Ads
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ప్రతీసారి సరికొత్త ఫీచర్లతో యూజర్లను అలరిస్తూ పోతోంది. కొత్త కొత్తగా ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూ మరింతగ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు శర వేగంగా అడుగులు వేస్తోంది. ఫేస్‌బుక్ ఆరేళ్ల క్రితం(2014) వాట్సా ప్‌ను టేకోవర్ చేసింది. ఆ తర్వాత కంపెనీకిదే అతిపెద్ద ఒప్పందం. గడిచిన కొన్నేళ్లలో మీడియా, ఆన్‌లైన్ సేవల కంపెనీల్లోనే ఫేస్‌బుక్..పెట్టుబడులు పెడుతూ వచ్చింది. ఇందులో భాగంగానే అభిమానుల కోసం లాస్సో యాప్ పేరుతో సరికొత్త వీడియో యాప్ ని అందుబాటులోకి తీసుకువస్తోంది.
Video Advertisement
టిక్ టాక్‌కు గట్టి పోటీ ఇవ్వడానికి ఫేస్‌బుక్ లాస్సో యాప్ ని రూపొందించింది .ప్రస్తుతం ఈ లాస్సో యాప్ యూఎస్‌లో అందుబాటులోకి వచ్చింది. మార్పుచేర్పుల తర్వాత మే చివరి వారంలో ఈ యాప్ ని ఇండియా లో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది.
లాస్సో యాప్ ప్రత్యేకతలు
- ఈ లాస్సో వీడియో యాప్ ద్వారా చిన్న చిన్న వీడియోలను మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు.
- ప్రతి వీడియోకి పిల్టర్స్, స్పెషల్ ఎఫెక్ట్ లను ఇచ్చుకోవచ్చు.
- ఇది iOS మరియు Android లలో అందుబాటులో ఉంటుంది.
- మ్యూజిక్ ఫీచర్‌తో నచ్చిన పాటలను యాడ్ చేసుకునే అవకాశం.
- ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్,గూగుల్ అకౌంట్ల ద్వారా లాగిన్ కావొచ్చు.
- లాస్సో లో రూపొందించిన వీడియోలను ఫేస్బుక్ స్టోరీస్,ఇన్సగ్రామ్ స్టోరీస్,వాట్సాప్ స్టోరీస్ లో అప్‌లోడ్ చేసుకోవచ్చు .
లాస్సో యాప్‌లో ప్రత్యేకతలు హ్యాష్‌ట్యాగ్‌లు
- #smh (shaking my head)
- #flexin
- #GoOff
- #sorrynotsorry
- #fail
- #savage
- #realtalk
లాస్సో యాప్ డౌన్లోడ్ లింక్
Android >> Download Here
iOS >>> Download Here
End of Article