బింబిసార డైరెక్టర్ “వశిష్ఠ” తో పాటు… యాక్టర్‌గా కెరీర్ మొదలు పెట్టిన 10 డైరెక్టర్స్..!

బింబిసార డైరెక్టర్ “వశిష్ఠ” తో పాటు… యాక్టర్‌గా కెరీర్ మొదలు పెట్టిన 10 డైరెక్టర్స్..!

by Mohana Priya

Ads

కెరియర్ లో ముందుకు వెళ్లాలంటే ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాల్సిందే. ఇవాళ ఇండస్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకున్న కొంత మంది కూడా ఏదో ఒక రోల్ తో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.

Video Advertisement

సినీ పరిశ్రమలో కళాకారులకు కొదవ లేదు, ప్రతీ ఒక్కరూ మల్టీ టాస్క్ లు చేస్తూ…అభిమానులను మెప్పిస్తుంటారు. అలా కొందరు తమ జీవితాలని యాక్టర్స్ గా పరిచయం అయ్యి… డైరెక్టర్స్ గా జీవితాన్ని కొనిసాగించిన నటులు ఎవరో తెలుసుకుందాం.

1. వశిష్ట

గతంలో ప్రేమ లేఖ రాశా చిత్రంలో హీరోగా నటించిన వశిష్ట, తాజాగా 2022లో విడుదలైన బింబిసార మూవీకి దర్శకత్వం వహించారు.

directors who started careers as actors

2. వెంకీ అట్లూరి

ఇతను 2010 లో విడుదలైన స్నేహ గీతం సినిమాలో నటుడిగా వ్యవహరించి… తరువాత వరుణ్ తేజ్ తొలిప్రేమ, రంగ్ దే సినిమాలతో దర్శకత్వం వహించారు.

directors who started careers as actors

3. కె.విశ్వనాథ్

ఇక ఆయన గురించి ప్రత్యేకంగా చప్పక్కర్లేదు. తెలుగు సినీ పరిశ్రమకు మరిచి పోని చిత్రాలు తెరకెక్కించిన గొప్ప మనిషి. నీ స్నేహం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి సినిమాల్లో నటించగా… స్వాతి ముత్యం, సాగర సంగమం వంటి ఎన్నో గొప్ప సినిమాలకు దర్శకత్వం వహించారు.

directors who started careers as actors

4. విజయ నిర్మల

పండంటి కాపురం, పూల రంగడు వంటి ఎన్నో సినిమాలలో తన నటనా ప్రతిభను చూపించారు విజయ నిర్మల. తరువాత దేవదాసు, రౌడీ రంగమ్మ వంటి అనే సినిమాలకి దర్శకత్వం వహించారు.

directors who started careers as actors

5. రేణు దేశాయ్

బద్రి, జాని వంటి సినిమాల్లో రేణు దేశాయ్ లీడ్ రోల్స్ లో నటించగా… ఇష్క్ వాలా లవ్ మూవీకి దర్శకత్వం వహించారు.

directors who started careers as actors

6. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

నటుడిగా తమ్ముడు, కుషి, వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా దర్శకుడిగా పని చేశారు. కెరీర్ మొదట్లోనే జానీ మూవీకి దర్శకత్వం వహించారు.

coincidence in these 4 pawan kalyan movies

7. దాసరి నారాయణరావు

సూరిగాడు, నాన్న గారు వంటి అనేక చిత్రాలలో నటించారు దాసరి నారాయణరావు. ఏక కాలంలోనే ఒసేయ్ రాములమ్మ, బొబ్బిలి పులి వంటి సూపర్ సూపర్ హిట్ సినిమాలకి దర్శకత్వం చేశారు.

directors who started careers as actors

8. శ్రీనివాస్ అవసరాల

ఊహలు గుసగుసలాడే, అష్టాచమ్మా వంటి చిత్రాలలో శ్రీనివాస్ అవసరాల నటించారు. మరోవైపు జ్యో అచ్యుతానంద సినిమాతో పాటు అనేక సినిమాలకు దర్శకత్వం వహించారు.

directors who started careers as actors

9. ప్రకాష్ కోవెలముడి

దర్శకుడు రాఘవేంద్ర రావ్ తనయుడు ప్రకాష్ కోవెలముడి ది మీనింగ్ రాగా, నీతో వంటి సినిమాల్లో నటించారు. తరువాత సైజ్ జీరో, అనగనగా ఒక ధీరుడు సినిమాలకు దర్శకత్వం వహించారు.

directors who started careers as actors

10. మెహెర్ రమేష్

ఇక మెహెర్ రమేష్ అయితే బాబీ సినిమాలో మహేష్ బాబుకి ఫ్రెండ్ పాత్రలో నటించారు. తరువాత శక్తి, బిల్లా వంటి మూవీస్ కి దర్శకత్వం వహించారు.

directors who started careers as actors

ఇలా అనేక మంది నటులు సినీ పరిశ్రమలో దర్శకులుగా కొనసాగుతూ, ప్రేక్షకులను అలరిస్తున్నారు.


End of Article

You may also like