శ్యామ్ సింగరాయ్ సినిమాలో “దేవదాసీ” గా సాయి పల్లవి.. దేవదాసీలు ఎవరంటే..?

శ్యామ్ సింగరాయ్ సినిమాలో “దేవదాసీ” గా సాయి పల్లవి.. దేవదాసీలు ఎవరంటే..?

by Megha Varna

Ads

నాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శ్యామ్ సింగరాయ్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాస్త కొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని తీసుకువచ్చారు. అలాగే ఈ చిత్రంలో నాని చాలా కొత్త లుక్స్ తో కనిపిస్తారు. అయితే నాని కి జంటగా సాయి పల్లవి ఈ చిత్రంలో నటించనున్నారు. దేవదాసిగా సాయి పల్లవి ఈ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది.

Video Advertisement

అసలు దేవదాసీలు అంటే ఎవరు…? ఎక్కడ ఉంటారు..? ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. దేవదాసీలు అంటే దేవునికి అంకితమైన స్త్రీలు. తమ చిన్నారులను దేవతలకు అంకితం చేసి తల్లిదండ్రులు దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇలా చేస్తారు.

చిన్న వయస్సులో ఉన్నప్పుడే పిల్లలని దేవదాసీలుగా మారుస్తారు. ఈ ఆచారానికి సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి చెందిన బాలికలు బలవుతారు. జీవితాంతం కూడా ఈ అమ్మాయిలు జీవిత భాగస్వామి లేకుండా ఉంటారు. చాలా ప్రాంతాలలో దీనిని నిషేధించారు కానీ ఇంకా దక్షిణాది రాష్ట్రాలలో పలు చోట్ల ఈ సాంప్రదాయం కొనసాగుతుండడం ఘోరం.

పూర్వకాలంలో అయితే దేవుని బిడ్డలుగా వీళ్ళని గుర్తించేవారు. గౌరవంగా కూడా ఉండేవారు. కానీ రాను రానూ రాకెట్లకి బలవంతంగా నెట్టేస్తున్నారు. ఈ కారణం వల్లనే పిల్లల్ని దేవదాసీలుగా మార్చడం మానేశారు. గ్రామంలో ధనవంతులకు, పెద్ద వర్గాల వాళ్లకి దేవదాసీల పై అధికారం ఉండేది.

ఎక్కువగా ఈ సంస్కృతి ఏడవ శతాబ్దంలో ఉంది. ఈ ఆడవాళ్ళకి సంగీతం, నాట్యం పైన పట్టు ఉంటుంది. దేవాలయాల్లో పాటలు పాడడం, నాట్యం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. వారికి బహుమతిగా బంగారాన్ని, భూమిని ఇస్తూ వుంటారు. ఎక్కువగా ఈ సంప్రదాయం చోళులు, పాండ్యుల పాలనలో ఉండేది. ఇప్పటికి కూడా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర లోని కొన్ని ప్రాంతాలలో దేవదాసీలు ఉన్నారు.

కుటుంబం మనుగడకు మార్గం దొరుకుతుంది అన్న ఆశతో తల్లిదండ్రులే తమ సొంత కూతుర్లని ఇలా మార్చేస్తారు. వీరికి యుక్త వయసొచ్చాక గ్రామ పెద్దకి చెప్పేవారు. అప్పుడు వారిని ఊరిలో పెద్దలు కానీ ధనవంతులు కానీ తీసుకుని వెళ్లేవారు. దానికి ప్రతిఫలంగా కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే వారు, కుటుంబం యొక్క పోషణని చూసుకునే వారు. 15 ఏళ్ళు కూడా పూర్తి అవకుండా ఉన్నప్పుడే దేవదాసీలు తమ మొదటి భాగస్వామిని పొందుతారు. వాళ్లకి చిన్న వయసులో ఎయిడ్స్ వంటి అనారోగ్య సమస్యలు కూడా వచ్చేవి.

devadasi

అయినప్పటికీ కూడా దాని నుండి బయటపడలేరు. ఎందుకంటే అదే బతుకుని సాగించడానికి వాళ్ళకి ఉండే ఏకైక మార్గం. దేవదాసీ వ్యవస్థను నిషేధిస్తూ కూడా చట్టాన్ని తీసుకొచ్చారు. భారతదేశం అంతటా ఈ ఆచారాన్ని నిషేధించి 20 ఏళ్లు దాటింది. కానీ 2013లో భారతదేశంలో 4,50,000 మంది దేవదాసీలు ఉన్నారని జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలిపింది. అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే దాదాపు 80,000 మంది దేవదాసీలు ఉన్నారట.


End of Article

You may also like