ప్లాప్ అయినా “జిన్నా” సినిమాకి ఇంత లాభం వచ్చిందా..? ఎలా అంటే..?

ప్లాప్ అయినా “జిన్నా” సినిమాకి ఇంత లాభం వచ్చిందా..? ఎలా అంటే..?

by Anudeep

Ads

విష్ణు మంచు కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా ‘జిన్నా’. చాలా గ్యాప్ తర్వాత మంచి విష్ణు ఈ చిత్రం తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈషాన్ సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు పాయల్ రాజ్ ఫుత్ , సన్నీలియోన్ నటించిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 21 వ తేదీ విడుదల అయ్యింది. అయితే గత సినిమాలు మాదిరిగానే ఈ సినిమా కూడా నిరాశ పరిచింది.

Video Advertisement

మంచు మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అయ్యింది. మొదట్లో సినిమా బానే ఉందని టాక్ వచ్చినా.. థియేటర్ల దగ్గర ఆశించిన రీతిలో ప్రేక్షకుల సందడి కనిపించలేదు. ఈ సినిమాతో పాటు మరో మూడు సినిమాలు కూడా ఒకేరోజు విడుదల కావడంతో ఆ ప్రభావం జిన్నా సినిమాపై పడిందని చెప్పాలి.

ginna movie got profits through hindi dubbing rights..!!
అయితే సినిమా ప్లాప్ అయినా ‘జిన్నా’తో విష్ణు మంచుకు లాభాలే వచ్చాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ‘జిన్నా’ కంటే ముందు విడుదల అయిన మంచు విష్ణు సినిమాలు కొన్ని హిందీలో డబ్బింగ్ అయ్యి మంచి వ్యూస్ సొంతం చేసుకున్నాయి. దానికి తోడు హిందీ ప్రేక్షకులకు బాగా తెలిసిన సన్నీ లియోన్ ‘జిన్నా’లో ఉన్నారు. పాయల్ రాజ్ పుత్ కూడా గతంలో హిందీ సీరియల్ చేశారు. దాంతో ‘జిన్నా’ హిందీ డబ్బింగ్ రైట్స్‌కు పది కోట్ల రూపాయలు వచ్చాయని ఇండస్ట్రీ టాక్.

ginna movie got profits through hindi dubbing rights..!!
‘జిన్నా’ మూవీ బడ్జెట్ 15 కోట్లు అనుకున్నా… పది కోట్ల రూపాయలు హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా వచ్చేశాయి. డిజిటల్ రైట్స్, థియేట్రికల్ కలెక్షన్స్, ఆడియో రైట్స్ వగైరా వగైరా కలుపుకొంటే బడ్జెట్ రికవరీ అవుతుందని తెలుస్తోంది. థియేట్రికల్ కలెక్షన్స్ కంటే డబ్బింగ్, ఓటీటీ రైట్స్ అన్ని కలుపుకుంటే ఈ సినిమాకు భారీగా లాభాలు వచ్చాయని తెలుస్తోంది.


End of Article

You may also like