263 కిలోల నుంచి 104 కిలోలకు తగ్గిన యువకుడు..!! ఎలా అంటే..??

263 కిలోల నుంచి 104 కిలోలకు తగ్గిన యువకుడు..!! ఎలా అంటే..??

by Anudeep

Ads

బరువు తగ్గడమంటే చాలా కష్టమైన పని అనుకుంటారు చాలా మంది. కానీ కొన్ని నియమాలు పాటిస్తే ఇదంత కష్టం కాదు. జర్మనీలో వెల్బర్ట్‌లో నివసిస్తున్న 38 ఏళ్ళ మైఖేల్ మెహ్లర్ మూడేళ్ళ క్రితం 263 కిలోల బరువు ఉండేవాడు. ప్రస్తుతం అతడి బరువు 104 కిలోలు.

Video Advertisement

అయితే జరగదు అన్న పనిని కూడా చేసి చూపించాడు మైఖేల్. అంతకుముందు అతడు మూడు అడుగులు కూడా వేయలేని స్థితిలో ఉండేవారు. అతను వేసుకునే బట్టలు ముందుగా 10XL సైజ్ ఉండేది. అతని నడుము సైజ్ అయితే 74 ఇంచెస్. అయితే తన హెల్తీ లైఫ్ స్టైల్ తో అతడు తన బాడీ షేప్‌ని మార్చుకున్నాడు.

germany man inspiring weightloss journey..!!

మొదట మైఖేల్ బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నాడు. దీని వల్ల 23 కిలోల బరువు తగ్గాడు. అయితే ఈ సర్జరీ కేలరీలను తక్కువగా తీసుకునేలా చేస్తుంది. ఆ తరువాత సరైన ఆహారం, రెగ్యులర్ గా వర్కౌట్ చేయడం వల్ల అతడు బరువు సులువుగా తగ్గాడు. వారానికి ఆరు సార్లు రెండు గంటల పాటు వెయిట్ ట్రైనింగ్, రెండు గంటల పాటు కార్డియో చేశాడు మైఖేల్.

germany man inspiring weightloss journey..!!

తమ ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకున్నాడు మైఖేల్. అంతకు ముందు జంక్ ఫుడ్ ఎక్కువగా తినేవాడు. కానీ, బరువు తగ్గేందుకు అతను బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్, బెర్రీస్ తినడం అలవాటు చేసుకున్నాడు. లంచ్‌లో రైస్, చికెన్, కూరగాయలు తీసుకునేవాడు. డిన్నర్ కోసం ట్యూనా, సాల్మన్ చేపలు బ్రెడ్ తినేవాడు. వీటితో పాటు వర్క్అవుట్ చెయ్యడం తో అతడు విజయవంతంగా బరువు తగ్గాడు.

Trainer about health issues during exercise

డైట్ చేసి వర్కౌట్ చేయడం స్టార్ట్ చేశాక వెంటనే ఫలితం కనిపించదు కానీ పట్టు విడవకుండా అన్ని నియమాలు పాటించినప్పుడే బరువు తగ్గుతారు. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు అని నిపుణులు చెబుతున్నారు. మీరు బరువు తగ్గాలనుకున్నప్పుడు కచ్చితంగా మీ లైఫ్‌‌స్టైల్‌లో కొన్ని మార్పులు చేసుకోండి. దీంతో కచ్చితంగా రిజల్ట్ ఉంటుంది.


End of Article

You may also like