రోహిత్ శర్మ లాగానే… గాయాలను లెక్కచెయ్యకుండా మైదానం లో పోరాడిన 11 క్రికెటర్స్.!

రోహిత్ శర్మ లాగానే… గాయాలను లెక్కచెయ్యకుండా మైదానం లో పోరాడిన 11 క్రికెటర్స్.!

by Anudeep

క్రికెట్..మన దేశం లో ఇదొక మతం. అందుకే దీనికి ఇక్కడ ఆదరణ ఎక్కువ. ఇతర దేశాల్లో ఫుట్బాల్, రగ్బీ వంటి ఆటలు ప్రాచుర్యం పొందినా క్రికెట్ స్థానం దానిదే. అయితే దేశం కోసం ఆడుతున్న సమయాల్లో గాయాలు కావడం తరచూ జరిగేదే. అలాంటప్పుడు ఆటగాళ్లు మైదానం వీడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

Video Advertisement

కానీ తమ జట్టును, దేశాన్ని గెలిపించటం కోసం కొందరు ఆటగాళ్లు గాయాలను సైతం లెక్కచేయకుండా పోరాడటాన్ని మనం చూస్తున్నాం. చాలామంది బ్యాటర్లు, బౌలర్లు గాయాలైన సరే తమ జట్టు గెలుపుకు కృషి చేసారు. అలాంటి సందర్భాల్లో వారి తమ అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టారు. ఆ ఆటగాళ్లెవరో ఇప్పుడు చూద్దాం..

#1 అనిల్ కుంబ్లే
టీమిండియా లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 2002వ సంవత్సరంలో ఆంటిగ్వాలో వెస్టిండీస్‌తో సిరీస్‌లోని నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో తీవ్ర గాయానికి గురయ్యాడు. దవడ
విరిగి నోట్లోంచి రక్తం వస్తున్నా అతడు తన బౌలింగ్ ను ఆపలేదు. తలకు కట్టుతో కుంబ్లే బౌలింగ్ చేసిన విధానాన్ని ఎవరు మర్చిపోలేరు.

cricketers who played with injuries..

#2 నసీం షా

పాకిస్థాన్ జట్టుకు చెందిన నసీం షా ఆసియా కప్ మ్యాచ్‌లో తన కాలుకు ఇబ్బంది వచ్చి నడవలేకపోయినా తన స్పెల్ ను పూర్తి చేసాడు.

cricketers who played with injuries..

#3 గ్యారీ కిర్ స్టెన్

సౌత్ ఆఫ్రికా ఆటగాడు గ్యారీ కిర్ స్టెన్ 2003 లాహోర్ టెస్టులో పాకిస్థాన్‌పై జరిగిన మ్యాచ్ లో షోయబ్ అక్తర్ వేసిన బౌన్సర్ తో అతడి ముక్కు విరిగి పోయింది. అయినా తర్వాత బాటింగ్ కు దిగాడు గ్యారీ.

#4 మాల్కం మార్షల్

వెస్టిండీస్ కి చెందిన దివంగత ఆటగాడు మాల్కం మార్షల్ కు 1984లో ఇంగ్లండ్‌తో జరిగిన హెడ్డింగ్లీ టెస్ట్‌లో బ్రొటన వేలు విరిగింది. అయినా అతడు చిరునవ్వుతో తన బాటింగ్ ని పూర్తి చేసాడు.

cricketers who played with injuries..

#5 గ్రేమ్ స్మిత్
సౌత్ ఆఫ్రికా కి చెందిన గ్రేమ్ స్మిత్ 2009లో సిడ్నీలో ఆస్ట్రేలియా జట్టు తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో చేయి విరిగినా.. పెయిన్ కిల్లర్లు వేసుకొని తన ఆటను కొనసాగించాడు.

cricketers who played with injuries..

#6 మహేంద్ర సింగ్ ధోని

మన దేశానికి చెందిన గొప్ప కెప్టెన్, వికెట్ కీపర్ అయిన ధోని జింబాబ్వే తో జరిగిన టీ 20 సిరీస్ లో భాగంగా కీపింగ్ చేస్తున్న సమయం లో వికెట్ బెయిల్ ఒకటి ఎగిరి ధోని కంటికి తగిలింది. అయినా ధోని తన ఆటను ఆపలేదు. మ్యాచ్ తర్వాత ధోని పోస్ట్ చేసిన ఒక చిత్రం లో అతడి కన్ను బాగా దెబ్బతిని ఉంది.

అంతే కాకుండా 2006 లో ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో ధోని వెన్నుకు ఐస్ పాక్స్ పెట్టుకొని బాటింగ్ చేసాడు.

#7 శిఖర్ ధావన్
2019 వరల్డ్ కప్ లో శిఖర్ ధావన్ తన చెయ్యి ఫ్రాక్చర్ అయినా ఆస్ట్రేలియా మీద 117 పరుగులు చేసాడు.

cricketers who played with injuries..

#8 యువరాజ్ సింగ్
2011 ప్రపంచ కప్ సమయం లో యువరాజ్ సింగ్ కాన్సర్ తో పోరాడుతున్నా అద్భుతమైన ఆట తీరును కనబరిచాడు. తన ప్రాణాలకు ముప్పు అని తెలిసినా పాకిస్తాన్‌తో జరిగిన సెమీ-ఫైనల్‌లోకి భారత్‌ను నడిపించాడు.

cricketers who played with injuries..

#9 షేన్ వాట్సన్
ఆస్ట్రేలియా కి చెందిన షేన్ వాట్సన్ 2019 లో చెన్నై జట్టు తరపున ఆడాడు. అప్పుడు ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో క్రీజ్ లోకి వచ్చెనందుకు డీవే చేసిన సమయం లో మోకాలికి తీవ్ర గాయం అయ్యింది. అయినా కూడా రక్తమోడుతున్న కాలితోనే బ్యాటింగ్ కొనసాగించాడు. ఆ మ్యాచ్ లో వాట్సన్ 59 బంతుల్లో 80 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్ తర్వాత అతడి మోకాలికి ఆరు కుట్లు పడ్డాయి.

#10 విరాట్ కోహ్లీ

2018 లో లార్డ్స్ లో ఇంగ్లాండ్ జట్టు తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో బ్యాక్ పెయిన్ తో ఇబ్బంది పడ్డాడు. దీంతో అతడికి మైదానం లోనే ఫిజియో చెయ్యాల్సి వచ్చింది.

cricketers who played with injuries..

#11 రోహిత్ శర్మ

తాజాగా బాంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ ఫీల్డింగ్ సమయం లో గాయం తో పెవిలియన్ కి చేరాడు. కానీ జట్టుకు అవసరమైన సమయం లో ఎనిమిదో స్థానం లో బరిలోకి దిగిన రోహిత్.. చేతి గాయాన్ని మరచి వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. 28 బంతుల్లో 51 పరుగులు చేసాడు రోహిత్.

cricketers who played with injuries..


You may also like