Ads
మన హిందూ ధర్మంలో దేవుళ్ళకి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తాము. అదేవిధంగా పూజా మందిరంలో ఉన్న చిత్రపటాలను కూడా అంతే భద్రంగా చూసుకుంటూ ఉంటాము. నిత్యం దీప ధూప నైవేద్యాలతో ఆరాధిస్తూ ఉంటాము.
Video Advertisement
పూర్వకాలం పెద్దల నుంచి మనకు కొన్ని కొన్ని దేవుని చిత్రపటాలు, లేక విగ్రహాలు మనకి సంప్రదాయం ప్రకారం కొనసాగుతుంటాయి. దేవుడు చిత్రపటాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటాము.
అలాంటి టైమ్ లో దేవుని చిత్రపటం పాడువటం లేక చిత్రపటం మీద ఉన్నా గ్లాసు విరిగిన అపశకునంగా భావిస్తారు. ఇప్పటివరకు పూజించిన పాత పడిపోయిన లేదా విరిగిపోయిన దేవుని చిత్రపటాని ఏం చేయాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read : బ్రహ్మ దేవుడు నిజంగా తన కూతుర్ని పెళ్లి చేసుకున్నారా..?
నిత్యం పూజ చేసిన ఆ చిత్ర పటాన్ని ఎప్పటిలాగానే దీప ధూప నైవేద్యాలతో ఆరాధించి, దాని పైన ఉన్న ఫేమ్ ని తీసేసి లోపల ఉన్న చిత్రపటాన్ని చక్కగా మడతపెట్టి నదీ ప్రవాహంలో గాని, సమీపంలో ఉన్న గంగా ప్రవాహం ( నీరు ప్రవహిస్తున్న కాలువ) లో గాని విడిచిపెట్టి నమస్కారం చేసుకోండి. ఇది ఉత్తమమైన పద్ధతి.
నదీ ప్రవాహం గాని, గంగా ప్రవాహం గాని దగ్గరలో లేని వారు తమ సమీపంలో ఉన్న దేవాలయములో దేవుని చిత్రపటానికి పూజలు అందే విధంగా అమర్చాలి. అంతేకాని ఎక్కడపడితే అక్కడ చిత్రపటాలను వదిలేయకూడదు.
ఎక్కడపడితే అక్కడ దేవుడు చిత్రపటాలు వదిలేయడం అనేది పెద్ద తప్పుగా భావిస్తారు. ఎందుకంటే దేవుని చిత్రపటంలోని ఉన్న రూపం మనము దేవుని గాని భావిస్తూ పూజించే సంస్కృతి కాబట్టి మనది.
Also Read: మీ కళ్ళలో ఈ 4 మార్పులు కనిపిస్తే చాలా ప్రమాదం..
ఆదివారం నాడు తులసి చెట్టుకు నీరు పోయడం విరుద్ధం. ఎందుకో తెలుసా…
End of Article