Ads
ఉగాది పండుగను చైత్రమాసం శుక్లపక్ష పాడ్యమి రోజు జరుపుకుంటారు. ఉగాది నుండి తెలుగువారికి కొత్త సంవత్సరం మొదలవుతుంది. తెలుగు ప్రజలు శోభకృత్ నామ సంవత్సర ఉగాదిని ఘనంగా జరుపుకోడానికి సిద్ధం అవుతున్నారు. మార్చి 22న ఉగాది పండుగ వచ్చింది.
Video Advertisement
ఉగాది రోజు నుంచి అందరి జీవితాలలో మార్పులు వస్తాయని నమ్ముతారు. పన్నెండు రాశులల్లో కూడా మార్పులు జరుగుతాయని చెబుతారు. అందువల్లనే ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేస్తారు. ఈ ఏడాదిలో తమ జీవితంలో రాబోతున్న లాభనష్టాలను గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తిని చూపిస్తారు.అయితే ఈ ఉగాది రోజు నుంచి 3 రాశులవారికి గజకేసరి యోగం రాబోతుందని పండితులు చెప్తున్నారు. మరి గజకేసరి యోగం అంటే ఏమిటో? ఏ రాశుల వారికి ఈ యోగం రాబోతుందో ఇప్పుడు చూద్దాం..
గజకేసరి రాజయోగం:
ఉగాది నుండి బృహస్పతి, చంద్రుడి మీనరాశిలో కలవనున్నారు. దాని వల్ల గజకేసరి రాజయోగాన్ని కొన్ని రాశులకు కలిగిస్తుంది. గజకేసరికి అర్ధం ఏమిటంటే, గజము అనగా ఏనుగని, కేసరి అనగా సింహము. ఈ రెండూ చాలా బలమైన జంతువులు. ఈ గజకేసరి రాజయోగంతో వల్ల ఆ రాశులకు చెందినవారు తెలివి తేటలను, ప్రతిభతో వారు మొదలు పెట్టిన అన్ని పనుల్లో గెలుపును పొందుతారని విశ్వాసం. అందువల్లే ఈ యోగాన్ని సకల శుభాలని కలిగించే రాజయోగం అని చెబుతారు. ఈ గజకేసరి రాజయోగం వల్ల 3 రాశులవారికి పట్టుకున్నదల్లా బంగారం అని, ఆర్ధికంగా లాభాలను అందుకుంటారని పండితులు పేర్కొన్నారు.
మిథున రాశి:
ఈ రాశికి చెందిన వారికి ఈ యోగం వల్ల అన్ని రకాలగా కలిసి వస్తుంది. మంచి ప్రయోజనాలు చేకూరడంతో పాటుగా ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ ఏడాది శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగం చేసేవారికి, వ్యాపార రంగంలోని వార్కి కూడా ఆర్థికంగా ఎదుగుతారు.
సింహ రాశి:
గజకేసరి రాజయోగం వల్ల ఈ రాశి వారు తిరుగులేని జాతకం కలవారిగా మారతారు. ఈ ఏడాది శుభప్రదంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలను పొందుతారు. విద్య, వృత్తి, వ్యాపారస్తులకు అన్నిరకాలుగా లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారు ఆర్ధికంగా లాభాలను అందుకుంటారు.
మీన రాశి:
ఈ యోగంతో మీన రాశివారు విశేషమైన శుభాలను పొందుతారు. అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. ఏ పని చేసినా పెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యారంగంలోని ఉండేవారు కీర్తి ప్రతిష్టలను పొందుతారు. అన్నిట్లోనూ విజయాలను పొందుతారు. అన్నీ విషయాల్లోనూ కలిసి వస్తాయి.
Also Read: శోభాకృతు నామ సంవత్సర రాశి ఫలాలు 2023 | ఉగాది రాశి ఫలాలు 2023-24
End of Article