ఈ 8 యాప్ లు మీ ఫోన్ లో ఉన్నాయా..? అయితే వెంటనే డిలీట్ చేసేయండి..! ఎందుకంటే?

ఈ 8 యాప్ లు మీ ఫోన్ లో ఉన్నాయా..? అయితే వెంటనే డిలీట్ చేసేయండి..! ఎందుకంటే?

by Mounika Singaluri

Ads

మన జీవితం లో స్మార్ట్ ఫోన్ నిత్యావసరం అయిపొయింది. అయితే.. మనం డౌన్ లోడ్ చేసుకునే ఆప్ ల వలన మనకు ఎక్కడలేని ఇబ్బందులు ఎదురవ్వచ్చు. అయితే.. గూగుల్ సంస్థ మాత్రం ఇటువంటి ఆప్ ల పై ఓ కన్నేసి ఉంచుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకపోతేనే.. వాటిని ప్లే స్టోర్ లో ఉంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అనుమతిస్తుంది.

Video Advertisement

joker virus

అయితే.. కొన్ని సార్లు కొన్ని ఆప్ ల వలన మన ఫోన్ లోకి వైరస్ లు వస్తూ ఉంటాయి. అయితే.. ఇలాంటి వాటిని గూగుల్ చాలానే హేండిల్ చేసింది. కానీ.. ఒకప్పుడు గూగుల్ ని ముప్పు తిప్పలు పెట్టేసిన “జోకర్” వైరస్ గుర్తుందా..? ఈ వైరస్ ని డిసేబుల్ చేశామని అనుకున్నప్పటికీ.. ఇది మళ్ళీ ఎనిమిది ఆప్ లలో కనిపిస్తోంది. క్విక్ హీల్ సెక్యూరిటీ లాబ్ లోని పరిశోధకులు ఈ విషయాన్నీ గుర్తించారు. తాజాగా.. గూగుల్ కూడా దీనిని గుర్తించి వెంటనే ఆ ఆప్ లను డిలీట్ చేసేసింది.

joker virus 2

అయితే.. గూగుల్ ఆ ఆప్ లను డిలీట్ చేసేసినా.. వాటిని ఇదివరకు ఏ వినియోగదారుడైనా డౌన్ లోడ్ చేసుకుని ఉండి ఉంటె ఆ ఆప్ లు రన్ అవుతూనే ఉంటాయి. వాటివలన ఆ వైరస్ వారి ఫోన్లలోకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఈ 8 ఆప్ లను డౌన్లోడ్ చేసుకుని ఉండి ఉంటె వెంటనే డిలీట్ చేసేయండి. ఇంతకు ఆ ఎనిమిది ఆప్ లు ఏమిటంటే:

  1. ఆక్సిలియారి మెసేజ్
  2. ఫాస్ట్ మేజిక్ SMS
  3. సూపర్ మెసేజ్
  4. సూపర్ SMS
  5. గో మెసేజెస్
  6. ట్రావెల్ వాల్ పేపర్స్
  7. ఫ్రీ కామ్ స్కానర్
  8. ఎలిమెంటరీ స్కానర్

End of Article

You may also like