల విడుదల అయ్యింది. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూడవ సినిమా ఇది.
ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించారు. మీనాక్షి చౌదరి ఒక ముఖ్య పాత్రలో నటించారు. తల్లి, కొడుకుల మధ్య ఈ సినిమా నడుస్తుంది. రమ్యకృష్ణన్ మహేష్ బాబు తల్లి పాత్రలో నటించారు. అయితే, సినిమా స్టోరీ రొటీన్ గానే ఉంది. చాలా సార్లు చూసిన కథ.

కానీ మహేష్ బాబు పాత్రని రూపొందించిన విధానం మాత్రం కొత్తగా ఉంది. దాంతో సినిమా చూసిన వారందరూ కూడా మహేష్ బాబు నటనని మెచ్చుకుంటున్నారు. మహేష్ బాబు కొన్ని సంవత్సరాల క్రితం పొగ తాగడాన్ని వదిలేసారు అనే సంగతి తెలిసింది. అలాగే మద్యపానం కూడా సేవించరు. తన సినిమాల్లో అలాంటి సీన్స్ చూసి అభిమానులు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి అనే కారణంగా తన సినిమాల్లో స్మోకింగ్, మద్యపానం తాగడం వంటి సీన్స్ అవసరం అయితే అసలు ఉండకుండా చూసుకుంటాను అని చెప్పారు.

ఒకవేళ సినిమాకి అవసరం అయ్యి అలాంటి సీన్స్ ఉన్నా కూడా తాను మాత్రం వాటి జోలికి వెళ్ళను అని చెప్పారు. అయితే, ఈ సినిమాలో మహేష్ బాబు బీడీ కాలుస్తూనే ఉంటారు. సినిమా మొత్తంలో సగం సినిమాకి పైన మహేష్ బాబు బీడీతోనే కనిపిస్తారు. మహేష్ బాబు గత సినిమాల్లో ఏదో ఒక మెసేజ్ ఉండేది. కానీ ఈ సినిమాలో అలాంటి మెసేజ్ ఏమీ లేదు. దాంతో ఈ సినిమాలో మెసేజ్ లేకపోవడంతో పాటు, మహేష్ బాబు మళ్లీ స్మోకింగ్ కూడా చేస్తున్నారు అని అన్నారు. అయితే ఇవాళ సినిమా బృందం ఒక ఇంటర్వ్యూ విడుదల చేసింది. సుమ ఇంటర్వ్యూ చేశారు.

ఇందులో మహేష్ బాబుతో పాటు హీరోయిన్ శ్రీలీల కూడా పాల్గొన్నారు. అయితే స్మోకింగ్ కి సంబంధించి ఈ సినిమాకి అలాంటి సీన్స్ ఎలా డిజైన్ చేశారో మహేష్ బాబు చెప్పారు. ఈ సినిమాలో మహేష్ బాబు వాడింది నిజమైన బీడీ కాదు. సినిమా షూటింగ్ జరుగుతున్న రోజు బీడీ సీన్ చేయాల్సి వచ్చినప్పుడు నిజమైన బీడీని తాగడానికి ప్రయత్నించినప్పుడు మహేష్ బాబుకి మైగ్రేన్ వచ్చి తలనొప్పి వచ్చిందట.

దాంతో సినిమా బృందానికి ఈ విషయం చెప్పడంతో, వాళ్ళు ఈ విషయం మీద జాగ్రత్త తీసుకున్నారు. మహేష్ బాబు తాగే బీడీని లవంగం ఆకులతో తయారు చేశారు. ఈ బీడీలు టొబాకోతో తయారు చేయలేదు. అసలు టొబాకోని ఈ బీడీల కోసం వాడలేదు. అది ఒక ఆయుర్వేదిక్ బీడీ అని మహేష్ బాబు చెప్పారు. “చూడడానికి బీడిలాగా కనిపించినా కూడా అవన్నీ లవంగం ఆకులతో తయారు చేశారు. తాగుతున్నప్పుడు లవంగం వాసన మాత్రమే వచ్చేది” అని అన్నారు.

శ్రీలీల విషయం గురించి చెప్తూ, “బీడీ సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు ఒక టాస్క్ ఉండేది” అని, “ఆయుర్వేదిక్ బీడీలు కాబట్టి వాటిని మామూలుగా తీసుకువచ్చేవారు. ఆ తర్వాత వాటిని బీడీ డబ్బాలో పెట్టేవారు” అని చెప్పారు. అయితే సినిమా చూసిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు నిజమైన బీడీ అనుకున్నాం కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
watch video :
'Beedi' in #GunturKaaram is not made of tobacco. It's an Ayurvedic Beedi made out of clove leaves. I don't smoke and I dont' encourage smoking.
–#MaheshBabu pic.twitter.com/ZZDSe6aZoo
— Gulte (@GulteOfficial) January 16, 2024

గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలో హనీ రోజ్ నటించింది. ఆ మూవీ హిట్ అవడంతో ఆమెకు క్రేజ్ వచ్చింది. 2005 లో మళయాళంలో రిలీజ్ అయిన ‘బాయ్ ఫ్రెండ్’ మూవీతో ఎంట్రీ ఇచ్చారు. 2008 లో ఆలయం మూవీతో తెలుగులో అడుగుపెట్టారు. ఆ తరువాత వర్షం సాక్షిగా లో నటించినా గుర్తింపు రాలేదు. ఆ తరువాత తమిళ, కన్నడ చిత్రాలలో నటించారు.
2022 లో వచ్చిన ‘వీర సింహారెడ్డి’ తో ఆమెకు మంచి ఫేమ్ లభించింది. కానీ సినిమా ఆఫర్స్ మాత్రం ఎక్కువగా రాలేదు.సినీ అవకాశాలు ఎలా ఉన్నా, హనీ రోజ్ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్. ఇతర ఈవెంట్స్ లో పాల్గొంటూ బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా ఓ షాప్ ఓపెనింగ్ కి హాజరు అయిన హనీ రోజ్ న్యూ లుక్ లో వెరైటీగా కనిపించారు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
న్యూ హెయిర్ స్టైల్, ఆరంజ్ కలర్ డ్రెస్లో అచ్చం హాలీవుడ్ హీరోయిన్ హనీ రోజ్ కనిపించారు. ఆమె కాస్మోటిక్ సర్జరీ చేయించు కుందని కొన్ని రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. వాటిపై స్పందిస్తూ అవన్నీ రూమర్స్ అని క్లారిటీ ఇచ్చారు. హనీ రోజ్ ప్రస్తుతం మళయాళంలో ‘తేరీ మేరీ’ తెలుగులో ‘గాలి బ్రదర్స్’ సినిమాలలో నటిస్తున్నారు.
ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే. చిరంజీవి గారి పెళ్లి టైం కి ఆయన ఇంకా స్టార్ అవ్వలేదు. అల్లు రామలింగయ్య గారు అప్పటికే ఇండస్ట్రీ లో సీనియర్ నటుడు. అంత పెద్ద నటుడు తన కూతురుకి చిరుని ఇచ్చి ఎలా పెళ్లి చేసారు అని అప్పట్లో అందరు అనుకునే వారు. ఈ ప్రశ్నలకు సీనియర్ హీరోయిన్ జవాబిచ్చింది. చిరంజీవి సురేఖను వివాహం చేసుకోవడానికి సీనియర్ హీరోయిన్ రాజ శ్రీ నే కారణమట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలు బయటపెట్టారు.


















సినిమా చూసే ప్రేక్షకుడిని మొదటి నుండి చివరి వరకు ఎక్కడా బోర్ కొట్టించకుండా సినిమాకి ఎంగేజ్ అయ్యేలాగా చేస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమాలో నటించిన వాళ్లు అందరూ కూడా బాగా నటించారు. హీరో తేజ హనుమంతు అనే పాత్రలో బాగా నటించారు. మిగిలిన పాత్రలు పోషించిన వాళ్ళు అందరూ కూడా వారి పాత్రలకి తగ్గట్టు నటించారు. సత్య, జబర్దస్త్ శ్రీనుకి కూడా మంచి పాత్రలు దొరికాయి. పాటలు పర్వాలేదు. అంత గుర్తుండిపోయే అంత గొప్పగా ఏమీ అనిపించవు.
గుంటూరు కారం మూవీ జనవరి 12న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం నాడు గుంటూరులో జరిగింది. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరు అయ్యారు. ఇక ఈ ఈవెంట్లో మహేష్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన చిత్రాలకు రివ్యూ చెప్పే నాన్నగారు ఇప్పుడు లేరని, ఇక అభిమానులే తనకు అమ్మ నాన్న అని ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో హీరోయిన్ శ్రీలీల తన మాటలతోనే కాకుండా, ట్రెండీ శారీలో ఆకట్టుకుంది.
శ్రీలీల బాటిల్ కలర్ గడుల శారీలో స్టైలీష్ లుక్లో మెరిసింది. ఈ ఈవెంట్ కు చీరలో మెరిసిన శ్రీలీల స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆమె కట్టుకున్న శారీ కొంచెం డిఫరెంట్ గా, స్టైలీష్ గా కనిపించడంతో నెటిజెన్లు ఆ శారీ ఖరీదు మరియు వివరాల గురించి ఆన్లైన్ లో సెర్చింగ్ మొదలుపెట్టారు.
అయితే ఆ శారీ రేటు చూసినవారు షాక్ అవుతున్నారు. ఎందుకంటే శ్రీలీల కట్టుకున్న శారీ ఖరీదు అక్షరాల 1.59.000 రూపాయలు. బాటిల్ గ్రీన్ కట్ వర్క్ శారీ పేరుతో ‘సవన్ గాంధీ’ అనే వెబ్ సైట్ లో ఈ శారీ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.




