పెట్రోల్ బంక్స్ వద్ద ఎక్కువగా జరిగే ఈ మోసం గురించి తెలుసా..? ఈ సారి పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు ఈ టిప్స్ పాటించి చూడండి..!

పెట్రోల్ బంక్స్ వద్ద ఎక్కువగా జరిగే ఈ మోసం గురించి తెలుసా..? ఈ సారి పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు ఈ టిప్స్ పాటించి చూడండి..!

by Megha Varna

Ads

మన చుట్టూ ఉండే వ్యాపారాలలో మోసాలు ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువ డబ్బులు సంపాదించడం కోసం కస్టమర్లను ఏదో ఒక విధంగా మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అటువంటి వాటిలో భాగంగా పెట్రోల్ పంపులు వద్ద ఎక్కువ మోసాలు జరుగుతాయని వింటూ ఉంటాము. అయితే దాన్ని ఎలా కనుగొనాలి..? మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Video Advertisement

 

పెట్రోల్ బంకులులో క్యూ లో ఉన్నప్పుడు మీ కంటే ముందు ఉన్న వ్యక్తి 50 రూపాయలు పెట్రోల్ కొనుగోలు చేస్తే తర్వాత మీరు 100 రూపాయలు కావాలని అడిగితే మీకు 50 రూపాయల నుండి కౌంట్ వస్తుంది. కానీ 0 నుండి కాదు. ఎందుకంటే మీటర్ ను రీసెట్ చేయకపోవడం వల్ల 50 నుండి కౌంట్ అవుతుంది. అందుకే చాలా మంది పెట్రోల్ కొనుగోలు చేసే ముందు మీటర్ లో జీరో కనబడిందా లేదో చూసుకుంటారు.

 

కానీ కొన్నిచోట్ల రీసెట్ బటన్ కొట్టి జీరో నుండి మొదలు పెట్టిన పెట్రోల్ 50 నుండే కౌంట్ అవుతుంది. దానికి కొన్ని ట్రిక్స్ ను ఉపయోగించి మోసం చేస్తున్నారు. ఈ మధ్య చాలా పెట్రోల్ బంకుల్లో ఈ విధంగా జరుగుతోంది. కాబట్టి కాస్త జాగ్రత్తపడండి. అయితే మీరు కనుక మోసపోకుండా ఉండాలంటే ఇలా ఫాలో అవ్వండి.

మీరు కారులో కూర్చుని పెట్రోల్ కొట్టిస్తూ ఉంటే కనుక చాలా మోసాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్త పడండి.

# వీలయితే కిందకి దిగి చూసుకోండి. లేదా గ్లాస్ తీసి చూడండి.

# అలానే కొంతమంది ఇలాంటి మోసాలు జరగకుండా ఉండాలని 100, 200 కు బదులుగా 110, 210 కు పెట్రోల్ ని కొట్టిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల కూడా మీరు మోసపోకుండా ఉంటారు.

# మీరు కార్డ్ పేమెంట్ చేయాలనుకుంటే ముందుగా పెట్రోల్ కొట్టించుకుని కంగారు పడకుండా ఆ తర్వాత పేమెంట్ చేయండి.


End of Article

You may also like