పూర్వం భార్య భర్త తిన్న ప్లేటులో తినాలని, అప్పుడే సగ భాగం పంచుకున్నట్టు,అన్యోన్యంగా ఉన్నట్టు అని పెద్దలు చెబుతుంటారు. అలాగే మన ఇళ్ళల్లో కూడా ఎవరైనా ఎదిన ఆహారం సగం తిని వదిలేస్తే మిగతాది ఇంట్లో వాళ్ళు తినేస్తారు.

Video Advertisement

ఏమవుతుంది ఆహారం పడెయ్యలేం కదా, అయినా మన వాడేగా తింటే తప్పేంటి అంటారు. కానీ నిజంగా తప్పే. అలా చెయ్యడం వల్ల ఎంత పెద్ద సమస్య వస్తుందో కూడా ఊహించలేరు.

దీన్ని కూడా చదవండి: హలీం గింజలు వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !

నేరుగా విషయానికి వస్తే ఒకరు తిన్న ప్లేటులో ఇంకొకరు తింటే మొదట కచ్చితంగా అనారోగ్యానికి గురవుతాము. అంతే కాదు ఎవరు వదిలేసిన ప్లేటులో అయితే తింటున్నామో వారికి ఒకవేళ అంటు వ్యాధి ఉన్నా, జలుబు, ఫ్లూ, జీర్ణకోశ వంటి అంటూ వ్యాధులు తొందరగా వ్యాప్తిస్థాయి. అలా అని ఇలాంటి వ్యాధులు అందరికీ ఉంటాయని చెప్పలేం, లేవని చెప్పలేము. కాబట్టి ఒకరు తిన్న ఎంగిలి ప్లేటులో తినక పోవడం వల్ల చాలా అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు.

indian food 1

అయినా సరే అని తింటే ఎవరు ఆహారం అయితే తింటున్నామో అది శుభ్రంగా ఉందో లేదో చూడాలి, చేతులు, పాత్రలు శుభ్రంగా కడగాలి ఆ తర్వాతే వాడాలి. ఒకవేల అశ్రద్ద చేస్తే క్రిములు, బ్యాక్టీరియా వంటివి సులువుగా శరీరంలోకి ప్రవేశించి… జీర్ణ సమస్యలను తెచ్చి పెడుతుంది. అంతే కాదు అలా తింటే శరీరానికి సరైన పోషకాలు కూడా అందవు. కాబట్టి ఇప్పటి నుండి ఆహారం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం మేలు. లేదంటే అనారోగ్య సమస్యలు చినికి చినికి గాలి వానగా మారుతాయి.

ALSO READ : తల్లి ఆస్తి కూతురికి చెందుతుందా..? కొడుకుకి చెందుతుందా..? చట్టం ఏం చెప్తోంది..?