కొన్నిసార్లు మనకు తెలుసో తెలియకో ఆహారం విషయంలో తప్పులు చేస్తుంటాం. తెలియకుండా చేసిన తప్పులు ద్వారా ఆరోగ్యాన్ని బాధపడుతూ ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు.

Video Advertisement

ఇంకా చికెన్ తో వండిన పదార్థాలు అంటే ఎంతో ఇష్టంగా తింటుంటారు. బిర్యానీ దగ్గర నుంచి చికెన్ 65 వరకు ఏ ఈ వెరైటీని వదిలిపెట్టారు చికెన్ ప్రేమికులు

హలీం గింజలు వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !

పూర్వం రోజుల్లో ఫ్రిడ్జ్ ఎవరికీ ఏమీ లేవు. అప్పటి వారు ఏ పూట వంట అప్పటికప్పుడు తయారు చేసుకుంటూ  ఆహారంగా తీసుకుని ఆరోగ్యంగా ఉండేవారు. చాలా మంది రెస్టారెంట్లకు, హోటల్ కు వెళ్లి నచ్చిన చికెన్ పదార్థాలను ఆర్డర్ చేసి మరీ ఇష్టంగా తింటుంటారు. ఆ చికెన్ పదార్థాలు అప్పటికప్పుడు వండినవ లేక ముందుగానే ఫ్రిజ్లోపెట్టి, వేడి చేసి మన ముందు ప్రత్యక్షమయ్యాయి అనే విషయం ఎవరికీ తెలియదు.

ఆహార నాణ్యత నియమం ప్రకారం ఉడికించిన చికెన్  ఎక్కువ రోజులు ఫ్రిజ్లో పెట్టి తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి మేలు కంటే హాని ఎక్కువ జరుగుతుంది. వండకుండా ఉన్న మాంసాన్ని అయితే  చెడిపోయిందో, లేదో అనే విషయాన్ని మనం గుర్తించగలం. పచ్చి మాంసం పై బూడిద రంగు లేదా ఆకుపచ్చని రంగు కనిపిస్తే ఆ మాంసం చెడిపోయినట్లు అర్థం. ఈ విధముగా ఉన్న మాంసం మనకి వండుకోవడానికి చేయదు.

ఈ విధంగా ఎక్కువ రోజులు ఫ్రిజ్లో పెట్టిన ఉడికిన మాంసాన్ని తినడం ద్వారా మనకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దానిపై చెడు బ్యాక్టీరియా చేరడం వల్ల అది నేరుగా మన కడుపులోకి వెళ్లి అనారోగ్యాలను  కలుగజేస్తుంది. అలాంటి ఆహారం తీసుకోవడం వల్ల మనకి ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది. ఒకసారి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది.

అదే విధంగా ఎక్కువ రోజులు ఫ్రిజ్లో ఉండి పాడైపోయిన ఉడికించిన చికెన్ తినడం వల్ల కడుపు నొప్పి విరోచనాలు, వాంతులు, తల తిరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి.ఇది ఫుడ్ పాయిజన్ కు సంకేతమని గుర్తించి వెంటనే తగిన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రమాదం నుంచి బయటపడవచ్చు.