ఈ మధ్య కాలంలో జబర్దస్త్ గూటి పక్షులు అందరూ ఒకరి తర్వాత ఒకరు ఎగురుపోతున్నారు. మొదట సుడిగాలి సుధీర్ వెళ్లిపోగా…ఇటీవల జబర్దస్త్ షో యాంకర్ అనసూయ మానేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రేక్షకులు అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అసలు ఎందుకు మానేసింది. మానేసేటప్పుడు కనీసం బాధను కూడా వ్యక్త పరచలేదు ఏమయ్యింది అనుకుంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగానే అనసూయ తన రీసెంట్ గా చేసిన పోస్ట్ చూసి, జబర్దస్త్ గురించే పరోక్షంగా చెప్పింది అనుకుని అభిప్రాయ పడుతున్నారు.
అప్పటికీ అనసూయ జబర్దస్త్ వదిలెయ్యడంపై జరుగుతున్న చర్చలకు, ఫుల్ స్టాప్ పెట్టేందుకే అనసూయ ఆ పోస్ట్ పెట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో “ఒకప్పుడు ఏదైతే నీ స్థానం అని అనుకుంటావో… ఇప్పుడు ఆ స్థానం నీది కాదు” అన్నట్టుగా అనసూయ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చెయ్యడంతో…ఇది తను జబర్దస్త్ గురించే చేసిందని ఫిక్స్ అయిపోతున్నారు.

నిజానికి అనసూయ చేతిలో ఇప్పుడు ఒకవైపు సుమారు అర డజను సినిమాలు ఉంటే… మరోవైపు వెబ్ సీరీస్ లు కూడా సిద్ధంగా ఉన్నాయి. అందుచేతనే జబర్దస్త్ షో మానేయక తప్పట్లేదని తెలుస్తోంది. మరి అందులో మానేసినా స్టార్ మా ప్రోగ్రామ్స్ లో యంకరింగ్ ఇంకా కొనసాగిస్తుండటంతో… బహుశా మల్లెమాల కన్నా స్టార్ట్ మా ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తుంది అనుకుంట అనే టాక్ నడుస్తోంది. ఎన్నో మంచి క్యారెక్టర్స్ లో నటించిన అనసూయ భరద్వాజ్ ఇప్పుడు మొదటి సారి కన్యాశుల్కం అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకముందు మరిన్ని వినూత్న పాత్రలతో అభిమానులను మెప్పిస్తుందో చూడాలి.
https://www.instagram.com/p/ChB5JsRrjtX/?utm_source=ig_web_copy_link

























