రెండు రోజులు 20000 తేనెటీగలు ఆ కారు వెనక ఎందుకు పడ్డాయో తెలుసా.?

రెండు రోజులు 20000 తేనెటీగలు ఆ కారు వెనక ఎందుకు పడ్డాయో తెలుసా.?

by Mohana Priya

Ads

తేనెటీగలు మామూలుగా జనాలు సంచరించే ప్రాంతాల్లో ఎక్కువగా ఉండవు. ఇది మనందరికీ తెలుసు. తేనెటీగలు ఎక్కువగా చెట్ల మీద కానీ, లేదా ఎక్కువ జనసంచారం లేని ప్రదేశంలో కానీ తేనెని పెడతాయి. ఎక్కువగా అలాంటి ప్రదేశాల్లోనే గుంపులుగా ఉంటూ ఉంటాయి. జన సంచారం ఉన్న ప్రదేశాల్లో తేనెటీగలు తిరగడం అనేది చాలా అరుదుగా చూస్తాం.

Video Advertisement

Honey bees on a car

ఒకవేళ తిరిగినా కూడా ఏవో ఒకటి, రెండు అలా విడివిడిగా తిరుగుతాయి. కానీ ఒక గుంపు తేనెటీగలు జనసంచారం ఉన్న ప్రదేశంలో మాత్రం చాలా వరకు రావు. కానీ ఒకసారి దాదాపు 20 వేల తేనెటీగలు ఒక కార్ కి పట్టుకున్నాయి. ఈ సంఘటన ఐదు సంవత్సరాల క్రితం జరిగింది. కారోల్ హోవార్త్ అనే ఒక 68 సంవత్సరాల మహిళ తన కార్ లో హావెర్ ఫారెస్ట్ కి వెళ్లారు.

Honey bees on a car

అక్కడి నుంచి వచ్చిన తర్వాత తన కార్ పార్కింగ్ చేశారు. ఆ తర్వాత పార్కింగ్ లో ఉన్న కార్ వెనకాల చూస్తే కార్ మీద తేనెటీగల గుంపు ఉంది. అందుకు కారణం రాణి తేనెటీగ కార్ లో ఇరుక్కుపోయింది. దాని కోసం మిగిలిన తేనెటీగలన్ని వచ్చి ఆ కార్ మీద వాలాయి.

Honey bees on a car

తేనెటీగలను తీసే వ్యక్తిని పిలిపించి ఆ తేనెటీగలు అన్నిటినీ తీయించారు. బీ కీపర్ వచ్చి ఆ తేనెటీగలు అన్నిటినీ తీశాడు. ఈ సంఘటన జరిగి ఐదు సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ చాలా చోట్ల ఈ విషయం గురించి చర్చించుకుంటారు. అప్పట్లోనే అంత వైరల్ అయ్యింది ఈ విషయం.


End of Article

You may also like