రైలు భోగిలో “డోర్” కి పక్కన ఉండే “కిటికీలకు” ఎక్కువ “ఊచలు” ఎందుకు ఉంటాయో తెలుసా.?

రైలు భోగిలో “డోర్” కి పక్కన ఉండే “కిటికీలకు” ఎక్కువ “ఊచలు” ఎందుకు ఉంటాయో తెలుసా.?

by Anudeep

Ads

మన చిన్నప్పటి నుంచి మనందరికీ రైల్లో ప్రయాణాలు చేయడమంటే ఇష్టం కదా.. మామూలుగానే మనకి ప్రయాణాలంటే ఇష్టం.. అందులో రైలు ప్రయాణాలు ఇంకా సౌకర్యవంతంగా.. ప్రకృతిని అందంగా చూపిస్తాయి. మనందరం విండో సీట్ పక్కన కూర్చుని ప్రయాణం చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తాం.. అయితే, సాధారణంగా అన్ని బోగీల వద్ద ఉండే కిటికీలకు, కోచ్ డోర్ వద్ద ఉండే కిటికీ కి గల తేడాను ఎప్పుడైనా గమనించారా..?

Video Advertisement

coach door window

సాధారణంగా ఉండే కిటికీలకు మధ్యన ఉండే ఊచలు దూరంగా ఉంటాయి. అదే డోర్ దగ్గర ఉండే కిటికీ మాత్రం ఊచలు చాలా దగ్గరగా ఉంటాయి..ఇవి ఇలా ఎందుకుంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? సాధారణంగా కోచ్ డోర్ కి దగ్గర గా ఉండే కిటికీ వద్ద నుంచి దొంగతనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనకు తెలియకుండా.. మన వెనకాల డోర్ వద్ద ఎవరైనా అపరిచితులు నుంచుని ఉండి దొంగతనానికి ప్రయత్నించవచ్చు. ఊచలు దూరంగా ఉంటే వారి దొంగతనం సులువు అవుతుంది.

indian railway

అదే.. ఊచలు దగ్గరగా, ఎక్కువ సంఖ్యలో ఉంటె వారి చేతులు ట్రైన్ లోపలకి పట్టవు. ఆ విండో సీట్ దగ్గర కూర్చున్న వ్యక్తి పరధ్యానంగా ఉన్న సమయంలోను, తన వస్తువులను పట్టించుకోకుండా ఉన్న సమయంలో కూడా దొంగతనం జరగడానికి ఆస్కారం ఉండదు. మిగిలిన కిటికీలన్నీ కోచ్ డోర్ కి దూరంగా ఉంటాయి కాబట్టి.. ఇలా దొంగతనం జరగడానికి వీలు లేదు. అందుకే మిగిలిన కిటికీలకు ఒకలా డోర్ దగ్గర ఉండే కిటికీకి ఒకలా ఈ ఊచల్ని ఏర్పాటు చేసారు.


End of Article

You may also like