అన్నం పండించి ఆకలి తీర్చడమే కాదు. ఆపద వస్తే ఆదుకోవడం కూడా తెలుసని నిరూపించాడు తెలంగాణ ఆదిలాబాద్ కి చెందిన ఓ రైతన్న. కరోనాపై పోరు కొనసాగుతున్న వేళ ఆ అన్నదాత తన గొప్ప మనసు చాటుకున్నారు. 50 వేల రూపాయలు సహాయ నిధికి ఇచ్చి కరొనను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలిచారు. వివరాల లోకి వెళ్తే..

Video Advertisement

Also read: కూతురికి కరోనా సోకకూడదని అని ఆ డాక్టర్ ఏం చేసారో తెలుసా?

ఆదిలాబాద్ జిల్లా లాండసాంగి గ్రామానికి చెందిన మోర హన్మాండ్లు వృత్తి పరంగా రైతు. కరొనను కట్టడి చేయడంకోసం ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. నాకున్న నాలుగున్నర ఎకరాల పొలంలో ఈ ఏడాది పంట బాగానే పండింది. లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు తినడానికి తిండి దొరకట్లేదు. నా కుమారులు వారి సహాయంకోసం ఎంతో కొంత ఇద్దామని సూచించారు. ఆ మేరకు ఈ 50 వేల రూపాయలు సీఎం సహాయ నిధికి అందచేస్తున్నాను అంటూ తన ఔనత్యాన్ని చాటుకున్నారు.

“ఆ కరోనాకు ప్రపంచమే వణికిపోతోంది. డబ్బులు ఉండి ఏం జేస్తయి సార్ పనికొస్తయా? మనం చచ్చిపోతే. డబ్బులు ఏం జేస్తయ్.. నా అటువంటోళ్లు ఇంకా ఎందరో సాయం చేయడానికి ముందుకు రావాలని కోరుతూ.. సాయం చేశా..” అని ఆయన చెప్పిన ఈ మాటలకి హ్యాట్సాఫ్ అనకుండా ఉండలేము. 22 ఏళ్ల పాటు ఓ బట్టల దుకాణంలో గుమాస్తాగా పని చేసాక రైతుగా మారానని ఆయన తెలిపారు. 50 వేలు రూపాయలు ఇవ్వడం నష్టమే కానీ…తాను తీసుకున్న ఆ నిర్ణయం వల్ల ఎంతో మంది ముందుకొస్తారని స్ఫూర్తి నింపారు ఆయన.

Also read: ఎవరక్కడ…అఖిల ఇక్కడా…! ఇంతకీ ఎవరు ఈ అఖిల?

కాలం కలిసొస్తే. పంట ద్వారా తన యాభై వేల రూపాయలు మళ్లీ సంపాదించుకుంటానని గర్వంగా చెప్పారు.నష్టం గురించి ఆలోచించలే.. ఇతరుల గురించి ఆలోచించి ముందుకొచ్చా అని ఆయన చెప్పిన మాటలకి కంటతడి రాకుండా ఉండదు. ఇలాగె ఎంతో మంది ముందుకి రావాలని కోరుకుందాము. మనకి చేతనైన సాయం మనము చేద్దాము. కనీసం ఇంట్లో ఉండి లాక్ డౌన్ నియంత్రణను పాటిస్తూ కరొనను తరిమేందుకు ప్రభుత్వానికి తోడుగా ఉందాము. కేవలం ఇంట్లో కూర్చొని దేశాన్ని కాపాడుకునే అవకాశం ఎవరికీ ఉంటుంది చెప్పండి. కనీసం అదైనా సక్రమంగా చేద్దాము. జై హింద్!!!!

watch video: