Ads
అతి చిన్న వయసులోనే క్రికెట్‌లో రాణించి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న ప్లేయర్స్ లో ఒకరు మనీష్ పాండే. మనీష్ పాండే కుమావ్ జిల్లాలోని బాగేశ్వర్ లో జన్మించారు. మనీష్ పాండే కి 15 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు అతని కుటుంబం బెంగళూరుకి మారిపోయింది. మనీష్ పాండే తండ్రి సైన్యంలో పని చేసేవారు. మనీష్ పాండే పాఠశాల విద్యా కేంద్రీయ విద్యాలయలో జరిగింది. ఆ తర్వాత కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ లో చేరారు.
Video Advertisement
2008లో మనీష్ పాండే కి తన మొదటి గుర్తింపు లభించింది. భారతదేశ అండర్-19 ప్రపంచకప్ జట్టులో సభ్యుడిగా ఎంపికయ్యారు. మలేషియాలో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ టోర్నమెంట్లో భారత జట్టు విజయం సాధించింది. 2008లో మనీష్ పాండే ఐపీఎల్ కి ఎంపికయ్యారు. ముంబై ఇండియన్స్ జట్టు తరపున మనీష్ పాండే ఆడారు. 2009లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడుతున్నప్పుడు సెంచరీ సాధించారు. అదే మనీష్ పాండే మొదటి ఐపిఎల్ సెంచరీ.
అంతేకాకుండా ఈ టోర్నమెంట్ లో సెంచరీ సాధించిన మొదటి భారతీయుడు కూడా మనీష్ పాండే గుర్తింపు సాధించారు. 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తరపున ఆడినప్పుడు జట్టు గెలిచేందుకు తన వంతు సహాయం చేశారు. మనీష్ పాండే 2015 లో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్ లో మనీష్ పాండే ఇంటర్నేషనల్ క్రికెట్ లో అడుగుపెట్టారు. మొదటి మ్యాచ్‌లోనే కేదార్ జాదవ్ తో కలిసి 144 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
జింబాబ్వే పర్యటనలో మనీష్ పాండే టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టారు. 2016లో ఆస్ట్రేలియా పర్యటనలో అవకాశం సాధించారు. సిడ్నీలో జరిగిన వన్డేలలో 104 పరుగులు ఇన్నింగ్స్ ఆడారు మనీష్ పాండే. ఆ ఇన్నింగ్స్ లో జట్టు గెలవడంలో కీలక పాత్ర పోషించారు. 2016టీ 20 ప్రపంచకప్ లో యువరాజ్ సింగ్ కి బదులుగా జట్టులోకి ఎంపికయ్యారు మనీష్ పాండే.
2017 ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన 15 మంది సభ్యుల జట్టులో కూడా మనీష్ పాండే చోటు సంపాదించారు. ఇటీవలికాలంలో మనీష్ పాండే ఫామ్ తో పాటు ఫిట్‌నెస్ తో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐపీఎల్ లో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు మనీష్ పాండే ప్రదర్శన వల్ల ఇబ్బందులు పడటం, అలాగే బ్యాటింగ్ లో స్ట్రైక్ రేట్ తో పాటు పలు కారణాల వల్ల మనీష్ పాండే టీమిండియాకి దూరమయ్యారు.
End of Article