రైల్వే పట్టాలను దాటకూడదు అని ఒకవేళ దాటినా కూడా అప్రమత్తంగా ఉండాలి అని ఎన్నోసార్లు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది అయినా సరే చాలామంది రైల్వే ట్రాక్ దాటుతూ ఉంటారు అయితే ఇటీవల ఒక పెద్దాయన రైల్వే ట్రాక్ దాటినప్పుడు జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ముంబై కళ్యాణ్ రైల్వే స్టేషన్ లో ఒక వృద్ధుడు రైల్వే ట్రాక్ దాటుతున్నారు అదే సమయంలో రైల్వే స్టేషన్ నుండి ముంబై వారణాసి రైలు బయలుదేరింది. ఈ విషయాన్ని ఆ పెద్దాయన గమనించలేదు. దాంతో ఆయన ట్రాక్ మీద నిలబడ్డారు. ఇది గమనించిన లోకో పైలెట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్ వేసి రైలుని ఆపారు.
కానీ అప్పటికే రైలు వృద్ధుడిని ఢీకొట్టింది. ఆ సమయంలో రైలు నెమ్మదిగా వెళ్లడం వల్ల వృద్ధుడికి ఏమీ అవ్వలేదు కానీ ఆయన రైలింజన్ కింద చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే లోకో పైలట్ రైల్వే సిబ్బంది వచ్చి ఇంజన్ కింద చిక్కుకున్న పెద్దాయన ని బయటికి లాగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని రైల్వే మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
watch video :
https://twitter.com/RailMinIndia/status/1416732437648867328