పనిమనిషి కోసం టిఫిన్ అమ్ముతున్న ఓనర్లు…వైరల్ అవుతున్న ఫోటో వెనకున్న ఈ అసలు కథ తెలుసా.?

పనిమనిషి కోసం టిఫిన్ అమ్ముతున్న ఓనర్లు…వైరల్ అవుతున్న ఫోటో వెనకున్న ఈ అసలు కథ తెలుసా.?

by Mohana Priya

Ads

ఒక మనిషికి మరో మనిషే సహాయం చేస్తారు అనే ఒక మాట మనం వింటూనే ఉంటాం.  ముంబైకి చెందిన ఒక జంట ఇదే విషయాన్ని రుజువు చేశారు. ముంబైకి చెందిన ఒక గుజరాతి జంట ఒక ఫుడ్ స్టాల్ నడుపుతున్నారు. కానీ వాళ్లు ఫుడ్ స్టాల్ నడపడం వెనక ఒక కారణం ఉంది. అశ్విని షెనోయ్ షా, తన భర్త ఎంబీఏ చదివారు.

Video Advertisement

వారిద్దరూ మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.  వాళ్లకి వంట చేసే మహిళకి 55 సంవత్సరాలు. తన భర్త పెరాలసిస్ తో బాధ పడుతున్నారట. ఆమెకి సహాయం చేయడానికి ఈ దంపతులిద్దరూ ఆ మహిళ వండిన వంటలను ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసి అందులో అమ్మి తమవంతు ఆర్థిక సహాయం చేశారు.

అశ్విని దంపతులిద్దరూ ఉదయం నాలుగు గంటలకి ఫుడ్ స్టాల్ మొదలు పెడతారు. ఉదయం నాలుగు గంటల నుండి 10 గంటల వరకు ఫుడ్ స్టాల్ నిర్వహిస్తారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. ఈ విషయాన్ని దీపాలి భాటియా అనే ఒక వ్యక్తి ఫేస్ బుక్ లో షేర్ చేశారు. ఒకరోజు తెల్లవారుజామున మంచి ఫుడ్ కోసం వెళ్ళిన దీపాలి భాటియా కి కండివాలి స్టేషన్ దగ్గర అశ్విని దంపతులు ఫుడ్ స్టాల్ తో కనిపించారు.

ఆ ఫుడ్ స్టాల్ లో పోహా, ఉప్మా, పరాటా, ఇడ్లీ ఇలాంటి ఆహారాన్ని విక్రయిస్తున్నారట. దీపాలి భాటియా వారి దగ్గరికి వెళ్ళి విషయాన్ని తెలుసుకున్నారు. వారు చెప్పినది విన్న దీపాలి భాటియా ఈ విషయాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఇది చదివిన నెటిజన్లు కూడా ఆ దంపతులు ఇద్దరిని ప్రశంసించారు.

watch video:

image credits: facebook/ashwini.shenoy.125


End of Article

You may also like