నిద్రించేటప్పుడు ఈ శయన నియమాలు తప్పనిసరిగా పాటించాలి.. పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి..!

నిద్రించేటప్పుడు ఈ శయన నియమాలు తప్పనిసరిగా పాటించాలి.. పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి..!

by Megha Varna

Ads

ప్రతి దానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. అలానే మనం నిద్రపోవడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ నియమాలను అనుసరిస్తే ఎలాంటి చెడు, ఇబ్బంది ఉండదు. అయితే మరి ఆ శయన నియమాల గురించి ఇప్పుడు చూద్దాం. విష్ణు స్మృతి నిద్ర పోయి ఉన్న వాళ్ళని ఆకస్మాత్తుగా నిద్ర లేపకూడదు అని చెబుతోంది. చాణక్య నీతి అయితే ఎక్కువ సమయం విద్యార్థులు, నౌకరు లేదా ద్వారపాలకుడు నిద్రపోతుంటే నిద్ర లేపచ్చని చెబుతోంది.

Video Advertisement

దేవాలయంలో మరియు స్మశానం లో అస్సలు నిద్రపోకూడదు. నిర్మానుష్యంగా ఉన్న చోట కూడా నిద్ర పోకూడదు అని మనుస్మృతి చెబుతోంది.

Sleeping on Bed
అదే విధంగా ఆరోగ్యవంతులు, ఆయు రక్ష కోసం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి అని దేవీ భాగవతం అంటోంది.
చాలా మంది తడి కాళ్ళతో నిద్రపోతూ ఉంటారు. అలా నిద్రపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పొడి పాదాలతో నిద్రపోతే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది అని అత్రి స్మృతి చెబుతోంది.
అలానే నగ్నంగా పడుకోకూడదు అని గౌతమ ధర్మ సూత్రం చెబుతోంది.

పగటి పూట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకూ పడుకునేవాళ్ళు రోగులు కానీ దరిద్రులు కానీ అవుతారని బ్రహ్మవైవర్త పురాణం అంటోంది. నిద్రపోయి తాగడం, తినడం, చదువుకోవడం లాంటివి చేయకూడదు. ఇవి కూడా అస్సలు మంచివి కావు.

చాలా మందికి ఏ వైపు తల పెట్టి నిద్రపోవాలి అన్న సందేహం ఉంటుంది. అయితే ఆచార మయూఖ్ చెప్పిన దాని ప్రకారం దక్షిణం వైపు తల పెట్టి నిద్ర పోతే ధన ప్రాప్తి కలుగుతుంది. అదే తూర్పు వైపు తల పెట్టి నిద్ర పోతే విద్య వస్తుంది. పశ్చిమ వైపు తల పెట్టి నిద్ర పోతే చింత కలుగుతుంది. ఉత్తరం వైపు తల పెట్టి నిద్ర పోతే హానీ, మృత్యువు కలుగుతాయి.


End of Article

You may also like