ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అపర్ణ కన్ స్ట్రక్షన్స్ శంకరపల్లి మోకిలా లో ఇటీవల 17 డిగ్రీస్ నార్త్ అనే ఎక్సక్లూసివ్ క్లబ్‌ను ఏర్పాటు చేసింది. ప్రతి ఏడాది డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను ప్రపంచమంతా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ క్లబ్ ఆధ్వర్యంలో ముందుగానే డిసెంబర్ 23 న క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. లైవ్ కన్సర్ట్ తో క్రిస్మస్ వేడుకలకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా నగరంలో హాలిడేస్ సెలబ్రేషన్స్ కు ఒక కొత్త వేదికను క్రియేట్ చేసింది 17 డిగ్రీస్ నార్త్ క్లబ్.

ఈ వేడుకల సందర్బంగా 17 డిగ్రీస్ నార్త్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్ రామకృష్ణ మాట్లాడుతూ.. ఈ క్లబ్ కేవలం మరో రొటీన్ క్లబ్ కాదని.. కొత్త జీవన విధానానికి నాంది అని తెలిపారు. ఇది అత్యంత ప్రముఖ వ్యక్తులతో జాగ్రత్తగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ అని వివరించారు. ఈ క్లబ్ లో సభ్యుల ఎంపిక ప్రక్రియ జాగ్రత్తగా పరిశీలించి తీసుకుంటారని చెప్పారు. మున్ముందు రోజుల్లో ఈ క్లబ్ ప్రయాణం మరింత అద్భుతంగా ఉంటుందని చెప్పారు.

17 డిగ్రీస్ నార్త్ క్లబ్ ఎదగడం చూసి తాము చాలా సంతోషిస్తున్నామని అన్నారు రామకృష్ణ. రాబోయే రోజుల్లో జరిగే ఈవెంట్స్ కు ఈ క్రిస్మస్ వేడుక అనేది కేవలం ఒక టీజర్ లాంటిదని.. నూతన సంవత్సరం సందర్భంగా ఇప్పటికే పలు కార్యక్రమాలకు ప్లాన్ చేసినట్టు వివరించారు.
ఆరోగ్య, సాంకేతిక, ఆర్థిక, హాస్పిటాలిటీ, ఐటీ, రియల్ ఎస్టేట్.. ఇలా ప్రతి రంగంలోని ప్రముఖులు క్లబ్ మెంబర్షిప్ తీసుకున్నారు. రానున్న రోజుల్లో సభ్యులకి బౌలింగ్ అలె, VR గేమింగ్ అందుబాటులో ఉండబోతుందని, ప్రత్యేక కమ్యూనిటీని సృష్టించడమే తమ లక్ష్యమని అన్నారు.

ప్రభాస్ ఫ్యాన్స్ నిరీక్షణ ఫలించిందని చెప్పవచ్చు. బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో ప్రభాస్ ను చూడాలని ఫ్యాన్స్ కోరుకున్నట్టుగా సలార్ మూవీలో ప్రభాస్ కనిపించాడు. ప్రభాస్ కటౌట్ కు తగ్గట్టుగా ప్రశాంత్ నీల్ సలార్ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దాడని టాక్. కథపరంగా ఎలా ఉన్నా సినిమాలో ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు అద్భుతంగా ఉండడంతో ఫ్యాన్స్, మాస్ ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. నెట్టింట్లో ఎక్కడ చూసినా సలార్ మేనియా కనిపిస్తోంది.
అయితే ‘సలార్’ టీజర్ లో ఓ తాత, హీరో ప్రభాస్‌ని ‘డైనోసర్’తో పోల్చడం తెలిసిందే. ఆ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రీసెంట్ గా ప్రమోషన్స్‌లో భాగంగా చేసిన ఇంటర్వ్యూలో దర్శకుడు రాజమౌళి కూడా ‘డైనోసర్ ఎపిసోడ్’ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నానని చెప్పడం తెలిసిందే. సినిమా రిలీజ్ అయిన తరువాత జక్కన్నతో పాటు , ఫ్యాన్స్, ఆడియెన్స్ నిరాశ పడినట్టున్నారు. తాజాగా రిలీజ్ అయిన ‘సలార్ పార్ట్-1’ లో ఆ ఎపిసోడ్ మిస్ అయ్యింది. బహుశా పార్ట్-1 లో ఉండొచ్చేమో.
ఈ సన్నివేశం మాత్రమే కాకుండా మరో రెండు సన్నివేశాలు కూడా సలార్ పార్ట్-1 మిస్ అయినట్టు తెలుస్తోంది. సూరిడీ పాటలో భయపడి లేచిన పృధ్వీ రాజ్ తో ‘ఒరే నేనున్నా కదా పడుకో’ అంటూ ప్రభాస్, కి చెప్పే సీన్ కాగా, మూడవది కార్ సీన్, దాంతో ఈ సీన్స్ ఎందుకు పెట్టలేదని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు సీక్వెల్ లో ఈ సీన్స్ ఉంటాయేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రభాస్, పృధ్విరాజ్ సుకుమార్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు, ఈశ్వరి రావు, బాబీ సింహా, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటించారు. యూఎస్ ప్రీమియర్ సేల్స్ తో ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా సలార్ రికార్డు బ్రేక్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే మొదటి రోజు, ఫస్ట్ వీకెండ్ రికార్డులన్ని బ్రేక్ అవడం ఖాయం అన్నట్టుగా కనిపిస్తోంది.
సౌత్ ఇండియా మొత్తం సలార్ మేనియా ఉంది. బాహుబలి తరువాత సారీ అయిన విజయం లేని ప్రభాస్ కి ఈ మూవీ భారీ విజయన్ని అందిస్తుందని టాక్ వినిపిస్తోంది. భారీ అంచనాల నడుమ సలార్ మూవీ థియేటర్లలోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్, ముఖ్యంగా హైదరాబాద్ లో థియేటర్లన్నింటి వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.


















ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో ప్రారంభం అయ్యింది. ఈ వేలంలో 214 మంది భారతీయ ఆటగాళ్లు, 119 విదేశీ ఆటగాళ్లతో కూడిన మొత్తం 333 మంది ఆటగాళ్లు 77 స్లాట్ల కోసం పోటీపడ్డారు. అయితే దుబాయ్ లో నిర్వహించిన ఈ వేలంకు మల్లికా సాగర్ నిర్వాహకురాలుగా వ్యవహరించారు. అయితే ఐపీఎల్ వేలం నిర్వాహకురాలుగా ఓ మహిళను నియమించడం ఇదే మొదటిసారి.
మల్లికా సాగర్‌కు వేలం నిర్వహించడంలో చాలా అనుభవం ఉంది. గతంలో ఆమె మహిళల ప్రీమియర్ లీగ్ నిర్వాహకురాలుగా వ్యవహరించింది. మహిళల ప్రీమియర్ లీగ్ 2003, 2024 సీజన్లతో పాటుగా, ఆమె కబడ్డీ ప్రీమియర్ లీగ్ ఆక్షన్స్ కూడా నిర్వహించారు. ఆమె వేలం నిర్వహించిన తీరు పై పెద్ద ఎత్తున్న ప్రశంసలు వచ్చాయి. దాంతో ఆమెను ఐపీఎల్ వేలంకు సెలక్ట్ చేశారు.
ఆమె ముంబైకి చెందిన వ్యక్తి. ఆమె ఆర్ట్ హిస్టరీ స్టడీస్ ను ఫిలడెల్ఫియాలో బ్రైన్ మావర్ కళాశాలలో పూర్తి చేసింది. 2001లో 26 సంవత్సరాల వయసులో వేలం సంస్థ క్రిస్టీస్‌లో మల్లిక కెరీర్‌ను మొదలుపెట్టింది. క్రిస్టీస్ లో మల్లికా సాగర్ తొలి ఇండియన్ ఆక్షనీర్ గుర్తింపు పొందింది. మల్లికా తన 22 ఏళ్ళ అనుభవంలో అనేక వేలంలు నిర్వహించింది. సమకాలీన భారతీయ ఆర్ట్ వేలంను నిర్వహించిన మొదటి వ్యక్తి మల్లికనే. క్రికెట్ వేలం గురించి ఆక్షనర్ హ్యూ ఎడ్మీడ్స్ వేలం వీడియోలు చూసి నేర్చుకున్నట్లుగా మల్లికా సాగర్ తెలిపారు.
పాకిస్థాన్ లోని అహ్మద్‌పూర్ సియాల్‌లోని సీతా రామాలయం గొప్ప చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. శతాబ్దానికి పైగా నిర్మించబడిన ఈ ఆలయం ఆ ప్రాంతంలో నివసించే హిందువులకి ప్రార్థనా స్థలంగా ఉంది. ఈ ఆలయం క్లిష్టమైన చెక్కడాలు మరియు పవిత్ర చిహ్నాలతో అలంకరించబడిన అద్భుతమైన వాస్తుశిల్పం, మతపరమైన సరిహద్దులను చెరిపివేసి గొప్ప సాంస్కృతిక వారసత్వం యొక్క కథను తెలియచేస్తుంది. సీతా రామ మందిరం అహ్మద్‌పూర్ సియాల్‌లో మత వైవిధ్యానికి చిహ్నంగా ఉంది.
అయితే ఆలాంటి చారిత్రక సీతారామ ఆలయాన్ని చికెన్ షాప్‌గా మర్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్ట్ చేయడంతో, ఆ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “పాకిస్తాన్ లోని హిందూ దేవాలయాలను విముక్తి చేయాలి. లేకపోతే వారు భారతదేశం యొక్క మరొక వైపు చూస్తారు” అంటూ ఒకరు కామెంట్ చేయగా, “పాకిస్తాన్లో మైనారిటీ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. సీతా రామ మందిరం బయట చికెన్ షాప్ తెరవడం. అటువంటి పాపాలు చేసి ఈ వ్యక్తులు ఎంతగా దిగజారిపోతారు?” అంటూ మరొకరు కామెంట్ చేశారు.
ఈ సంఘటన పై అంతర్జాతీయ సంఘాలు మరియు మానవ హక్కుల కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైనారిటీ సమూహాల మతపరమైన మరియు సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడవలసిన అవసరాన్ని ఎత్తి చూపుతున్నారు. ఈ సంఘటన దేశంలోని మానవ హక్కుల పరిస్థితిని ప్రతిబింబించెలా ఉండడంతో, ఇలాంటి సంఘటనల పై ఆ దేశ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అంతర్జాతీయ సమాజం నిశితంగా గమనిస్తోంది.
అమర్ దీప్‌ని కొట్టిన తరువాతే అన్నపూర్ణ స్టుడియోస్ నుండి వెళ్తామని పబ్లిక్‌గా యూట్యూబ్ ఛానల్స్ తో చెప్పిన బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ అభిమానులు, అన్నట్టుగానే ఫినాలే షో ముగిసిన తరువాత అర్ధరాత్రి బయటికి వచ్చిన అమర్ దీప్ మరియు అతని కుటుంబం పై దాడి చేశారు. వారి కారుని కూడా ధ్వంసం చేశారు. కారులో ఉన్న అమర్ దీప్, తల్లి, అతని భార్య, ఫ్రెండ్ నరేష్ లొల్ల,డ్రైవర్ ను భయభ్రాంతులకు గురి చేశారు.
బూతులు తిడితూ, కారును అద్దాలను పగులగొట్టారు. అమర్ దీప్‌ని బయటకు లాగాడానికి ప్రయత్నం చేశారు. దాంతో అమర్ దీప్ తల్లి, భార్య తీవ్ర భయాందోళన పడ్డారు. అరగంట పాటు జరిగిన దాడిలో వదిలేయమని అమర్ తల్లి, ఫ్రెండ్ దండం పెట్టినా వినలేదు. కారుని ధ్వసం చేశారు. ఈ దాడిలో కారులో ఉన్న అమర్ దీప్‌కి, తల్లి, భార్యకి గాయాలు అయినట్టు తెలుస్తోంది. అమర్ దీప్ కారునే కాకుండా, గీతూ రాయల్, అశ్విని కార్లను, ఆర్టీసీ బస్సు, ఇతర వాహనాలను కూడా పగుల గొట్టారు. గీతూ రాయల్ ఈ విషయం పై కేసు పెట్టింది.
గీతూ, అశ్విని సోషల్ మీడియాలో దాడి గురించి పోస్ట్ చేశారు. అమర్ దీప్ పై జరిగిన దాడికి సంబంధించిన ఫోటోలు వీడియో నెట్టింట్లో వైరల్ గా మారాయి. వీటిని చూసినవారు ఎలక్షన్స్ టైమ్ లో కూడా ఇంత గొడవ అవలేదు కదా అని కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ పై సోషల్ మీడియాలో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి..

4.
5.
6.
7.
8.
‘ఓ మై బేబీ’ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుండి గుంటూరు కారం యూనిట్ మీద మహేష్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం దానిపై పాట రచయిత రామజోగయ్య శాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్ట్ చేయడంతో ఆన్ లైన్ వార్ మొదలు అయ్యింది. ఈ నేపథ్యంలో రామజోగయ్య శాస్త్రి సోషల్ మీడియా అకౌంట్ కూడా డిలీట్ చేసారు. ఈ ట్రోలింగ్ పై నిర్మాత నాగవంశీ రెస్పాండ్ కావడం మరింత హాట్ టాపిక్ కి దారి తీసింది. ఆ తరువాత ఆ పోస్ట్ డిలీట్ చేసాడు. ఇలా ఇద్దరు వెనక్కి తగ్గడానికి కారణం సూపర్ స్టార్ మహేష్ బాబు క్షమాపణ చెప్పడమే అంటూ ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ అయ్యింది.
ఆ పోస్ట్ లో “నాగవంశీ తన ట్వీట్లను తొలగించాడు. అతను ఫ్యాన్స్ గురించి ఫాల్స్ స్టేట్మెంట్స్ చేశాడు. మహేష్‌బాబు చిత్ర యూనిట్ ఫ్యాన్స్ పై సోషల్ మీడియాలో ఉపయోగించిన భాషతో అప్ సెట్ అయ్యాడు. అది చాలా తప్పు అనేలా చెప్పారు. మహేష్ అన్నకి తన ఫ్యాన్స్ అంటే ఎంత పిచ్చి అనేది అర్దమైందా? వర్క్ తో మాట్లాడదాము, ఇంప్రెస్ చేద్దాము. వాళ్ళు చెప్పారు అంటే వూరికే చెప్పరు. ఏదైనా అని ఉంటే నా తరుపున క్షమించండి, రామజోగయ్య గారు, తిరిగి వర్క్ కు రండి. నెక్ట్స్ పాట అదిరిపోయేలా రాయండి అనేలా చెప్పారంట.
ప్రొడక్షన్ హౌస్ మరియు నిర్మాతలు తెలుసుకోవలసిన విషయం, ఎండ్ ఆఫ్ ద డే అభిమానులే అంతా, వాళ్లకోసమే సినిమాలు తీసేది అనే స్టేట్మెంట్ ఉంటుంది ఏ హీరో నుండి అయినా, అట్లాంటిది వారిని జడ్జ్ చేయవద్దు. మీ చెత్త ప్రవర్తన వల్ల మా హీరో మాకు సారీ ఫిల్ అవడం మాకు ఇష్టం ఉండదు. మా అన్నయ సినిమా అండి.సెలెబ్రేషన్స్ మేము చేసుకుంటాము అంటే అర్ధం, సెలెబ్రేషన్స్ చేసేలా సాంగ్స్ ఇవ్వాలి అని, బలవంతంగా రుద్దడం కాదు. ఓవర్ ఆల్ గా ఇక్కడితో పంచాయితీ అయిపొయింది. అదిరిపోయే కంటెంట్ మీరు మాకు ఇవండి. దాన్ని నెక్స్ట్ లెవల్ సెలెబ్రేషన్స్ మేము చూసుకుంటాము” అని చెప్పుకొచ్చారు.