అమ్మాయిలు చేసే పనులు చూసుకోమని సలహాలు ఇచ్చారు అంట…కానీ ఆ అమ్మాయి వెనకున్న ఈ కథ తెలుసా.?

అమ్మాయిలు చేసే పనులు చూసుకోమని సలహాలు ఇచ్చారు అంట…కానీ ఆ అమ్మాయి వెనకున్న ఈ కథ తెలుసా.?

by Anudeep

Ads

ఒకప్పుడు అబ్బాయిలు మాత్రమే చేయగలిగే పనులు ఇప్పుడు అమ్మాయిలు కూడా పూర్తి చేస్తున్నారు. తాము చేయలేనివి ఏమి లేవని నిరూపించుకుంటున్నారు. ఒకప్పుడు తమకు అబ్బాయిలు లేరు అని బాధపడేవారు. కానీ నేడు రోజులు మారాయి. కూతుర్లే కొడుకుల్లా తమ బాధ్యతలను నెరవేరుస్తూ తల్లి తండ్రులను చూసుకుంటున్నారు. అలాంటి అమ్మాయే రేవతి కూడా. ఓ వైపు చదువుకుంటూ, మరో వైపు తండ్రి కోసం పంక్చర్ షాపులో పని చేస్తున్న ఈ అమ్మాయి కథ వింటే మీ కళ్ళు చమరుస్తాయి.

Video Advertisement

puncure shop

బీబీసీ తెలుగు కథనం ప్రకారం రేవతి తండ్రి రాము కి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గత ఇరవై ఏళ్లుగా రాము పంక్చర్ షాపులోనే పని చేస్తున్నారు. అయితే, ఆయన ఒక్కరే పని చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎవరినైనా పనిలో పెట్టుకోవాలన్నా వారికి జీతమిచ్చే ఆర్ధిక స్థోమత ఆయనకు లేదు. ఈ పరిస్థితుల్లోనూ తానున్నానంటూ ముందుకొచ్చిన రేవతి తండ్రిని ఆదుకుంది. తన తండ్రి షాపులోనే సహాయకురాలిగా ఉంటూ పని చేయడం కూడా నేర్చుకుంది. మొదట్లో అవసరమైన పనిముట్లను అందించేదాన్ని, కానీ ఇప్పుడు నేను కూడా పని చేయడం నేర్చుకున్నా. నాన్న ఎక్కువ గా టైర్లకు పంక్చర్లు వేసేవారు. నాకుకూడా ఆ పనే తొందరగా వచ్చింది అంటూ తన గురించి తానూ చెప్పుకుంటుంది రేవతి.

revathi

ఏడాది కాలం లోనే మెకానిక్ షాప్ లో అవసరమైన పనులను రేవతి నేర్చుకుంది. అంతే కాదు… పనిలో పడి చదువు నిర్లక్ష్యం చేయలేదు. ఆమె బీకామ్ ను పూర్తిచేసింది. బైక్ రిపేర్లు, టైర్ల ప్యాచ్ వర్క్ పనులను నేర్చుకుంది. కుటుంబ ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా ఆమెకు ఈ పని నేర్చుకోక తప్పలేదు. తానూ టైర్లకు పంక్చర్ లు వేస్తుంటే అందరు ఆశ్చర్యం గా చూసేవారని, అమ్మాయిలు చేయగలిగే పనులు చూసుకోవచ్చు కదా అని సలహాలు ఇచ్చేవారని రేవతి చెప్పుకొచ్చింది. కానీ, తానూ తన తండ్రికి సాయం చేయాలనుకున్నానని, ఆయన కోసం చేస్తున్నపుడు ఈ పనులు కష్టం అనిపించలేదని రేవతి నవ్వుతు సమాధానం ఇస్తుంది.

revathi famil

ఇదేమి పెద్ద వ్యాపారం కాదని, ఎక్కువ డబ్బులేమీ రావని.. కానీ తన ముందు ఉన్నది ఇదొక్కటే దారని రేవతి తెలిపారు. మొదట్లో..ఒక్కరో, ఇద్దరో తప్పనిసరి పరిస్థితుల్లోనే తన వద్ద రిపేర్ లు చేయించుకునే వారని, కానీ ఇప్పుడు చాలా మంది వస్తున్నారని అంత లా నా పని తనం వారిలో నమ్మకం కలిగించిందని రేవతి ఎంతో విశ్వాసం గా చెప్పారు. ఆ ఆత్మవిశ్వాసమే తనని మరింత ముందుకు నడిపించాలని, విజయానికి చేరువ చేయాలని కోరుకుందాం.


End of Article

You may also like